అంటే…అంటే..ఎంటర్ టైన్మెంట్ గ్యారంటీ

భిన్న సాంప్రదాయాలకు చెందిన ఇద్దరు ప్రేమించుకోవడం, పెద్దలు కిందా మీదా అయిపోవడం..ఏజ్ ఓల్డ్ అండ్ హిట్ గ్యారంటీ సబ్జెక్ట్. అయితే ఇది సీరియస్ లవ్ జానర్ లో కాకుండా ఫన్ ట్యూన్ లో అందిస్తే…అలాగే…

భిన్న సాంప్రదాయాలకు చెందిన ఇద్దరు ప్రేమించుకోవడం, పెద్దలు కిందా మీదా అయిపోవడం..ఏజ్ ఓల్డ్ అండ్ హిట్ గ్యారంటీ సబ్జెక్ట్. అయితే ఇది సీరియస్ లవ్ జానర్ లో కాకుండా ఫన్ ట్యూన్ లో అందిస్తే…అలాగే అక్కడితో ఆగకుండా చిన్న ఫన్ ట్విస్ట్ జోడిస్తే…అంటే సుందరానికి టీజర్ చూస్తుంటే ఇలాగే అనిపిస్తుంది. 

ఈ మధ్యకాలంలో హీరో నాని అవుట్ అండ్ అవుట్ ఫన్ అండ్ ఎంటర్ టైనర్ అందించలేదు. రకరకాల కథలు ట్రయ్ చేస్తూ వచ్చారు. మళ్లీ ఇన్నాళ్లకు పూర్తి ఎంటర్ టైనర్ అందిస్తున్నారు.  

సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుర్రాడిగా నాని, ఏమాయె చేసావెలో సమంత మాదిరిగా నజ్రియా కనిపించారు టీజర్. 

కేవలం రెండు మతాల కుటుంబాల మధ్య లవ్ ట్రాక్ మాత్రమే కాకుండా, వేరే ఫన్ ట్విస్ట్ కూడా యాడ్ చేసినట్లు టీజర్ లో హింట్ ఇచ్చారు. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దర్శకుడు వివేక్ ఆత్రేయ. జూన్ 12న విడుదల.