ఏ పరాయి మహిళతోనూ అనైతిక సంబంధాల్లేవు!

వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డికి సంబంధించి ఒక అవాంఛ‌నీయ చ‌ర్చ జ‌రుగుతోంది. క‌నీసం మ‌హిళా అధికారి అని కూడా చూడ‌కుండా, ఆమెపై ఇష్టానురీతిలో మీడియా డిబేట్స్ నిర్వ‌హిస్తోంది. ఈ ధోర‌ణి తెలుగు జ‌ర్న‌లిజం నైతిక…

వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డికి సంబంధించి ఒక అవాంఛ‌నీయ చ‌ర్చ జ‌రుగుతోంది. క‌నీసం మ‌హిళా అధికారి అని కూడా చూడ‌కుండా, ఆమెపై ఇష్టానురీతిలో మీడియా డిబేట్స్ నిర్వ‌హిస్తోంది. ఈ ధోర‌ణి తెలుగు జ‌ర్న‌లిజం నైతిక విలువ‌ల ప‌త‌నానికి ప‌రాకాష్ట అనే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. రాజ‌కీయ కాలుష్యం జ‌నంలో అస‌హ‌నం, ఆగ్ర‌హం తెప్పిస్తోంది.

ఈ నేప‌థ్యంలో త‌న‌పై జ‌రుగుతున్న దుర్మార్గ ప్ర‌చారంపై విజ‌య‌సాయిరెడ్డి మ‌రోసారి సోష‌ల్ మీడియా వేదిక‌గా వివ‌ర‌ణ ఇచ్చారు. ఎక్స్ వేదిక‌గా ఆయ‌న ఒక పోస్టు పెట్టారు. అదేంటంటే…

“అవాస్తవాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చెలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. శాంతి కళింగిరిని 2020 సంవత్సరం ఏసీ ఎండోమెంట్స్ ఆఫీసర్ గా వైజాగ్ సీతమ్మధార ఆఫీస్ లో మొట్టమొదటగా మీట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూతురుగానే భావించాను. ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా చేశాను. తనకు కొడుకు పుట్టాడంటే వెళ్లి పరామర్శించాను. మా తాడేపల్లి ఇంటికి తీసుకొస్తే ఆశీర్వదించాను. ఏ పరాయి మహిళతోను అనైతిక/అక్రమ సంబంధాలు లేవు. నేను నమ్మిన దేవ దేవులు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా చెప్తాను”

విజ‌య‌సాయిరెడ్డి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే… తన‌పై చేస్తున్న డిబేట్ల‌పై ఎంత ఎక్కువ స్పందిస్తే, అంత త‌న‌కు న‌ష్టం జ‌రుగుతుంద‌ని. ఇటీవ‌ల మీడియా స‌మావేశం నిర్వ‌హించి విజ‌య‌సాయి ఆవేశ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు త‌న‌కు ప‌రాయి మ‌హిళ‌ల‌తో ఎలాంటి అనైతిక సంబంధాలు లేవ‌ని, అది కూడా క‌లియుగ దైవం శ్రీ‌వెంక‌టేశ్వ‌ర‌స్వామి సాక్షిగా కూడా చెబుతాన‌ని ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. రాజ‌కీయ దురుద్దేశాల‌తో అక్ర‌మ సంబంధాలు అంట‌క‌ట్టేవారికి ఇలాంటి వివ‌ర‌ణ‌లు చెవికెక్కుతాయ‌ని అనుకోవ‌డం దురాశే అని ప‌లువురు కామెంట్ చేస్తున్నారు.

21 Replies to “ఏ పరాయి మహిళతోనూ అనైతిక సంబంధాల్లేవు!”

  1. // రాజ‌కీయ దురుద్దేశాల‌తో అక్ర‌మ సంబంధాలు అంట‌క‌ట్టేవారికి ఇలాంటి వివ‌ర‌ణ‌లు చెవికెక్కుతాయ‌ని అనుకోవ‌డం దురాశే అని ప‌లువురు కామెంట్ చేస్తున్నారు.//

    గతం లో “పప్పు రెడ్డి” అని ట్వీట్ చేసేవారు విజయ సాయి రెడ్డి గారు..

    పాపం.. ఆ “పలువురికి” ఈ విషయం తెలుసుకోలేదేమో..

  2. // రాజ‌కీయ దురుద్దేశాల‌తో అక్ర‌మ సంబంధాలు అంట‌క‌ట్టేవారికి ఇలాంటి వివ‌ర‌ణ‌లు చెవికెక్కుతాయ‌ని అనుకోవ‌డం దురాశే అని ప‌లువురు కా మెంట్ చేస్తున్నారు.//

    గతం లో “పప్పు రెడ్డి” అని ట్వీట్ చేసేవారు విజయ సాయి రెడ్డి గారు..

    పాపం.. ఆ “పలువురికి” ఈ విషయం తెలుసుకోలేదేమో..

    1. అరెరే .. పెద్ద సమస్యే వచ్చి పడిందే ..

      మ్యాటర్ లేదని రిపోర్ట్ వస్తే.. చెక్క గాడని తెలిసిపోతుంది.. ఆ తర్వాత వాడు వేసే ట్వీట్స్ కామెడీ అయిపోతాయి..

      మ్యాటర్ ఉందని రిపోర్ట్ వస్తే.. అక్రమ సంబంధం ఉందని తెలిసిపోతుంది.. ఆ తర్వాత వాడు వేసే ట్వీట్స్ కి కామెంట్స్ ఆఫ్ చేసుకోవాలి..

      1. బాబుని వంశి తిట్టినప్పుడు యిలాగే DNA రిపోర్ట్ తీసి మ్యాటర్ రిపోర్ట్ తీసి …రెండు చూసుకొని ఆగలేక ప్రజలముందు ఏడిచాడా బాబు…నిజం చూడలేక, చెప్పలేక.

        1. అవును షర్మిల వైఎస్ఆర్ సంతానం కాదు అని పార్టీ వాళ్ళు కూడా ఇలాగే thelcharu

  3. ఒకడు(విసా) కని ఇంకొకడు(సుభాష్) పేరు పెట్టారు. ఇప్పటిదాకా ఆస్తులకి బినామీలు వున్నాయి కానీ పిల్లలకి బినామీలు లేవు. వైసీపీ అక్రమాలు క్రొత్త పుంతలు తొక్కుతున్నాయి.

  4. :red book rules 

    ఇప్ప టివరకూ 36 మం ది రాజకీయ హత్య లకు గురయ్యా రు.

    ఎన్ని కేసులు పెట్టిం చుకుం టే అం త పెద్ద పదవి

    ఎన్ని హత్యలు చేతే అంత పెద్ద పదవి. ఆ ప్రకారం ఇప్పు డు మర్డర్లు చేసినవారికి మం త్రి హోదా ఏమైనా కల్పి స్తారేమో చూడాలి.

  5. రెడ్ బుక్ రాజ్యాంగం

    రోజుకి కనీసం 5 మర్డర్లు (పేపర్ల లెక్కలో రోజుకో మర్డర్)

    రోజుకి కనీసం 5 రేపులు (పేపర్ల లెక్కలో రోజుకో రేపు)

    రోజుకి కనీసం 5 టన్నులు ఇసుక ఒక్కో గుల కమిటీ వాడికి (పేపర్ల లెక్కలో లేదు)

    నెలకి పెన్షన్ కి 500 కమిషన్ (అడిగితే వాళ్ళ పేరు పీకేయండి)

    గుల కమిటీ గుమ్మం లో ఇవ్వండి.

    75% అంగాలు లేనివారే దివ్యంగులు వాళ్ళ పేర్లే తీసుకోండి. వాళ్లలో మన పార్టీ వాళ్ళకే పెన్షన్.

    ఫ్రీ బస్, డీజిల్ డబ్బులు కట్టాలి.

    మిగతా సూపర్ సిక్స్ పథకాలు అన్ని గాలికి వదిలేశాము.

Comments are closed.