రెండు కాదు, 3 సినిమాలు.. హీరో ప్రకటన

హీరో నిఖిల్ నుంచి ఈ ఏడాది 2 సినిమాలు కచ్చితంగా వస్తాయనేది అందరికీ తెలిసిన విషయం. ఆల్రెడీ 4 నెలలు గడిచిపోతున్నాయి కాబట్టి, మిగిలిన 8 నెలల్లో మినిమం గ్యాప్ లో 18 పేజెస్,…

హీరో నిఖిల్ నుంచి ఈ ఏడాది 2 సినిమాలు కచ్చితంగా వస్తాయనేది అందరికీ తెలిసిన విషయం. ఆల్రెడీ 4 నెలలు గడిచిపోతున్నాయి కాబట్టి, మిగిలిన 8 నెలల్లో మినిమం గ్యాప్ లో 18 పేజెస్, కార్తికేయ-2 వస్తాయని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే నిఖిల్ మాత్రం ఒప్పుకోవడం లేదు. ఈ 8 నెలల్లో తన నుంచి 3 సినిమాలు వస్తాయని చెబుతున్నాడు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించాడు కూడా.

కార్తికేయ-2 సినిమా విడుదల తేదీ ఆల్రెడీ వచ్చేసింది. జులై 22న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇక గీతాఆర్ట్స్2 బ్యానర్ లో చేస్తున్న 18-పేజెస్ కూడా దాదాపు సిద్ధమైంది. ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే ఓ మంచి టైమ్ చూసి రాబోతోంది. అయితే ఇప్పుడీ 2 సినిమాలతో పాటు నిఖిల్ చేస్తున్న స్పై అనే మూవీని కూడా ఇదే ఏడాది విడుదల చేయబోతున్నారు.

ఎడిటర్ గ్యారీని దర్శకుడిగా పరిచయం చేస్తూ, నిర్మాత రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా స్పై. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. అదే పోస్టర్ లో దసరా రిలీజ్ అని కూడా ప్రకటించారు. ఇలా తన 3 సినిమాలతో ఓ పోస్టర్ తయారుచేసి, 2022 రిలీజ్ అంటూ పోస్ట్ పెట్టాడు నిఖిల్.

ప్రస్తుతానికి నిఖిల్ లైనప్ నుంచి రిలీజ్ డేట్ పై క్లారిటీ లేని సినిమా 18-పేజెస్ మాత్రమే. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించబోతున్నారు. ప్రచారం ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఫోర్త్ వేవ్ ప్రభావం లేకపోతే.. నిఖిల్ నుంచి రాబోయే 8 నెలల్లో 3 సినిమాలు రావడం పక్కా.