ఇలా పెళ్లి చేసుకున్నారు.. అలా పనిలో పడ్డారు

రణబీర్ కపూర్, అలియాభట్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్ల పెళ్లి ఎంత సింపుల్ గా జరిగిందో, పెళ్లి తర్వాత వీళ్లు చేస్తున్న పనులు కూడా అంతే సింపుల్ గా ఉన్నాయి. ఏమాత్రం హడావిడి…

రణబీర్ కపూర్, అలియాభట్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్ల పెళ్లి ఎంత సింపుల్ గా జరిగిందో, పెళ్లి తర్వాత వీళ్లు చేస్తున్న పనులు కూడా అంతే సింపుల్ గా ఉన్నాయి. ఏమాత్రం హడావిడి లేకుండా కాపురం మొదలుపెట్టిన ఈ జంట, గ్యాప్ తీసుకోకుండా తమ సినిమా పనుల్లో పడిపోయింది

అవును.. పెళ్లి తర్వాత రణబీర్-అలియా ఏ దేశానికి హనీమూన్ కు వెళ్తారంటూ ఓ రేంజ్ లో బాలీవుడ్ లో చర్చ జరిగింది. కనీసం 2 వారాలైనా వాళ్లు గ్యాప్ తీసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ రణబీర్, 2 రోజులు కూడా గ్యాప్ తీసుకోలేదు.

పెళ్లయిన మరుసటి రోజే ఓ ప్రొడక్షన్ హౌజ్ లో ప్రత్యక్షమయ్యాడు రణబీర్ కపూర్. ఓ సినిమాకు సంబంధించి కథా చర్చల్లో పాల్గొన్నాడు. ప్రస్తుతం లవ్ రంజన్ ప్రాజెక్టుతో బిజీగా ఉన్న ఈ నటుడు, మరికొన్ని రోజుల్లో హిమాచల్ ప్రదేశ్ వెళ్లబోతున్నాడు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో యానిమల్ సినిమాను స్టార్ట్ చేస్తాడు

అటు అలియాభట్ కూడా ప్రస్తుతానికి రెస్ట్ తీసుకుంటున్నప్పటికీ, త్వరలోనే రణ్వీర్ సింగ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతోంది. మరోవైపు బ్రహ్మాస్త్ర ప్రచారం కూడా ప్రారంభించబోతోంది. ఇందులో భర్త రణబీర్ తో కలిసి నటించింది అలియా.

ఇలా కొత్త భార్యాభర్తలిద్దరూ పెళ్లి తర్వాత సింపుల్ గా తమ లైఫ్ ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం చేతిలో ఉన్న కమిట్ మెంట్స్ ను కొద్దిగా పూర్తిచేసిన తర్వాత గ్యాప్ తీసుకోవాలని భావిస్తోంది ఈ జంట. మరోవైపు రణబీర్ కపూర్ తండ్రికి చెందిన కృష్ణరాజ్ ప్యాలెస్ ఇంకా సిద్ధం కాలేదు. అందులో పనులు పూర్తయిన తర్వాత ఈ జంట, ఆ బంగ్లాలోకి షిప్ట్ అవుతుంది. 

ప్రస్తుతం ఎక్కడైతే పెళ్లయిందో, అదే ఇంట్లో రణబీర్-అలియా కాపురం ఉంటున్నారు. వీళ్లిద్దరూ అదే ఇంట్లో ప్రేమించుకున్న సంగతి తెలిసిందే.