వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారని తెలిసింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఒంగోలు జిల్లా బాధ్యతలు అప్పగిస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ తరపున పోటీ చేసిన సంగతి తెలిసిందే. చెవిరెడ్డి ఓడిపోయారు.
తాజాగా చెవిరెడ్డిని ఒంగోలు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించాలనే ఆలోచనలో జగన్ ఉన్నారని తెలిసింది. దీంతో ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయన జగన్ వద్దకెళ్లి తన మనసులో మాటను కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారని సమాచారం.
స్థానికేతరుడైన చెవిరెడ్డికి ఒంగోలు వైసీపీ బాధ్యతలు అప్పగిస్తే, తాను పార్టీని వీడుతానని జగన్‌కు తేల్చి చెప్పి వచ్చినట్టు తెలిసింది. దీంతో జగన్ ఖంగుతిన్నారని సమాచారం. చెవిరెడ్డికి ఒంగోలు బాధ్యతలు అప్పించాలనేది కేవలం ఆలోచన దశలోనే ఉన్నట్టు బాలినేనితో జగన్ అన్నారని సమాచారం. తమ జిల్లాలో వైసీపీ జిల్లా అధ్యక్షుడయ్యే అర్హతులున్న నాయకులే మీకు కనిపించలేదా? అని జగన్‌ను బాలినేని నిలదీశారని ప్రచారం జరుగుతోంది.
చెవిరెడ్డిలా నమ్మకస్తుడైన, డబ్బు ఖర్చు పెట్టగల నాయకుడు కనిపించలేదని బాలినేనితో జగన్ అన్నారని తెలిసింది. ఇట్లా ఆలోచించే కదా, చెవిరెడ్డిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టింది, మరి ఏమైందని జగన్‌ను బాలినేని గట్టిగానే నిలదీసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. జగన్ వద్ద సమాధానం కరువైనట్టు సమాచారం. చెవిరెడ్డి విషయంలో జగన్‌తో అమీతుమీకి బాలినేని సిద్ధమయ్యారు.
ఒక్క నెలలోనే మార్కులు వేస్తె …. జగనన్న కు, balineni ki ఎన్ని మార్కులు వేయాలి ?