అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో గత అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారు. ఈ ఘటన వెనుక భూకబ్జాదారుల హస్తం ఉన్నట్టు ప్రభుత్వం భావిస్తోంది. కీలకమైన దస్త్రాలను కాల్చివేసినట్టు ప్రభుత్వం అనుమానిస్తోంది.
దీంతో ఘటన వెనుక అసలు నిజాల్ని బయట పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. వెంటనే మదనపల్లెకు హెలికాప్టర్లో వెళ్లాలని డీజేపీ ద్వారకాతిరుమలరావును చంద్రబాబు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో డీజీపీతో పాటు సీఐడీ చీఫ్ కూడా మదనపల్లెకు పయనమయ్యారు. మదనపల్లె ఘటనపై సీఎం కావడం, వెంటనే నిజాల్ని తేల్చాలని ఆదేశించడం అభినందించదగ్గ విషయం.
ఇదే రీతిలో నంద్యాలలో బాలిక అదృశ్యం, హత్యాచారంపై కూడా స్పందించి వుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తద్వారా బాలికలు, మహిళలకు తన ప్రభుత్వం అండగా వుంటుందనే సంకేతాలు పంపినట్టు అయ్యేది. ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు హత్యాచారానికి పాల్పడడం దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది.
మరీ ముఖ్యంగా రెండు వారాలవుతున్నా కనీసం బాలిక శవం కూడా దొరక్కపోవడం అత్యంత ఆవేదన కలిగించే విషయం. బాలిక తల్లిదండ్రులు తమ పాప మృతదేహాన్ని అప్పగించాలని డిమాండ్ చేయడం న్యాయమైంది. నిజానికి ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం తక్షణం సీరియస్‌గా స్పందించాలి.
మదనపల్లె ఘటనపై సీఎం సీరియస్‌గా స్పందించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఆన్లైన్లో నడుస్తున్నాయి. భూముల దస్త్రాలన్నీ ఆన్లైన్లో నిక్షిప్తమయ్యాయి. కావున భూముల దస్త్రాలను లేకుండా చేయాలని ఎవరైనా అనుకున్నా సాధ్యమయ్యే పనికాదు. మదనపల్లె ఘటన వెనుక కుట్ర ఉందని అనుకున్నా, అలాంటి చర్యలకు పాల్పడడం వృథా ప్రయాస.
ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వరుస హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయపరమైన దాడులపై చంద్రబాబునాయుడు, ప్రభుత్వ పెద్దలు రియాక్ట్ కాకపోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ మహిళలపై అఘాయిత్యాలపై హోంశాఖ మంత్రిగా ఒక మహిళ ఉన్నా చోటు చేసుకోవడం ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే అంశం. ఈ విషయాన్ని చంద్రబాబు గ్రహిస్తే మంచిది.
land records anni onlne lo vuntaei land records 3 places vuntaei . registration office lo vundevi imp . revenue department daggara vundevi non imp . ivanni okati chesthe kaani land issues solve avvavu
YCP gov edo jarigipoeindi . files thagalabeduthunnaru ani prove cheyydaniki fakes spread chesthunnaru anthe .
land records online lo vuntaei + 3 places maintain chestharu . YCP gov lo edo jarigipoeindi ani cheppadaniki akkada thagalabeduthunnaru . okkada chesthunnaru ani cheppukovadaniki thappa inka emi upyogam ledu
Neechulu Eppatiki neechule
‘మదనపల్లె ఘటనపై సీఎం కావడం’
ఏందో ఐబీ చదువుల రాతలు… ఒక పట్టాన అర్థం కావు…