‘తానా’ తందానా.. కొట్టుకున్న లోకేష్-ఎన్టీఆర్ ఫ్యాన్స్

అమెరికాలో తానా మహాసభలు… వెంకయ్యనాయుడు, ఎన్వీ రమణ లాంటి ప్రముఖులు హాజరయ్యారు. బాలకృష్ణ, నిఖిల్ లాంటి హీరోలు వచ్చారు. ఇళయరాజా, సునీత, చిత్ర లాంటి సింగర్స్ ప్రదర్శనలిచ్చారు. ఇలాంటి వేదికపై టీడీపీ రాజకీయాలు భగ్గుమన్నాయి.…

అమెరికాలో తానా మహాసభలు… వెంకయ్యనాయుడు, ఎన్వీ రమణ లాంటి ప్రముఖులు హాజరయ్యారు. బాలకృష్ణ, నిఖిల్ లాంటి హీరోలు వచ్చారు. ఇళయరాజా, సునీత, చిత్ర లాంటి సింగర్స్ ప్రదర్శనలిచ్చారు. ఇలాంటి వేదికపై టీడీపీ రాజకీయాలు భగ్గుమన్నాయి. ఛీప్ గా.. నారా లోకేష్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. కొందరి చొక్కాలు చిరిగాయి.

ఎప్పట్లానే 23వ తానా మహాసభలు ప్రశాంతంగా, ఘనంగా ప్రారంభమయ్యాయి. ఓవైపు సభ సీరియస్ గా సాగుతుంటే, మరోవైపు హాజరైన తెలుగువాళ్లలో కొంతమంది జై ఎన్టీఆర్ నినాదాలు చేశారు. అయితే అక్కడున్న టీడీపీ నేతలకు, మరీ ముఖ్యంగా నారా లోకేష్ వర్గీయులకు అది నచ్చలేదు.

దీంతో జై ఎన్టీఆర్ నినాదాలు చేసిన వ్యక్తులపై విరుచుకుపడ్డారు నారా లోకేష్ వర్గీయులు. పిడిగుద్దులు కురిపించారు. ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఏమాత్రం తగ్గలేదు. చేతికందిన వస్తువుతో ఎదురుదాడికి దిగారు. దీంతో ఇదెక్కడి ఖర్మరా బాబూ అంటూ మిగతా తెలుగువాళ్లు తలలుపట్టుకున్నారు.

దేశాలు దాటినా అదే పిచ్చి..

టీడీపీలో 'ఎన్టీఆర్ చిచ్చు' రావణకాష్టంలా రగులుతూనే ఉంది. ఎప్పుడైతే చంద్రబాబు, తన కొడుకు లోకేష్ కు ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టారో అప్పట్నుంచే జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. చంద్రబాబు ఎక్కడికెళ్లినా జై ఎన్టీఆర్ నినాదాలు, ఫ్లెక్సీలు కామన్ అయిపోయాయి.

ఒక దశలో చంద్రబాబు నియోజకవర్గ కేంద్రం కుప్పంలోనే 'జై ఎన్టీఆర్' జెండా ఎగరేశారు అభిమానులు. ఆ తర్వాత లోకేష్ చేస్తున్న పాదయాత్రల్లో కూడా అడుగడుగునా ఎన్టీఆర్ అంశం ప్రస్తావనకు వస్తూనే ఉంది. ఎన్నోసార్లు లోకేష్ అసహనం వ్యక్తం చేశాడు కూడా.

ఇప్పుడిలా అమెరికాలో లోకేష్ వర్గీయులు, ఎన్టీఆర్ అభిమానులు కొట్టుకోవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన తానా మహాసభల్లో, ఓ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం పెరగడం వల్లనే ఇదంతా జరిగిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.