వెంక‌య్య సాక్షిగా జ‌గ‌న్ బాట‌లో బాబు!

టీటీడీ నుంచే త‌న ప్ర‌భుత్వం సంస్క‌ర‌ణ‌లు చేప‌డుతుంద‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు చెప్పారు. కానీ వెంక‌య్య సాక్షిగా మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌బాట‌లో చంద్ర‌బాబు నాయుడు న‌డుస్తున్నారు. దేవాదాయ‌, ధ‌ర్మాదాయ చ‌ట్టం ప్ర‌కారం…

టీటీడీ నుంచే త‌న ప్ర‌భుత్వం సంస్క‌ర‌ణ‌లు చేప‌డుతుంద‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు చెప్పారు. కానీ వెంక‌య్య సాక్షిగా మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌బాట‌లో చంద్ర‌బాబు నాయుడు న‌డుస్తున్నారు. దేవాదాయ‌, ధ‌ర్మాదాయ చ‌ట్టం ప్ర‌కారం టీటీడీ ఈవోగా డిప్యూటీ సెక్ర‌ట‌రీ లేదా క‌లెక్ట‌ర్ స్థాయి అధికారి అర్హులు. అలాగే జేఈవోగా జాయింట్ క‌లెక్ట‌ర్ హోదా అధికారి అర్హులు. అయితే ఐఏఎస్ అధికారి కాని ధ‌ర్మారెడ్డిని టీటీడీ ప్ర‌త్యేక అధికారిగా, అద‌న‌పు ఈవోగా గ‌తంలో కాంగ్రెస్‌, ఆ త‌ర్వాత వైసీపీ ప్ర‌భుత్వం నియ‌మించింది.

ఈ నియామ‌కాన్ని టీడీపీ మొద‌టి నుంచి తీవ్రంగా వ్య‌తిరేకిస్తూ వ‌చ్చింది. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఐఏఎస్ అధికారి కాని ధ‌ర్మారెడ్డిని ఎలా నియ‌మిస్తార‌ని ప్ర‌శ్నిస్తూ, ఆయ‌న కోస‌మే స్పెష‌ల్ అధికారి పోస్టును సృష్టించార‌ని టీడీపీ నేతలు విమ‌ర్శించారు. ధ‌ర్మారెడ్డిని అడ్డం పెట్టుకుని రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు పొందార‌ని, ఆ ర‌కంగా టీటీడీని అప‌విత్రం చేశార‌ని టీడీపీ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఈ త‌ప్పును స‌రిదిద్దుతామ‌ని కూడా ప్ర‌క‌టించారు.

అయితే కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరిన వెంట‌నే ధ‌ర్మారెడ్డిని తొల‌గించి, ఆయ‌న స్థానంలో ఐఏఎస్ అధికారిని నియ‌మిస్తార‌ని అంతా ఆశించారు. అందుకు భిన్నంగా జ‌గ‌న్ త‌ర‌హాలోనే ఐఆర్ఎస్ అధికారి వెంక‌య్య చౌద‌రి నియామ‌కంపై స్ప‌ష్ట‌త ఇచ్చారు. ఐఆర్ఎస్ అధికారి కావ‌డంతో జేఈవోగా కాకుండా, అద‌న‌పు ఈవో లేదా ప్ర‌త్యేక అధికారి హోదా ఇవ్వాల్సిన దుస్థితి.

ఈ నేప‌థ్యంలో జేఈవో నియామ‌కంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. జ‌గ‌న్ బాట‌లోనే చంద్ర‌బాబు కూడా న‌డుస్తున్నార‌ని త‌ట‌స్థులు, మేధావులు మండిప‌డుతున్నారు. ఇదిలా వుండ‌గా ధ‌ర్మారెడ్డి నియామ‌కం వెనుక జ‌గ‌న్ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలున్నాయ‌ని టీడీపీ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అయితే వెంక‌య్య చౌద‌రి నియామ‌కంపై కూడా సోష‌ల్ మీడియాలో గ‌మ్మ‌త్తైన చ‌ర్చ జ‌రుగుతోంది.

గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో వెంక‌య్య చౌద‌రి గ‌నుల‌ శాఖ ఎండీగా ప‌ని చేశారు. అప్ప‌ట్లో కొంత మంది ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు ఆర్థిక ప్ర‌యోజ‌నాలు క‌లిగించేందుకు ప్ర‌భుత్వానికి న‌ష్టం చేసేలా నిర్ణ‌యాలు తీసుకున్నార‌నే కార‌ణంతో జ‌గ‌న్ స‌ర్కార్ విజిలెన్స్ విచార‌ణ‌కు ఆదేశించింది. ఇప్పుడు ధ‌ర్మారెడ్డిపై కూట‌మి ప్ర‌భుత్వం విజిలెన్స్ విచార‌ణ‌కు ఆదేశించడం కొస‌మెరుపు. ఏ ర‌కంగా చూసినా వెంక‌య్య చౌద‌రిని నియ‌మించాల‌నే చంద్ర‌బాబు నిర్ణ‌యం చూస్తే… జ‌గ‌న్‌ను మ‌క్కికి మ‌క్కి అనుస‌రించార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

3 Replies to “వెంక‌య్య సాక్షిగా జ‌గ‌న్ బాట‌లో బాబు!”

  1. విద్య దీవెన లేదు, వసతి దీవెన లేదు, విదేశీ విద్య దీవెన అసలుకే లేదు.

    ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో ఒక్కో విద్యార్థికి 40,000 కట్టించుకుంటున్నారు. గత 5 ఏళ్లలో లేనిది ఇప్పుడు కొత్తగా ఏమిటి అని అడిగిన ప్రజలకు వెళ్లి ప్రభుత్వాన్ని అడగండి, వాళ్లే వసూలు చేసుకోమంటున్నారు. ఇలా అయితే మన పార్టీ పేరు రెడ్ బుక్కులో మనమే రాసుకోవాలి. ప్రజలు మనల్ని బూ!తు!లు తిట్టుకుంటున్నారు.

    మన్నే సత్యనారాయణ (తెగుల దేశం పార్టీ)

Comments are closed.