ఎమ్బీయస్‍: అమరావతి సందడి శురూ!

ఎన్నికలలో జగన్ ఓటమికి కారణాలేమిటి? అనే అంశంపై నా విశ్లేషణ కోసం ఎదురు చూసేవారు యింకొంత కాలం ఆగాలి. నేను ఎన్డీఏ సెంట్రిక్‌గా దేశంలో రాష్ట్రాలన్నిటినీ వరుసగా పరామర్శిస్తున్నాను. సౌత్ జోన్‌కి వచ్చినపుడు అప్పుడు…

ఎన్నికలలో జగన్ ఓటమికి కారణాలేమిటి? అనే అంశంపై నా విశ్లేషణ కోసం ఎదురు చూసేవారు యింకొంత కాలం ఆగాలి. నేను ఎన్డీఏ సెంట్రిక్‌గా దేశంలో రాష్ట్రాలన్నిటినీ వరుసగా పరామర్శిస్తున్నాను. సౌత్ జోన్‌కి వచ్చినపుడు అప్పుడు ఆంధ్ర గురించి రాయబోతున్నాను. ఇక తెలుగుదేశం పాలన, హామీల అమలు గురించి కూడా యిప్పుడే రాద్దామనుకోవటం లేదు. ఐదేళ్ల విరామం తర్వాత అధికారంలో కుదురుకోవడానికి సమయం పడుతుంది కదా. అయితే అమరావతి గురించి జరుగుతున్న హడావుడి కొట్టవచ్చినట్లు కనబడుతోంది కాబట్టి, కేంద్ర బజెట్‌లో దానికై 15 వేల కోట్ల కేటాయింపుపై హర్షధ్వానాలు చెలరేగుతున్నాయి కాబట్టి దాని గురించి వెంటనే రాయవలసిన అవసరం కనబడింది.

టిడిపి పార్టీకి గాని, దాని సమర్థులకు కానీ, నిధులు సమకూర్చేవారికి కానీ అమరావతి అనేది ప్రధాన అంశమనేది అందరికీ తెలుసు. పెట్టుబడి పెట్టిన వారందరూ ఒకే కులానికి చెందిన వారు కాదు. చోదకులు, ప్రచారకులు కమ్మవారే అయినా, అక్కడ పెడితే సిరులు కురుస్తాయని నమ్మి అనేక ప్రాంతాల వారు, అనేక కులస్తులు, అనేక వర్గాల వారూ అప్పులు సైతం చేసి అక్కడ స్థలాలు కొన్నారు. అమరావతి మహానగరాన్ని నిర్మించడానికి మోదీ సాయపడతాడని మనసారా నమ్మారు. జగన్ వచ్చాకనే అమరావతి అభివృద్ధి సడన్‌గా ఆగిపోయిందని చాలామంది కథనాలు వెలువరిస్తూంటారు. అది నిజం కాదు.

బాబు హయాంలోనే మహానగరం రూపు దిద్దుకోవడం లేదని గ్రహించి, అమరావతి భూముల రేట్లు 2017 నాటికి పడిపోసాగాయి. ఏమీ చేయలేక పోతున్నాడని పెట్టుబడిదారులు బాబుపై విమర్శలు గుప్పించారు. ఆ వైఫల్యంలో తన పాత్ర ఏమీ లేదని చూపించుకోవడానికే బాబు మోదీపై ధ్వజమెత్తి కేంద్రం సహకరించ లేదని గణాంకాలు వల్లించారు, దీక్షలు చేశారు. 2018 మార్చిలో వేరు పడ్డారు. తీరా చూస్తే మోదీ నెగ్గేశారు. బాబు ఘోరంగా ఓడిపోయారు. దాంతో అమరావతిపై ఆశలు పెట్టుకున్నవారందరూ కళవెళ పడ్డారు. ఫలితాలు రాగానే నాకు చాలామంది రాశారు – ఇప్పుడు అమరావతి గతి ఏమిటి? అని. సమాధానంగా అప్పుడు ‘‘అమరావతి ఏమౌతుంది?’’ అనే వ్యాసం రాశాను.

దానిలో పాయింట్లు మళ్లీ రాయడం అనవసరం కానీ, మహానగరం కట్టడంపై ఎంతో మక్కువ, అవసరం ఉన్న చంద్రబాబు హయాంలోనే అది అసాధ్యమని తేలిపోయింది కాబట్టి, సేకరించిన భూములను రైతు సహకార సంఘాలకు యిచ్చి, వ్యవసాయం చేయించడమే మంచి పరిష్కారం అని రాశాను. ఇంతటి భూరి ప్రణాళిక వాస్తవరూపం దాల్చాలంటే ఆసక్తి, శక్తి రెండూ ఉండాలి. శక్తి బాబుకీ, జగన్‌కీ యిద్దరికీ లేదు. జగన్‌కు ఆసక్తీ లేదు. రాజధాని అంటే సాదాగా ఉంటే చాలదా? మహానగరం కావాలా? అనే దృక్పథం అతనిది. అలా అనుకుని ఏదో చిన్న స్థాయిలోనే రాజధాని కొద్దికొద్దిగా కడుతూ ఉంటే సరిపోయేది. రాష్ట్ర బజెట్ చాలదు, కేంద్రం సహకరించటం లేదు అని చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తే ప్రజలు సరేలే అని ఊరుకునేవారు.

కానీ జగన్ దాన్ని శత్రుక్షేత్రంగా పరిగణించి అమరావతి ప్రాధాన్యతను తగ్గిద్దామని చూశాడు. దానిలో రూపాయి పెట్టుబడి పెట్టినా బాబు దాన్ని తన ఖాతాలో వేసుకుంటాడని భయపడ్డాడు. టిడిపి వాళ్లు అంటూంటారు – ‘బాబు సైబరాబాదు కట్టారు కదాని, తర్వాత వచ్చిన వైయస్ దాన్ని ఆపలేదు. వైయస్ కొడుకు జగన్ మాత్రం అమరావతిని ఆపేశాడు.’ అని. సైబరాబాదుకి పునాది రాయి బాబుకి ముందే పడింది. బాబు తర్వాత కాంగ్రెసు ప్రభుత్వం, ఆ తర్వాత తెరాస ప్రభుత్వం దాని అభివృద్ధికి ఎంతో చేశాయి. మొత్తమంతా కలిపి చూస్తే బాబు వాటా తక్కువే. అయినా సైబరాబాదు అనగానే ఆ క్రెడిట్ అంతా ఎవరి ఖాతాలో పోతోంది? బాబు ఖాతాలో! తెలుగు మీడియాను ఆ లెవెల్లో మేనేజ్ చేస్తాడాయన!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల్లో ఆయన హయాంలో మాత్రమే అభివృద్ధి జరిగినట్లు బిల్డప్ యిస్తుంది మీడియా. బాబు అనునిత్యం, అనుక్షణం అదే ధోరణిలో మాట్లాడతాడు. 2018లో తెలంగాణ ఎన్నికలలో టిడిపి, కాంగ్రెసు పొత్తు పెట్టుకున్నపుడు వైయస్ చేసిన ప్రాజెక్టులను కూడా బాబు తన ఖాతాలో వేసుకుని మాట్లాడుతూంటే పక్కనే ఉన్న రాహుల్ కిమ్మనలేదు. ఇవన్నీ చూసిన జగన్ అమరావతి స్థాయిని ఎంత తగ్గిస్తే బాబుని అంత తగ్గించినట్లు అవుతుందని అనుకున్నాడు. దానికి అనుగుణంగా ఏదో సంసారపక్షంగా రాజధాని పూర్తి చేసి, తక్కిన చోట్ల డెవలప్ చేసుకుంటూ పోతే సరిపోయేది. కానీ మూడు రాజధానులు అన్నాడు. అమరావతి మూడో వంతు రాజధాని మాత్రమే అన్నాడు. అది కూడా లెజిస్లేటివ్ రాజధాని మాత్రమే అన్నాడు.

రాజధానుల మాట ఎత్తినప్పుడే నేను ఎత్తి చూపాను – హైకోర్టు ఉన్నంత మాత్రాన న్యాయరాజధాని, అసెంబ్లీ ఒక సెషన్ పెట్టినంత మాత్రాన లెజిస్లేటివ్ రాజధాని అయిపోవని. దేశంలో అనేక రాష్ట్రాలలో వేర్వేరు చోట్ల ఉన్నాయి కానీ వాళ్లెవరూ రాజధాని అనరు కదా! అదేమిటో జగన్‌కే కాదు, బాబుకి కూడా రాజధాని పదంపై మోజు. ఇప్పుడు విశాఖను ఆర్థిక రాజధాని చేస్తారట. మూడు రాజధానులంటే మూడు ముక్కలాట అని జగన్‌ను నిరంతరంగా వెక్కిరించిన టిడిపి, సంబంధింత మీడియా యిప్పుడు రెండు ముక్కలాట అని ఎందుకు అనదో నాకు తెలియదు. ఒక దశలో బాబు ఆధ్యాత్మిక రాజధాని, సాంస్కృతిక రాజధాని… అంటూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చేసేస్తాం అని చెప్పుకొచ్చారు. అప్పుడు 13 ముక్కల సెట్టు పూర్తయింది అని ఎవరూ ఎద్దేవా చేయలేదు మరి.

పోనీ రాజధాని పేరు వదిలేసినా, వికేంద్రీకరణ అనుకున్నా, కర్నూలుకి హైకోర్టు యివ్వడం న్యాయం, వైజాగ్ అమరావతిలలో వైజాగ్‌లో అప్పుడప్పుడు అసెంబ్లీ సెషన్లు పెట్టి, అమరావతిని ఎగ్జిక్యూటివ్ సెంటర్‌గానే కంటిన్యూ చేయాలి. ఎందుకంటే అప్పటికే అక్కడ సెక్రటేరియట్, గవర్నరు భవనం వగైరాలు వచ్చేశాయి కనుక. సెక్రటేరియట్ సిబ్బందిని హైదరాబాదు నుంచి బతిమాలి తీసుకెళ్లినపుడు వాళ్లకు యిళ్ల స్థలాలు యిస్తామని, అనేక విషయాల్లో రాయితీలు యిస్తామని చెప్పారు. మళ్లీ వైజాగ్‌కి తరలిస్తే అక్కడా యిస్తామని జగన్ అన్నాడు. శుద్ధ దండగ వ్యవహారం. అయినా పంతం పట్టి అమరావతి విలువ తగ్గించడానికి జగన్ శతథా చూశాడు. చూశాడు కానీ చేయలేక పోయాడు.

జగన్‌ను బాబు అండర్ ఎస్టిమేట్ చేసినట్లే, బాబుకి అన్ని చోట్లా ఉన్న క్లౌట్‌ను జగన్ అండర్ ఎస్టిమేట్ చేశాడు. కోర్టులు అడ్డు తగిలాయి. ఉద్యమాలు జరిగాయి. అసలు రాష్ట్రానికి రాజధానే లేకుండా పోయిందనే ప్రచారం సాగింది. రాజధాని మారుద్దా మనుకోవడం వరకు కరక్టే కానీ అసలు రాజధాని లేకుండా పోయిందని ఎలా అంటారు? సెక్రటేరియట్ అక్కడే ఉంది, ప్రభుత్వ కార్యాలయాలు అక్కడే ఉన్నాయి. రాష్ట్ర వార్తల డేట్‌లైన్ అంతా అక్కణ్నుంచే వస్తోంది. అయినా అలాగే గోల చేశారు. కోర్టు మొట్టికాయలతో జగన్ బిల్లు వెనక్కి తీసుకున్నాడు. వివేకం ఉంటే 2019 ఎన్నికలలో రాజధానుల వికేంద్రీకరణ అంశాన్ని మానిఫెస్టోలో పెట్టాల్సింది. కానీ యీ లోపునే వైజాగ్‌కి వెళతానంటూ పది, పదిహేను ముహూర్తాలు పెట్టి, ఏ ఒక్కటీ వర్కవుట్ కాక నగుబాటు అయ్యాడు. అయిన కొద్దీ పంతానికి పోయాడు.

ఈ విధంగా అమరావతి పురహరుడు అనే పేరు తెచ్చుకున్నాడు. ‘ప్రపంచ కమ్మవారందరిలో ఐకమత్యం తెచ్చిన జగన్’ అని ఒక కాప్షన్ చూశాను. దానితో పాటు ‘కుల, ప్రాంత, స్థాయీ భేదం లేకుండా అమరావతి పెట్టుబడిదారులను ఏకత్రాటిపై తెచ్చిన జగన్’ అని కూడా చేర్చాల్సింది. జగన్ ఉన్నంతకాలం అమరావతిపై పెట్టిన పెట్టుబడి తిరిగి రాదు అని తేల్చుకున్న వారు జగన్ తిరిగి రాకూడదని క్షుద్రపూజలు చేశారో లేదో తెలియదు కానీ, బాబు తిరిగి రావాలని మాత్రం పూజలు చేశారు, మొక్కులు మొక్కారు, ముడుపులు కట్టారు. పెట్టినది రాబట్టాలంటే మరి కొంత ఖర్చు చేయాలనుకుంటూ నిధులూ యిచ్చారు. పూజలూ, ప్రయత్నాలూ ఫలించాయి. బాబు తిరిగి వచ్చారు. తనపై వాళ్లు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయటం లేదని చూపడానికి వస్తూనే అమరావతి హడావుడి మొదలుపెట్టారు.

ఎన్నికలకు ముందు ‘‘అమరావతి ఎన్నికల అంశం కాదా?’’ అనే వ్యాసం రాశాను. ఐదేళ్లగా హడావుడి చేసిన అమరావతి గురించి ఎన్నికల సమయంలో టిడిపి సందడి చేయలేదేమని ప్రశ్నించాను. చేయకపోయినా, పైకి చెప్పకపోయినా బాబు గద్దె నెక్కగానే అమరావతి గురించే పని మొదలు పెడతారని అందరికీ తెలుసు. ఎన్నికల్లో నెగ్గగానే బాబు ప్రమాణస్వీకారానికి ముందే అమరావతిలో లైట్లు వెలిగాయని, రోడ్లు వెడల్పయ్యాయని వార్తలు విడుదల కావడం ప్రారంభమైంది. ఫలితాలు వచ్చిన మర్నాడే కొందరు భూములు కొన్నారట. రేట్లు 20శాతం పెరిగాయట. ఇక అప్పణ్నుంచి అమరావతి గురించి ఏదో ఒక న్యూస్ వస్తోంది. ‘ఎపి అంటే అమరావతి, పోలవరం అనే మాట కాయిన్ చేశారు. అక్షరమాలలో అ అంటే అమ్మ అన్నట్లు బాబు పాలనలో అ నుంచి హ వరకు అమరావతే కనబడుతుంది.

పోలవరం అనేది కేంద్రం అజమాయిషీలో ఉన్నది. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ కేంద్ర అజమాయిషీలోనే ఉంది. దాని గురించిన మంచిలో, చెడులో దానికి వాటా ఉంది. ఇవాళ బజెట్‌లో కూడా ‘పోలవరం నిర్మాణానికి అండగా నిలుస్తామ’నే అస్పష్ట ప్రకటనే వచ్చింది. అంకెలు రాలేదు. పునరావాస ప్యాకేజి ఖర్చు భరిస్తానని కేంద్రం అనేదాకా పైపై కబుర్లుగానే పరిగణించాలి. పోలవరంది నత్తనడక కాబట్టి ఎంతకాలమైనా చెప్పుకోవచ్చు. దానిపై పెట్టుబడి పెట్టినవారు, ఫలానా టైముకి పూర్తవుతుందని పందాలు కట్టినవారూ లేరు. కానీ అమరావతిలో స్టేక్ హోల్డర్స్ చాలామంది ఉన్నారు. అందువలన ఫోకస్ అంతా అమరావతి పైనే ఉంటుంది. సూపర్ సిక్స్, తక్కిన హామీల గురించి మాట్లాడితే ‘అధికారంలో సరిగ్గా నిలదొక్కుకోలేదు, అప్పుడే వాటి గురించి అడగడం సబబు కాదు’ అని వారించేవారు సైతం ‘అమరావతి విషయంలో మాత్రం యింత హడావుడి ఎందుకు జరుగుతోంది?’ అనేదానికి సమాధానం చెప్పలేరు.

నిజానికి వారు చెప్పనక్కరలేదు కూడా. ప్రజాస్వామ్యానికి నిర్వచనం ‘ప్రజల కోసం, ప్రజల చేత..’లా టిడిపి ఫోకస్ అంతా అమరావతి పైనే ఉంటుంది. ప్రమాణస్వీకారం చేసిన జూన్‌లోనే 29న ఎపి-సిఆర్‌డిఏ (కాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) అమరావతి గవర్న్‌మెంట్ కాంప్లెక్స్ కోసం అంటూ 5 గ్రామాల్లో 1575 ఎకరాలు ఎక్వయిర్ చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డెవలప్ చేస్తామంటూ యిప్పటిదాకా తీసుకున్న భూముల విషయంలో అతీగతీ తేలటం లేదు. భాగస్వాములైన రైతుల విషయంలో న్యాయం జరగలేదు. మార్కెట్ రేటుకి కొనేసి, ప్రభుత్వం సొంతం చేసుకోలేదు. డెవలప్ చేసిన ప్లాట్లు యిస్తామని చెప్పి ప్రభుత్వం మాట తప్పింది. (ముఖ్యమంత్రి ఎవరన్నది ప్రశ్న కాదు, ప్రభుత్వంతో వాళ్లు లావాదేవీలు చేసుకున్నారు).

అది తేలకుండానే కొత్తగా యీ భూమి ఎందుకో బాబు ప్రభుత్వానికే తెలియాలి. నిజానికి ఎన్నికలకు ముందు బాబు ‘‘టైమ్స్ ఆఫ్ ఇండియా’’కు యిచ్చిన యింటర్వ్యూలో ‘‘నేను అమరావతి గురించి సింగపూరు తరహాలో వేసిన పథకాలన్నీ జగన్ వలన నాశనమయ్యాయి.’’ అంటూనే ‘‘ఇప్పుడు అధికారంలోకి వచ్చినా ఒరిజినల్‌గా కన్సీవ్ చేసిన స్థాయిలో దాన్ని కట్టలేము.’’ అని ఒప్పేసుకున్నారు. ‘కానీ కేంద్రం సహాయంతో చేస్తామనే నమ్మకంతో ఉన్నాను.’ అని చెప్పుకున్నారు. ఆ సాయం ఏమిటో యివాళ ఒక ఝలక్ వచ్చింది. బాబు ఒరిజినల్ విజన్ డాక్యుమెంటు ఏమిటి? – ప్రపంచంలో టాప్ త్రీ (నారాయణ యిప్పుడు టాప్ టెన్ అంటున్నారు) లివబుల్ సిటీస్‌లో ఒకదానిగా అమరావతిని చేస్తానన్నారు. 50శాతం గ్రీన్ కవరేజి. 217 చ.కి.మీ.ల కాపిటల్ ఏరియా. 9 నగరాలు – గవర్నమెంటు సిటీ, జస్టిస్ సిటీ, ఫైనాన్స్ సిటీ, నాలెజ్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, మీడియా, కల్చర్ సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ, టూరిజం సిటీ కడతామన్నారు.

వీటిని డెవలప్ చేస్తామంటూ 29,966 మంది రైతుల నుంచి 34,400 ఎకరాల భూమి సేకరించారు. భూమికి బదులుగా పూర్తయ్యాక రెసిడెన్షియల్, కమ్మర్షియల్ ప్లాట్లు యిస్తామని చెప్పి, ప్రాజెక్టు పూర్తయ్యేవరకు నెలనెలా కౌలు యిస్తూ ఉన్నారు. ఋణమాఫీ, పెన్షన్లు వంటి సామాజిక ప్రయోజనాలు కూడా కల్పిస్తామన్నారు. ఇది ఒక వాణిజ్య ఒప్పందం. దీనిలో త్యాగం అనే మాటకు తావే లేదు. ప్రభుత్వం తన వంతు షరతు పూర్తి చేయలేదు. ఇప్పుడీ 1575 ఎకరాలు ఏ ప్రాతిపదికన తీసుకుంటున్నారో ఆ నోటిఫికేషన్‌లో నేను చూడలేదు. పాత తరహా ఒప్పందం అంటే రైతులు యిస్తారా? ఇవ్వనంటే ప్రభుత్వం ఊరుకుంటుందా? మార్కెట్ రేటు యిచ్చి కొంటాం అంటే పాత రైతులు, మాకూ అలాగే యివ్వవచ్చుగా అంటారా?

ఈ సందేహాలు మీడియా లేవనెత్తటం లేదు. ఎంతసేపూ అమరావతి నిద్ర లేచింది, జీవం పోసుకుంది, పరుగులు పెడుతోంది అనే వార్తలే వండి వారుస్తున్నారు. ‘‘హిందూ’’లో ‘అమరావతి- ఫ్రమ్ ఘోస్ట్ సిటీ టు మోడల్ సిటీ’ అనే కాప్షన్‌తో సాంబశివరావు అనే ఆయన ఆర్టికల్ రాశారు. అమరావతిని ఘోస్ట్ సిటీ అని ఎలా అన్నారో నాకు అర్థం కాలేదు. బొత్స సత్యనారాయణ ‘అక్కడేముంది, వల్లకాడు’ అన్నారనా? ఆ అమరావతి నుంచే పాలన సాగింది కదా, సెక్రటేరియట్, మంత్రులు ఆఫీసులు, పార్టీల ఆఫీసులు అన్నీ ఉన్నాయి కదా. వైసిపి వచ్చాక అమరావతిలో కొత్త నిర్మాణాలు పెద్దగా చేయలేదనుకున్నా, ఓ స్థాయి వరకు వచ్చినవి పూర్తి చేసి ఉంటారు కదా. కొద్దిగా కట్టి వదిలేసినవి కూలగొట్ట లేదు కదా. అలాటప్పుడు ఘోస్ట్ సిటీ ఎలా అవుతుంది. ఇక రెండోది మోడల్ సిటీ. అది ఎప్పుడు అవుతుందో ఎవరైనా చెప్పగలరా? చివర్లో ప్రశ్నార్థకం పెట్టవద్దా?

45 కేంద్ర సంస్థలు తమ ఆఫీసులను అమరావతిలో పెట్టబోతాయని ఆంధ్రజ్యోతి వార్త. గతంలో చంద్రబాబు హయాంలో పెట్టారట, బాబు స్థలాలు కేటాయించారట. కానీ వాళ్లు ఆఫీసులు కట్టలేదట, కట్టలేదేమని జగన్ స్థలాన్ని వెనక్కి తీసుకుంటానంటే వాళ్లు కోర్టు కెళతామని అన్నారట. ఇప్పుడు మళ్లీ ముందుకు వస్తున్నారట. ఆ జాబితాలో ఉన్న ఇండియా పోస్టు, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ వగైరా కేంద్ర సంస్థలు రాష్ట్రంలో ఎక్కడైనా ఆఫీసులు పెట్టవచ్చు. అసలవి యిప్పుడు రాష్ట్రంలో పని చేస్తున్నాయా? సొంత భవనాల నుంచా? అద్దె భవనాల నుంచా? అమరావతిలో సొంత భవనాలు అవసరమని అవి ఫీలవాలి కదా. వాటికి బజెట్ కేటాయింపులు ఉండాలి కదా! అదంతా బాబుకి అనవసరం. తన చేతిలో ఉన్న పని స్థలం కేటాయింపు. అది చేసేశారు. మరి అవి భవనాలు కట్టలేదేం? బాబు ముఖ్యమంత్రిగా ఉంటేనే కట్టాలని తీర్మానించు కున్నాయా? వాటిలో ఏ ఒక్కదానికీ జగన్ టైములో కట్టాలని తోచలేదా? ఫన్నీగా లేదూ?

వాటిలో 33టికి స్థలాల కేటాయింపు జరిగిందని, తక్కినవాటికి జరగబోతోందని కాపిటల్ రీజియన్ ప్రకటన. కేంద్ర సంస్థలు క్యూలు కడుతున్నాయని కొన్ని వెబ్‌సైట్ల ప్రచారం. గతంలోనే మొత్తం 132 (వీటిలో ఎన్ని కేంద్రసంస్థలు? ఎన్ని రాష్ట్రం సంస్థలు? అందరూ అమరావతిలో ఐతేనే పెడతాయన్నాయా?) సంస్థలకు స్థలాలు కేటాయించారని వార్త. అంటే జరుగుతున్న దేమిటి? అమరావతి భూములను కనబడిన ఆఫీసుల కల్లా కేటాయించేసి, అక్కడ అది వస్తోంది, యిక్కడ యిది వస్తోంది అని ప్రచారం చేసుకోవడానికి రియల్ ఎస్టేటు వారికి అవకాశం కల్పిస్తున్నారు. ఏళ్లూపూళ్లూ గడిచినా వారు కట్టరు. ఎందుకు కట్టరు? జగన్ రాజధానిలో మూడో వంతు మాత్రమే యిక్కడ ఉంచుతానని అన్నాడు కాబట్టి అంటారా? ఇండియన్ నేవీకి, రాజధానికి సంబంధం ఏమిటి? యూనివర్శిటీలకు, యోగా సంస్థలకు వందల ఎకరాలు కట్టబెట్టారు బాబు. వాటికీ, రాజధానికీ సంబంధం ఏమిటి? ఆ స్థలాల్లో అవి యిన్నేళ్లలో ఏమైనా కట్టాయా?

ఇదంతా చూస్తే ఏమనిపిస్తోంది? ఏడెనిమిదేళ్ల క్రితం నాటి అమరావతి కథ పునరావృతమౌతున్నట్లు తోచటం లేదూ? రియల్ ఎస్టేటును లేపడానికే యిదంతా అనిపించటం లేదూ? అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని బాబు చెప్తూ వచ్చారు. బంగారు గుడ్లు పెట్టే బాతుని జగన్ చంపేశాడన్నారు. బంగారు బాతు తయారు చేయడానికి ఎన్ని లక్షల కోట్లు అవుతుందో ఆయన మర్చిపోతూ ఉంటారు. జగన్ అమరావతిలో నిర్మాణాలు ఆపేసినప్పుడు ‘దాదాపు అంతా పూర్తయిపోయింది, పూర్తి చేయడానికి లక్ష కోట్లు కావాలని జగన్ చెప్తున్నది అబద్ధం. ఏ పది, పదిహేను వేల కోట్లో సరిపోతుంది.’ అని టిడిపి వారు వాదించారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే మంత్రి నారాయణ అమరావతి నిర్మాణానికి తొలి దశలో 48 వేల కోట్ల ఖర్చు, 3 విడతల్లో కలిపి లక్ష కోట్లు అవుతాయన్నారు. ఇది పాత మాస్టర్ ప్లాను ప్రకారం చేయడానికి! కొత్తగా గెజిట్ నోటిఫికేషన్ యిచ్చిన 1575 ఎకరాలు డెవలప్ చేయడానికి అయ్యే ఖర్చు దీనికి కలపాలేమో!

వీటన్నిటికీ డబ్బు ఎక్కణ్నుంచి వస్తుంది? 2014లో ఆయన అధికారంలోకి వచ్చినప్పటి కంటె యిప్పుడు రాష్ట్రం మరింత అధ్వాన్నంగా ఉందని బాబు శ్వేతపత్రాల ద్వారా చాటుతున్నారు. ఆర్థిక స్థితి మరింత హీనమవడంతో పాటు, తలకెత్తుకున్న హామీల భారం మరింత పెరిగింది కూడా! ఇవన్నీ ఎలా చేయగలుగుతాడా? సంపద ఎలా సృష్టిస్తాడా? అని మనం బెంగ పడుతూ ఉంటే నిన్నటి గవర్నరు ప్రసంగంలో ‘ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పరిస్థితి కనబడటం లేదు. 10 లక్షల కోట్ల అప్పు ఉంది. చర్చల తర్వాతనే పూర్తి స్థాయి బజెట్‌కు వెళతాం.’ అని చెప్పించారు. ఇలాటి పరిస్థితిలో మహానగర నిర్మాణానికి నిధులు సమకూర్చడం ఎలా? ఇవాళ బజెట్‌లో కేంద్రం 15 వేల కోట్లు కేటాయించింది. అదేమీ గ్రాంట్ కాదు. విభజన తర్వాత రాజధాని కట్టుకోవడానికి కేంద్రం సమకూర్చవలసిన సాయం కాదు. మా పూచీకత్తుతో వివిధ సంస్థల ద్వారా అప్పులిప్పిస్తామంతే అన్నారు. దీనికే టిడిపి వారు ఏదో సాధించినట్లు చెప్పుకుంటున్నారు.

‘‘కోరస్’’ (1975) అని మృణాల్ సేన్ సినిమా ఉంది. 100 వేకెన్సీలున్నాయని ప్రకటిస్తే వేలాది మంది నిరుద్యోగులు వస్తారు. 1:10 చొప్పునే యింటర్వ్యూకి పిలుస్తామని కంపెనీ చెప్తే, నిరుద్యోగులంతా ఆందోళన చేస్తారు. చివరకు కంపెనీ చైర్మన్ మెత్తపడి, జాలి పడి 1:20 చొప్పున పిలుస్తామని ప్రకటిస్తాడు. ఉద్యోగాల సంఖ్య పెరగలేదు. ఆశావహుల సంఖ్య పెరిగిందంతే. వాటె క్రూయల్ జోక్! కేంద్రం చేసినది అలాగే ఉంది. తమ ఎన్డీఏ ప్రభుత్వమే ఉన్న రాష్ట్రానికి అప్పుల భారం పెంచుతానంటోంది తప్ప, గ్రాంట్ యిస్తాననలేదు. దీనిలో పండగ చేసుకోవాల్సి ఏముందో నాకు అర్థం కావటం లేదు.

గతంలో ప్రత్యేక ప్యాకేజీ కాస్తకాస్త యిచ్చినపుడు దానికి యుసిలని, మరోటని కేంద్రం చాలా చిక్కుముళ్లు వేసింది. వాటిని విప్పడం బాబు వలన కాలేదు. ఇప్పుడేమవుతుందో తెలియదు. ఎన్డీఏ ప్రభుత్వానికి బాబు, నీతీశ్ చెరో కొమ్ము కాస్తున్నా, బజెట్‌లో బిహార్‌కు కంచంలో, ఆంధ్రకు ఆకుల్లో వడ్డించినట్లు కనబడుతోంది. ఇప్పట్లో ఆంధ్రకు ఎన్నికలు లేవు కదా! పైగా కేంద్ర నిధులెన్ని యిచ్చినా క్రెడిటంతా బాబు కొట్టేస్తారన్న శంక ఒకటి! ఈ ఎదురీతలో బంగారు గుడ్లు పెట్టే అమరావతి మహానగరం కట్టాలంటే గత టిడిపి హయాంలోని పెండింగు బిల్లులు (జగన్ చెల్లించకుండా ఉంచినవి), జగన్ హయాంలో పెండింగు పెట్టిన బిల్లులు (రమారమి లక్ష కోట్లు అంటున్నారు) యివన్నీ చెల్లించాలి. లేకపోతే అమరావతి కాంట్రాక్టులు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రారు.

రాష్ట్రం ఎదగాలంటే పరిశ్రమలు, పెట్టుబడులు రావాలి. ఈ శ్వేతపత్రాల వెల్లువ వలన రాజకీయంగా లాభం ఉంటుందేమో కానీ, పెట్టుబడులు ఆకర్షించే అవకాశం తక్కువ. ఇలాటి దివాలాకోరు రాష్ట్రంలో, ప్రతీ ఐదేళ్లకూ విపరీతమైన స్వింగ్‌తో అట్టు తిరగేస్తున్న రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే చాలా ధైర్యమే ఉండాలి. బాబు ప్లాన్ చేసిన మహానగరం కట్టడానికి కనీసం 15, 20 ఏళ్లు పడుతుందని అందరూ అనుకున్నదే. ఇప్పుడు నారాయణ రెండున్నరేళ్లలో కోర్ కాపిటల్ కడతా మంటున్నారు. దాని బజెట్ ఎంతో, యీ 15 వేల కోట్లు ఏ మూలకో, రిటర్న్‌స్ ఎంత త్వరగా వచ్చి దానిపై వడ్డీ కట్టగలరో నాకు తెలియదు. చప్పున కట్టకపోతే 2029 నాటికి ఏమౌతుందేమోనన్న భయం కాంట్రాక్టర్లకు ఉంటుంది.

పెట్టుబడులు రావాలన్నా, కాంట్రాక్టర్లు ముందుకు రావాలన్నా అత్యవసరమైనవి శాంతిభద్రతలు. శాంతి, అభివృద్ధి అవిభక్త కవలపిల్లలు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఎరగనంతగా హింసావాతావరణం సాగుతోంది. ఇది హింస కాదు, ప్రతిహింస అని టిడిపి వాదించవచ్చు; ఇవి రాజకీయ హత్యలు కావు, వట్టి గూండాగిరీయే అని హోం మంత్రి అనవచ్చు; ‘‘షోలే’’లో అమితాబ్ పెళ్లి సంబంధం మాట్లాడిన తీరులో ‘అబ్బే, ముక్కలుముక్కలుగా నరకడం రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరికే గంజాయి సేవించడం చేత జరిగింది తప్ప, మామూలుగా అలాటివాడు కాదు’ అని సమర్థించవచ్చు. కానీ యివేమీ పెట్టుబడిదారులు తృప్తి పడే స్టేటుమెంట్లు కావు. రాజకీయ కారణాలున్నాయా లేదా అన్నది పక్కన పెడితే, రాజధానికి 120 కి.మీ.ల దూరంలో ఉన్న ఊళ్లో నడిరోడ్డుపై యిలా జరగడం మంచి సంకేతాలను పంపదు. ఇది గ్రహించి, త్వరలోనే పరిస్థితిని ప్రభుత్వం సరిదిద్దుతుందనే ఆశిద్దాం.

కేంద్ర బజెట్‌లో అమరావతికి ఏదో కురిపించేశారనే కోలాహలం చూసి, రెట్టింపు రేట్లు పెట్టి అక్కడ స్థలాలు కొందామను కునేవారు కాస్త తమాయించుకుంటే మంచిది. ఇప్పటికే రాష్ట్రం అప్పులకుప్ప, శ్రీలంక, సోమాలియా అయిందని చెప్తూ వచ్చిన టిడిపి అమరావతి కోసం మరో 15 వేల కోట్ల అప్పు తేబోతోంది. నారాయణ చెప్పినట్లు కోర్ కాపిటల్ పూర్తి చేసినా అది అద్భుతమే. అద్భుతాన్ని ఆశించి పెట్టుబడి పెడితే భారీ రిస్కే. బాబు అమరావతి మీదే మొత్తం దృష్టి పెట్టినట్లు, జగన్ వైజాగ్ మీదే పెట్టడంతో వైజాగ్‌లో ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు దడాలున కింద పడ్డాయి. ఎన్నికల రోజున ఎన్డీఏ పెర్‌ఫామెన్స్ చూసి షేర్ మార్కెట్ బావురుమంది. ఇన్వెస్టర్లు భోరుమన్నారు. అమరావతి వైపు పరుగులు పెట్టేవారు యివన్నీ గుర్తు పెట్టుకుని వ్యవహరిస్తే మంచిది.

ముగించే ముందు యిప్పుడొక సెల్ఫ్ యాడ్, నా పుస్తకాల గురించే! వ్యాసం మధ్యలో యాడ్ వస్తే మరీ చికాకు పడతారని చివర్లో పెట్టాను. గత పది నెలలుగా నేను ఆర్టికల్స్ రాయడం బాగా తగ్గించి, పాత ఆర్టికల్స్, సీరీస్ అన్నీ పుస్తకాలుగా తెచ్చే పనిలో పడ్డాను. ఇప్పటికి 11 పెద్ద పుస్తకాలు (ఒక్కోటీ సగటున 250 ప్లస్ పేజీలు), పడక్కుర్చీ కబుర్లు సీరీస్‌లో 6 పుస్తకాలు (48 పేజీలు) తెచ్చాను. ఏడాది చివరకు మరో 9 పెద్ద పుస్తకాలు తెచ్చే ఆలోచనలో ఉన్నాను. వీటి ఈబుక్ వెర్షన్లు (పిడిఎఫ్, యూనికోడ్) కూడా అందుబాటులోకి తేవాలని ప్రయత్నం. ఇవన్నీ పూర్తయ్యాక ఒక వ్యాసం రాసి పుస్తకాల లభ్యత గురించి చెప్దామనుకున్నాను. ఈ లోపునే యీ సమాచారం యివ్వడానికి కారణం – రాజీవ్ హత్య పుస్తకం మార్కెట్లో అందుబాటులో ఉండడం! 12 ఏళ్ల క్రితం సీరియల్‌గా రాసిన దాన్ని పుస్తకరూపంలో తేవాలని కనీసం 100 మంది మెయిల్స్ రాసి ఉన్నారు. వారి కోసమే యీ ప్రకటన!

నేను ప్రతి పుస్తకం 500 కాపీలు అచ్చు వేసి ప్రచురణకు పూర్వమే కాపీలు తీసుకుంటామన్న వారికి యిచ్చేసి 200 కాపీలు మాత్రమే మార్కెట్‌కు రిలీజ్ చేస్తున్నాను. సేల్స్ ఫిగర్స్ చూడబోతే ప్రతి పుస్తకం నెలకు 10 కాపీలు అమ్ముడుపోతోంది. ‘నన్ను చూసి..’ ‘పురాణ పరామర్శ…’ పుస్తకాలు నెలకు 20 అమ్ముడు పోతున్నాయి. పురాణ పరామర్శ రీప్రింట్‌కు వెళుతోంది. కంటెంట్ మాట ఎలా ఉన్నా, ధర కూడా ఒక కారణం. పేజీకి రూపాయి ధర పెడుతున్న ఈ రోజుల్లో నేను 55-60 పైసలు మాత్రమే పెట్టాను. ఈబుక్స్ విషయంలో కూడా 500 పేజీల పుస్తకాన్ని 100 రూ.లకే యిస్తున్నాను. రాజీవ్ హత్య పుస్తకం త్వరలోనే ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోతే ఆ పుస్తకాభిమానులు నన్ను నిందిస్తారనే భయంతో తెలియపరుస్తున్నాను. మొత్తం ఏయే పుస్తకాలు వేశాను అనే వివరాలు యిక్కడ యివ్వటం లేదు. లింకులు యిచ్చేస్తున్నాను. ఆసక్తి ఉన్నవారు అక్కడకు వెళ్లి చూడవచ్చు, కొనుక్కోవచ్చు. మొత్తం పుస్తకాలు దొరికే లింకు –  ఈ లింకులో కొన్ని పుస్తకాల గురించి వివరణ దొరుకుతుంది. పిడిఎఫ్‌ రూపంలో ఉన్న ఐదు ఈ-బుక్స్ కొనుక్కోవడానికి ఉపయోగపడే లింకు కానీ యిక్కడ మీరు పుస్తకాల ప్రివ్యూ చూడలేరు. పుస్తకంలో ఐదో వంతు ఉచితంగా చదివేసే వెసులుబాటు లో ఉంది. 3,4,5 పుస్తకాలు మీరు యిక్కడే కొనవచ్చు. 1,2 కొనాలంటే మాత్రం గూగుల్ ప్లే లింకుకి వెళ్లాలి.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2024)

177 Replies to “ఎమ్బీయస్‍: అమరావతి సందడి శురూ!”

  1. 15 వేల కోట్ల అప్పుకి షూరిటీ ఇస్తున్నారు కేంద్రం. తిరిగి కట్టాల్సింది ఆంధ్రులే.

    ఒక్క తాత్కాలిక సచివాలయానికే బాబు గారు 12 వందల కోట్లు ఖర్చు చేసారు. 14-15 లో.

    ఇప్పుడు కనీసం ఒక పది బిల్డింగులు కట్టడానికి కూడా ఆ డబ్బులు సరిపోవు.

    దానికే పచ్చ సాని పుత్రులు గుడ్డలు చించుకుంటున్నారు, వాటాలు మింగడానికి.

  2. అమరావతి బాండ్స్ సంగతేమిటి?వాటి కాల వ్యవధి ముగింపు దశ కు చేరుకుంది. మరి వాటి పెట్టుబడుల చెల్లింపు ఎప్పుడు?ఎలా?

  3. excellent poll management by kootami, at least five digit crores of investment by thousands of party men/donors, made nda to wi and form govt. now investors need. pay back in flesh and blood and bones as well. and scandals are bound to erupt sooner than later. opposition dont need to. brag about their. laurels, but just be watchful. on lapses and corruption. that is how democracy. keeps. recycling in. india.

  4. Basically you are suggesting not to invest in Amaravati lands. Again you guys are misleading people so that they miss the opportunity. Now let’s say Kammas invest in Amaravati (మీ లెక్కన జూదం). Down the line if they make tremendous profits you will write another article blaming them that they looted all the lands in and around Amaravati depriving other communities.

    1. I cautioned investors to be prudent. That’s all. Investors belong to all castes and regions. If someone buys and prospers, no one calls it a loot.

  5. శతకోటి లింగాలలో బోడి లింగం గడివి నీ సొల్లు ఎవరువింటారు…ఆర్టికల్ రాసినందుకు.నీకు గిట్టుబాటు అయ్యిద్ది అంతే….

  6. గతంలో పాకేజి ఇచ్చినప్పుడు కేంద్రం చిక్కుముడులు పెట్టింది, విప్పలేక చంద్రబాబు వదులుకున్నాడు అని రాసాడు.

    ఇతడే చంద్రబాబు ఎందుకు ఏ స్వార్థప్రయోజనం కోసం, ముందు ఒప్పుకున్న ప్రత్యేకపాకేజి ఎందుకు వదులుకున్నాడో రాసిన పాత ఆర్టికిలే పైన చిమ్మిన విషానికి సమాధానం.

    1. మోడీ అత్యాశకి పోయి 400 వస్తాయి అనుకుని ఎన్నికల ప్రచారంలో పి!చ్చి వా!గు!డు వా!గా!డు అయోధ్యలో కూడా రాముడు ము!డ్డి ప!గి!లి!న దా!కా కు!త్త!ప!గ!ల!దెం!గా!డు

  7. ఇలా బడ్జెట్ లో అమరావతి అన్నారో లేదు .. ఆలా ఆర్టికల్ రాసేశారు .. అదే మీ అయ్యగారు ఎందుకు ఓడిపోయాడో రాయడానికి మాత్రం నాలు దిక్కులుగా తిరిగి .. దక్షిణానికి వస్తారు అంట . బాగుంది ..

    1. భలేవారే… నిజం తెప్పులేసుకోకుంజానే . అబద్దం అంటార్కిటికా దాకా వెళ్లాలి కదా…

      పైగా ఏదో కొత్త విషయం రాసిన బిల్డప్పు. అన్నీ ఆ పాత రోత మాటలే కదా..

  8. Rayali Rayali babu ante ventane rayali.. chanthadu antha rayali . Jagan ante light theskovachu.. idee mee theru.. babu ante meeku dwe-sham ani mee articles follow ayyevariki telusu… simple vishyanni complicate chesthu rayadam meku istamanukunta

    1. ఘోస్ట్ సిటీ అని ఎలా అన్నారో నాకు అర్థం కాలేదు – ante Meru Amaravathi ni Live lo I mean velli chudadaledu- nijamena?

  9. సైబరాబాదుకి పునాది రాయి బాబుకి ముందే పడింది. బాబు తర్వాత కాంగ్రెసు ప్రభుత్వం, ఆ తర్వాత తెరాస ప్రభుత్వం దాని అభివృద్ధికి ఎంతో చేశాయి. మొత్తమంతా కలిపి చూస్తే బాబు వాటా తక్కువే.

    You are basically parroting the points that Anti-CBN media does. Anyone can layout a foundation stone and build a huge building. The toughest problem to solve is getting the initial traction. Getting the first few companies to come and set up their offices in that place is damn hard. If Bill Gates himself said that he only considered Hyderabad after CBN convinced him, who are we to negate that? (please check the link below. This was a recorded meeting. So, nothin to lie here)

    https://ncbn.info/bill-gates-recalls-first-meeting-with-naidu-20-years-ago/

    Once the tech foundation is laid out, following governments definitely helped develop the city. No one is taking away the credit from Congress and TRS. But to minimize the initial effort and hard work from CBN is a fools errand.

    1. For any big project, there are various stages and each stage is difficult. One should give credit for all the players. CBN’s media does not give credit to anyone else. You do not see this in case of other states. No single person takes all the credit.

      1. Red herring fallacy. You are now changing the topic at question: “Role of CBN in development of Cyberabad” to “media not giving credit to anyone else”. However, let me address your question.

        In any major initiative there will be so many role players. But only the main person gets the credit. Nothing wrong with it, just the nature of world.

        • Economic reforms in India: people will remember PV Narasimha Rao and Manmohan Singh. Does that mean no one else before them initiated the project?
        • Integration of princely states unification across India: Sardar vallabhai patel
        • IT development in Karnataka: SM Krishna
        • Lastly, Eenadu (CBNs media) has tooted KTR as a visionary for the past 5 years. Ofcourse they gave him his due credit.

        No matter how many counterpoints I present, it might be hard for me to convince you. If you are open, do me a favor. Ask any educated 80’s/90’s person from a different state about who might have developed Hyderabad. They wouldn’t have read Eenadu/Andhra Jyothy I hope.

  10. మొత్తం వ్యాసం( ఆయాసం అనాలేమో).. రెండే విషయాలు. లేదా మూడు.

    1. పుస్తకాలు వస్తున్నాయి. మంచి విషయం. సంతోషం. తప్పకుండా కొంటాను.
    2. బాబు పెద్ద వేస్టు. ఏమీ చేతకాదు. ఏమీ రాదు. బాబు కన్నా నేనే మేథావిని.
    3. జగన్ విషయం. ( 2వ పాయింట్ మళ్లీ చదువుకోండి).
  11. YS బ్రతికి వున్నా 2014 లో మళ్ళీ గెలిచి వుండకపోయి వుండచ్చు….కానీ చనిపోయాక ఆయన పేరును అమాంతం పెంచి మీరు మీ స్వార్థం కోసం వాడుకున్నారు……25 yrs గా మామకు వెన్నుపోటు పొడిచి అధికారం పొందాడు అన్న వాళ్ళే ఇప్పుడు బాబోరే లేకపోతే పార్టీ అసలు బతికేది కాదు అంటున్నారు …..పిచ్చి GA….కష్టపడి ప్రజల కోసం పనిచేయడానికి మాత్రమే అధికారం…మీరు మంచి చేస్తే ప్రజలే కలకాలం గుర్తు పెట్టుకుంటారు ….అంతే కానీ మీ PERSONAL ACHIEVEMENTS , personal GRUDGE ల కోసం…..ఎప్పటికీ అధికారం లో వుండాలనే దురాశతో natural resources అన్ని దోచేస్తూ స్టేట్ ను సర్వ నాశనం చెయ్యకూడదు…..మళ్ళీ అలాంటి వాడికి సపోర్ట్ చేస్తూ సిగ్గులేకుండా నీతులు చెప్పకూడదు…..

  12. సైబరాబాద్ అనేది మొదలయ్యేసరికి నాకు 10-12 ఏళ్లు మాత్రం ఉంటాయి. ప్రసాదుగారు వేరే రాష్ట్రంలో బాంకుపనిలో బిజీగా ఉండి ఉంటారు. ఇంటర్‌నెట్ చేతిలో ఉండి, రాసిందల్లా పబ్లిష్ చెయ్యడానికి గ్రేట్ఆంధ్రా ఆ రోజుల్లో కూడా ఉండిఉంటే ఇలాగే “అదో పెద్ద రియల్ ఎస్టేట్ వ్యవహారం” అని రాసి ఉండేవారు అని నా ప్రగాఢ విశ్వాసం.

  13. సై..బ..రాబాద్ అనేది మొదలయ్యేసరికి నాకు 10-12 ఏళ్లు మాత్రం ఉంటాయి. ప్రసాదుగారు వేరే రాష్ట్రంలో bank పనిలో బిజీగా ఉండి ఉంటారు. ఇంటర్‌నెట్ చేతిలో ఉండి, రాసిందల్లా పబ్లిష్ చెయ్యడానికి ఈ వెబ్‌సైట్ ఆ రోజుల్లో కూడా ఉండిఉంటే ఇలాగే “అదో పెద్ద రియల్ ఎస్టేట్ వ్యవహారం” అని రాసి ఉండేవారు అని నా ప్రగాఢ విశ్వాసం.

  14. సై..బ..రాబాద్ అనేది మొదలయ్యేసరికి నాకు 10-12 ఏళ్లు మాత్రం ఉంటాయి. writer గారు వేరే రాష్ట్రంలో bank పనిలో బిజీగా ఉండి ఉంటారు. ఇంటర్‌నెట్ చేతిలో ఉండి, రాసిందల్లా పబ్లిష్ చెయ్యడానికి ఈ వెబ్‌సైట్ ఆ రోజుల్లో కూడా ఉండిఉంటే ఇలాగే “అదో పెద్ద రియల్ ఎ..స్టే..ట్ వ్యవహారం” అని రాసి ఉండేవారు అని నా ప్రగాఢ విశ్వాసం.

  15. సై..బ..రా..బాద్ అనేది మొదలయ్యేసరికి నాకు 10-12 ఏళ్లు మాత్రం ఉంటాయి. writer గారు వేరే రాష్ట్రంలో bank పనిలో బిజీగా ఉండి ఉంటారు. ఇం..ట..ర్‌నెట్ చేతిలో ఉండి, రాసిందల్లా పబ్లిష్ చెయ్యడానికి ఈ వె..బ్‌..సైట్ ఆ రోజుల్లో కూడా ఉండిఉంటే ఇలాగే “అదో పెద్ద రియల్ ఎ..స్టే..ట్ వ్యవహారం” అని రాసి ఉండేవారు అని నా ప్రగాఢ విశ్వాసం.

  16. Mee edupe ma rastraniki sree rama raksha … meeru edustune undandi .. e kutami Rastra rupurekhalani marche disaga veltundhi .. abhivrudi mariyu samksheham ante ardham telustadhi meeku .. oopika pattandi kallu teruchukune rojulu vastunnai …

  17. Considering AP’s current financial status and Frenzy Freebies that Ruling Parties are promising to people and Limited financial aid from the Center – building a world-class Amaravathi Capital across thousands of acres doesn’t appear to be Practical. Need to wait and watch over next 2-3 years to what extent it materializes, though seems quite challenging!!

  18. Thing is whenever there will be any positive vibes for CBN, immediately an article will come this fellow… Morning budjet news, evening this much article

  19. Why BPL , nokia failed.. they didn’t adopted for the changes.. now real estate is also an development source.. Ee Ara gundu ayyagariki eppudu Ardham avutadho ??

  20. Phapham… Akkademo.kommineni daily aavu vuasam raayali yakshi lo… School lo kuda intha kashta padi vundadu … Ikkada meeremo Mee kullu , edupu ni apudapoudu visarjinchali ikkda..

  21. Ee rachayitha antha vedavani naa jeevitham lo chudedu. Chandrababau ante yeppudu yedupe. 5 yellu cheyyani vaadi meeda oka article ledu. Yedo cheyyalani tapatryapade vaadi meeda matram rallu veyyatam start. 14-19 lo dadapu 3 years land acquisition ki poyindi, migilina 2 yrs lo assembly high court kattaru. With in 50 days started. Who cares.

  22. పది రోజులు 750 కోట్ల ప్రజాధనం తో జగన్ లండన్ యాత్ర అత్యాధునిక విమానం లో ఇద్దరి కూతుర్లతో వెళ్లి వచ్చిన విషయం ఎక్కడ రాయలేదు ఎందుకో ?

  23. AP..people..sucks, they..voted..to..avineethi..bakasurudu, his..cast ..people..looted..lands..around..amaravati..first..time, now..they..loot..money..to..secure..generations. Most ..of..the..AP..money..going..into..kammas..pockets. CBN..community..people..survive..only..others..hard..work.

  24. okkati..matramu..nijamu…AP..people..sucks, they..voted..to..avineethi..bakasurudu, his..cast ..people..looted..lands..around..amaravati..first..time, now..they..loot..money..to..secure..generations. Most ..of..the..AP..money..going..into..kammas..pockets. CBN..community..people..survive..only..others..hard..work.

  25. okkati..matramu..nijamu…AP..people..sucks, they..voted..to..avineethi..bakasurudu, his..cast ..people..looted..lands..around..amaravati..first..time, now..they..loot..money..to..secure..generations. Most ..of..the..AP..money..going..into..kammas..pockets. CBN..community..people..survive..only..others..hard..work.

  26. చంద్రబాబుది ఎప్పుడూ శల్య సారధ్యమే…

    2014-19 అంతే ఇప్పుడూ అంతే…

    పేరుకు కేంద్రప్రభుత్వంలో ఉంటాడు,ఇద్దరు ముగ్గురికి మంత్రి పదవులు ఇప్పించుకుంటాడు…

    బస్…

    లిటరల్ గా తెలుగుదేశం యంపి ల మీద ఆధారపడి ఉంది మోడీ ప్రభుత్వం, ఏది కావాలన్నా డిమాండ్ చేసి మరీ సాధించవచ్చు కానీ ఇక్కడ సీన్ రివర్స్ ఇంకా వాళ్లకు నడుముల వరకు వంగి ఊడిగం చేస్తున్నాడు…

    ఇక రాష్ట్రం గురించి కానీ రావాల్సిన నిధుల గురించి కానీ అస్సలు పట్టించుకోడు,తనకున్న మీడియా బలంతో గొప్పలు చెప్పించుకుంటూ జాకిలు పెట్టీ మరీ పొగిడించుకుంటాడు…

    ఎప్పుడు గెలిచినా ఇదే తంతు…

    చంద్రబాబు ఎన్ని సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఆంధ్రప్రదేశ్ కి ఒరిగింది ఏమి లేదు,తన ఆస్తులు హెరిటేజ్ ఆస్తులు పెరగడం తప్పు…

    1. మరి ఇలాంటి పనే లాస్ట్ 5 ఇయర్స్ లో జాగ్గదు చేసి కేంద్రం మేడలు వంచి విభజన హామీలు సాధించాల్సింది కదా

  27. ఇదే కేంద్రం నేడు రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 4 పోర్టులకి,ఫిషింగ్ హార్బర్ లకి,మెడికల్ కాలేజీలకు,ఇండస్ట్రియల్ కారిడార్లకి కనుక ఈ 15 వేల కోట్ల రూపాయల లోన్లు కనుక ఇప్పించి ఉంటే రెండేళ్లలో రాష్ట్రంలో కనీసం 20 లక్షల మందికి ఉపాధి లభించేది..కోట్లరూపాయల ఆదాయం రాష్ట్రప్రభుత్వానికి సమకూరేది.. చంద్రబాబు గారు ఈ 15 వేల కోట్లరూపాయలను తీసుకెళ్లి అమరావతి కృష్ణా నదిలో పోస్తున్నారు…రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తాకట్టు పెడుతున్న మిమ్మల్ని చరిత్ర క్షమించదు.. గుర్తుపెట్టుకోండి..

  28. ఏమోయ్ ప్రసాదు !! నేను కూడా ఒకసారి నిన్ను పరామర్శించాలోయ్!! ఎందుకంటే మీలాంటి ఎర్రిపప్ప మేధావిని నా లైఫ్ లో చూడలేదోయ్!! but క్కూడా కొంచం టైం పడుతుంది !! meet you soon da !!

  29. జగనన్న ముందే చెప్పాడు

    అమరావతి మీద ఈ రోజు లక్షకోట్లు అప్పు తెచ్చి పెడితే రానున్న రోజుల్లో వడ్డీల తో అది 2. 3. 4లక్షల కోట్ల వరకూ అవుతుంది

    అంత భారం ఆంధ్ర రాష్ట్రం మోయలేదు అని క్లియర్ గా చెప్పాడు.

    అన్నీ రకాల వసతులు వున్న విశాఖపట్నం అయితే తక్కువ ఖర్చు తో ఫలాలు వెంటనే అందుతాయి అని చెప్పాడు..కానీ ఎవరూ వినలేదు

    1. మరి అప్పు తెచ్చి, వొట్ల కొసం ఊరికె పంచితె ఎవరు తీరుస్తారు? విశాఖలొ ప్రబుత్వ భవనాలు తాకట్టు పెట్తి తెచ్చుకున్న 25 వెల కొట్ల అప్పుకి వడ్డి, అసలు కట్టనవసరం లెదా?

      ఇక ఇక్కడ అప్పె అనుకున్నా, ఖర్చు చెస్తుంది capital expenditure మీద! ఇక అమరావతి ని కొంత డెవెలొప్ చెస్తె ఆక్కడి ప్రబుత్వ స్తలాలు అమ్మితె కొంత డబ్బు వెనక్కు వస్తుంది. పెట్టుబడులు కూడా భారిగా వచ్చె అవకాశం ఉంది.

    2. అవునా అన్న .. మరి నువ్వు చెప్పిన అంత తెలివి .. పెతిపక్ష నేతగ ఉన్నపుడు .. అమరావతికి నేను ఒప్పుకుంటున్నాను అన్నపుడు తెలీదా .. అప్పుడు ఎందుకు వెతిరేకించలేదు .. ఇప్పుడు అర్ధం అయిందా మనల్ని ఎవడు ఎందుకు నమ్మలేదో ??

    3. అందుకే నా , రిషి కొండ అన్ని వందల కోట్లు , ప్రజల డబ్బు తో కట్టాడు, తాను అందులో వుండొచ్చు అనే ఆలోచన తో.

      పది కిలో మీటర్లు దూరం కూడా హెలికాప్టర్ వేసుకుని వెళ్లే వాడు , కోట్లు ఖర్చు పెట్టీ, ప్రజల డబ్బు కాబట్టి.

      కాంప్ ఆఫీసు సెట్టింగ్ , ఇంట్లో వేసుకున్నాడు, ప్రజల డబ్బుతో అ*డ్డ గాడి*ద గాడు.

      900 వందల మంది గుంపు తో సెక్యూరిటీ పెట్టుకున్నాడు, ప్రజల డబ్బుతో, వీడ్డి పెం*ట మొ*ఖానికి అంట మంది ఎందుకు?

      వాడి అంత పోరం*బోకు గా*డిద నీ ఇంతవరకు ప్రజలు చూడలేదు. ఇంక చూడరు.

    1. వీళ్ళు మారరు. అత్యంత నీచులు వీళ్ళు చరిత్ర లో ఎన్టీఆర్ కట్టిన హెల్త్ యూనివర్సిటీ కి వైఎస్ఆర్ పేరు పెట్టుకొని బతుకుతున్నారు

      1. వాళ్ళ బ్రతుకే అంత.. స్వయముగా చెయ్యటం చేతకాదు, వేరేవాళ్లు చేసిన వాటికి పేర్లు మార్చటం తప్ప. హైదరాబాద్ విమానాశ్రయానికి కూడా ఆనాడు మ.. హా….మే.. త.. ఎన్టీఆర్ పేరు తీసి రాజీవగాంధీ పేరు పెట్టాడు.

  30. ///సైబరాబాదుకి పునాది రాయి బాబుకి ముందే పడింది.////

    ఇలాంటి మాటలు చంద్రబాబు కుషిని, దార్సికతని తగ్గించి చూపటనికె. ఆసలు చంద్రబబు కి ముందు సైబరాబాదు అన్న పదమె లెదు. Hi Tech city అన్న concept నె లెదు. అప్పట్లొ hyderabad కనీసం ఈ దెశంలొ A1 city కూడా కాదు. పక్కనె చెన్నై, బెంగలూరు బాగా అబిరుద్ది చెందాయి. అయినా వాటితొ పొటీ పడి Microsoft లాంటి సంస్తలని తెప్పించాడు.

    మాట్లాడితె information technology అంటారు.. కంపుటర్లు ఎమ్మన్నా కూడు పెడతాయా?.. అని అప్పట్లొ YSR సైతం అసెంబ్లీ లొ విమర్సించాడు. అయితె అ తరువాత అయన తన అభిప్రయాలు మార్చుకున్నడు.

  31. ///సైబరాబాదుకి పునాది రాయి బాబుకి ముందే పడింది.////

    ఇలాంటి మాటలు చంద్రబాబు కుషిని, దార్సికతని తగ్గించి చూపటనికె. ఆసలు చంద్రబబు కి ముందు సైబరాబాదు అన్న పదమె లెదు. Hi Tech city అన్న concept నె లెదు. అప్పట్లొ Hyderabad కనీసం ఈ దెశంలొ A1 city కూడా కాదు. పక్కనె చెన్నై, బెంగలూరు బాగా అబిరుద్ది చెందాయి. అయినా వాటితొ పొటీ పడి Microsoft లాంటి సంస్తలని తెప్పించాడు.

    మాట్లాడితె information technology అంటారు.. కంపుటర్లు ఎమ్మన్నా కూడు పెడతాయా?.. అని అప్పట్లొ Y.-S.-R సైతం అసెంబ్లీ లొ విమర్సించాడు. అయితె అ తరువాత అయన తన అభిప్రయాలు మార్చుకున్నడు.

  32. ///సైబరాబాదుకి పునాది రాయి బాబుకి ముందే పడింది.////

    ఇలాంటి మాటలు చంద్రబాబు కుషిని, దార్సికతని తగ్గించి చూపటనికె. ఆసలు చంద్రబబు కి ముందు సైబరాబాదు అన్న పదమె లెదు. Hi Tech city అన్న concept నె లెదు. అప్పట్లొ Hyderabad కనీసం ఈ దెశంలొ A1 city కూడా కాదు. పక్కనె చెన్నై, బెంగలూరు బాగా అబిరుద్ది చెందాయి. అయినా వాటితొ పొటీ పడి Microsoft లాంటి సంస్తలని తెప్పించాడు.

    1. మాట్లాడితె చంద్రబాబు information technology అంటారు.. కంపుటర్లు ఎమ్మన్నా కూడు పెడతాయా?.. అని అప్పట్లొ Y.-S.-R సైతం అసెంబ్లీ లొ విమర్సించాడు. అయితె అ తరువాత జరిగిన అబిరుద్ది, ఉపాది చూసి అయన తన అభిప్రయాలు మార్చుకున్నడు.

    2. మాట్లాడితె చంద్రబాబు information technology అంటారు.. కంపుటర్లు ఎమ్మన్నా కూడు పెడతాయా?.. అని అప్పట్లొ వై.స్.అర్ సైతం అసెంబ్లీ లొ విమర్సించాడు. అయితె అ తరువాత జరిగిన అబిరుద్ది, ఉపాది చూసి అయన తన అభిప్రయాలు మార్చుకున్నడు.

    3. మాట్లాడితె చంద్రబాబు information technology అంటారు.. కంపుటర్లు ఎమ్మన్నా తిండి పెడతాయా?.. అని అప్పట్లొ వై.స్.అర్ సైతం అసెంబ్లీ లొ విమర్సించాడు. అయితె అ తరువాత జరిగిన అబిరుద్ది, ఉపాది చూసి అయన తన అభిప్రయాలు మార్చుకున్నడు.

    4. మాట్లాడితె చంద్రబాబు information technology అంటారు.. కంపుటర్లు ఎమ్మన్నా తిండి పెడతాయా?.. అని అప్పట్లొ వై.స్.అర్ అసెంబ్లీ లొ విమర్సించాడు.

    5. నేదురుమల్లి జనార్దన రెడ్డి పునాది రాయి వేసిన టెక్ పార్క్ కి పేరు మార్చిన సంగతి నిజమే. డెవలప్ చేసినది బాబే అయినా పునాది నేదురుమల్లిది. ఆ విషయం బాబు, ఆయన మీడియా ఎక్కడైనా చెప్పారా?

      1. ఇలా ఎదొ YCP వాల్లు చెప్పారు అంటె సరె, మీరు కూడా రాస్తె జనం నవ్వుతారు!

        నేదురుమల్లి ఆ తరువాత విజయ భాస్కర్ రెడ్డి, ఆ తరువాత NTR కూడా ముక్య మంత్రులు గా ఉన్నరు. ఆ తరువాతె చంద్రబాబు ముక్యమంత్రి అయ్యరు.

        నేదురుమల్లి జనార్దన రెడ్డి పునాది రాయి వెసింది, అమీర్ట్ పెటలొని మైత్రివనం బిల్దింగ్ కి. Hyderabad లొ Cyber towers కి ప్లాన్ చెసి, కాంట్రాక్ట్ పిలిచి L&T కి ఇచ్చింది, ఆగ మెఘాల మీదా 14 నెలల్లొ పూర్తి చెసింది చంద్రబాబె!

        మీరు కూడా నేదురుమల్లి పాట పాడితె ఎలా?

      2. ఇలా ఎదొ YCP వాల్లు చెప్పారు అంటె సరె, మీరు కూడా రాస్తె జనం నవ్వుతారు!

        నేదురుమల్లి ఆ తరువాత విజయ భాస్కర్ రె.-డ్డి, ఆ తరువాత NTR కూడా ముక్య మంత్రులు గా ఉన్నరు. ఆ తరువాతె చంద్రబాబు ముక్యమంత్రి అయ్యరు.

        నేదురుమల్లి పునాది రాయి వెసింది, అమీర్ట్ పెటలొని మైత్రివనం బిల్దింగ్ కి. Hyderabad లొ Cyber towers కి ప్లాన్ చెసి, కాంట్రాక్ట్ పిలిచి L&T కి ఇచ్చింది, ఆగ మెఘాల మీదా 14 నెలల్లొ పూర్తి చెసింది చంద్రబాబె!

        మీరు కూడా నేదురుమల్లి పాట పాడితె ఎలా?

      3. ఇలా ఎదొ YCP వాల్లు చెప్పారు అంటె సరె, మీరు కూడా రాస్తె జనం నవ్వుతారు!

      4. నేదురుమల్లి ఆ తరువాత విజయ భాస్కర్ రె.-డ్డి, ఆ తరువాత NTR కూడా ముక్య మంత్రులు గా ఉన్నరు. ఆ తరువాతె చంద్రబాబు ముక్యమంత్రి అయ్యరు.

        నేదురుమల్లి పునాది రాయి వెసింది, అమీర్ట్ పెటలొని మైత్రివనం బిల్దింగ్ కి. Hyderabad లొ Cyber towers కి ప్లాన్ చెసి, కాంట్రాక్ట్ పిలిచి L&T కి ఇచ్చింది, ఆగ మెఘాల మీదా 14 నెలల్లొ పూర్తి చెసింది చంద్రబాబె!

        మీరు కూడా నేదురుమల్లి పాట పాడితె ఎలా?

        1. ఇలా ఎదొ Y.-C.-P వాల్లు చెప్పారు అంటె సరె, మీరు కూడా రాస్తె జనం నవ్వుతారు!

        2. మైత్రివనం గురించి కాదు, రాజీవ్ టెక్ పార్క్ గురించి చెప్పాను.

          1. ఒక వేళ కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మించారు అనుకుందాం అప్పుడు పునాది రాయి ముందుగా వేసిన చంద్రబాబుకి క్రెడిట్ ఇస్తారా?

    6. This writer better to accept when more knowledgeable readers point out some factual mistakes you mention without proper study.

      He got some sort of arrogance too apart from pseudo rationalise irrational things..

      These sort of people are more harmful than even people who he try to justify like undavalli does.

  33. వ్యాసం మీద రాసిన కామెంట్లే ఉంటాయి తప్ప వ్యాసకర్తపై చేసిన వ్యాఖ్యలు తీసివేయబడతాయి. ఈ విషయంపై పదేపదే వివరణలు యివ్వడం అనవసరం

  34. ఒక పక్క IT jobs తగ్గిపోతున్నాయి.. బాబు గారు కంపెనీలు కంపెనీలు తెస్తా అన్నాడు..సంపద సృష్టి అన్నాడు.. 15 వేల కోట్లు అప్పు తెచ్చాడు..అంత చంద్రనీతి

    1. బాబు ఇట్ కంపెనీస్ అనినెక్కడ చెప్పాడు… Renewable ఎనర్జీస్, medtech జోన్ expansion, BPCL investments, manufacturing జోన్స్ కోసం ట్రై చేస్తున్నారు

  35. ఈ ఎదురీతలో బంగారు గుడ్లు పెట్టే అమరావతి మహానగరం కట్టాలంటే గత టిడిపి హయాంలోని పెండింగు బిల్లులు (జగన్ చెల్లించకుండా ఉంచినవి), జగన్ హయాంలో పెండింగు పెట్టిన బిల్లులు (రమారమి లక్ష కోట్లు అంటున్నారు) యివన్నీ చెల్లించాలి.

    –> ఎందుకు చెల్లించాలి? అమరావతి అప్పులు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కిందకి వస్తాయి. ప్రభుత్వం వేరు కార్పొరేషన్ వేరు. ఎట్లాగైతే పవర్ కార్పొరేషన్ బిల్లులు పవర్ కంపనీలు చెల్లిస్తాయో అలాగే. ఇలాంటి అసంబద్ధమైన విషాలు ఆర్టికల్ నిండా ఉన్నాయి

  36. ఈ ఎదురీతలో బంగారు గుడ్లు పెట్టే అమరావతి మహానగరం కట్టాలంటే గత టిడిపి హయాంలోని పెండింగు బిల్లులు (జగన్ చెల్లించకుండా ఉంచినవి), జగన్ హయాంలో పెండింగు పెట్టిన బిల్లులు (రమారమి లక్ష కోట్లు అంటున్నారు) యివన్నీ చెల్లించాలి.

    –> ఎందుకు చెల్లించాలి? అమరావతి అప్పులు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కిందకి వస్తాయి. ప్రభుత్వం వేరు కార్పొరేషన్ వేరు. ఎట్లాగైతే పవర్ కార్పొరేషన్ బిల్లులు పవర్ కంపనీలు చెల్లిస్తాయో అలాగే. ఇలాంటి అసంబద్ధమైన ఆర్టికల్ నిండా ఉన్నాయి

  37. ఈ ఎదురీతలో బంగారు గుడ్లు పెట్టే అమరావతి మహానగరం కట్టాలంటే గత టిడిపి హయాంలోని పెండింగు బిల్లులు (జగన్ చెల్లించకుండా ఉంచినవి), జగన్ హయాంలో పెండింగు పెట్టిన బిల్లులు (రమారమి లక్ష కోట్లు అంటున్నారు) యివన్నీ చెల్లించాలి.

    –> ఎందుకు చె ల్లించాలి? అమరావతి అ ప్పు లు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కిందకి వస్తాయి. ప్ర భు త్వం వేరు కార్పొరేషన్ వేరు. ఎట్లాగైతే పవర్ కార్పొరేషన్ బిల్లులు పవర్ కంపనీలు చెల్లిస్తాయో అలాగే. ఇలాంటి అసంబద్ధమైన విషాలు ఆర్టికల్ నిండా ఉన్నాయి

  38. ఈ ఎదురీతలో బంగారు గుడ్లు పెట్టే అమరావతి మహానగరం కట్టాలంటే గత టిడిపి హయాంలోని పెండింగు బిల్లులు (జగన్ చెల్లించకుండా ఉంచినవి), జగన్ హయాంలో పెండింగు పెట్టిన బిల్లులు (రమారమి లక్ష కోట్లు అంటున్నారు) యివన్నీ చెల్లించాలి.

    –> ఎం దు కు చె ల్లిం చా లి? అ మ రా వ తి అ ప్పు లు అ మ రా వ తి డెవలప్మెంట్ కార్పొరేషన్ కిందకి వస్తాయి. ప్రభుత్వం వేరు కార్పొరేషన్ వేరు. ఎట్లాగైతే పవర్ కార్పొరేషన్ బిల్లులు పవర్ కంపనీలు చెల్లిస్తాయో అలాగే. ఇలాంటి అసంబద్ధమైన విషాలు ఆర్టికల్ నిండా ఉన్నాయి

  39. జగన్ 10 లక్షల కోట్లు అప్పు చేసి ఏమి సాధించాడు …. బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది తప్పితే……అందుకే ప్రజలు ప్రతిపక్ష హోదా కి దూరం చేశారు….అమరావతి మీద ఇవెస్టుమెంట్ అంటే. 30 % ప్రభుత్వానికి పన్నులు రూపం లో వెన్నక్కి వస్తాయి … రాష్ట్రానికి ఒక పరిపాలన కేంద్రం వుంటుంది… 10 వేలు ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయ్ వాటి విలువ పెరిగిని మళ్ల రాష్ట్రానికి ఉపయుగ పడుతుంది

  40. baga yedusthunnavu musalodaa. neelaanti subject leni sannasula raathalani nammukuni JALAGA nidamunigi poyindhi. nee raathalaki visasa neeyatha ledhu, khabatte ituvanti boku websaitlalo maathrame neeku chotu dhakkindhi.

      1. మాటల కంటే చేతలు గట్టిగ మాట్లాడతాయి. దోషులు పట్టుకుని అప్పుడు చెప్పాలి మాటలు

  41. వ్యాఖ్యలను తట్టుకోలేక పోతే ..పక్క వాళ్ళని వ్యాఖ్యనించడం మానేయండి .. మీరు మరొకర్ని విమర్శిస్తే … మిమల్ని విమర్శించే వారు ఉంటారు ..

  42. ఫ్యాన్ పార్టీ సోషల్ మీడియా, డానికి కటాయించే వందల కోట్ల డబ్బు మీద ఆధిపత్యం కోసం , ఆ మీడియా బడ్జెట్ లో వాటా కోసం గజ్జల నీ రీప్లేస్ చేసి గ్రేట్ ఆంధ్ర వెంకట్ రెడ్డి గారు బాగా ట్రై చేస్తున్నారు, ఒక రకంగా యుద్ధమే మొదలు పెట్టారు, కానీ ప్యాలస్ నుండి అనుకూల సంకేతాలు రాలేదు అంటున్నారు, మీడియా సర్కిల్ లో.

    ఆ నిర్ణయం వెలువడిన తరువాతనే , వెనకటి రెడ్డి గారికి అనుకూలంన కాద అన్న దాన్ని బట్టి, మీ ఆర్టికల్ వుంటది అనేది, ఇన్నాళ్లు మీ వ్యాసాలు ఫాలో అవుతున్న వాళ్ళ అభిప్రాయం.

    నిర్దాక్షిణ్యంగా డిలీట్ అని కొట్టండి, దీని నీ కూడా.

  43. మరి అంత మంది అప్పులు చేసి కొన్న మాట నిజం అయితే దానినే రాజధాని గా కొనసాగించాలి కదా…మన అన్న ఎందుకు 3 రాజధానులు అని అనాలి….అంటే ప్రజలు ఏమి కోరుకుంటున్నారో కూడా తెలియని దయనీయ స్థితి లో ఉన్నారు అంటావ్…

  44. ఈ వ్యాసం బాధా, ఏడుపా, అసూయా, కుళ్లా, వెటకారమా, బాబు గారిని టార్గెట్ చెయ్యడమా, కుహనా మేధావితానమా, సలహానా, పరిష్కారమా, ఎగతాళా, ఇది అయ్యే పని కాదని చేతులు ఎత్తేయడమా, తప్పు దోవ పట్టించడమా

    1. beautiful retart by you to this writer who is most cunning unethical pseudo intellectual ,scrupples less fellow is more harmful to public opinion than the previous ruler himself.

  45. This article is cooked up with many lies and allegations, if someone started writing responses to these lies, then that will be like another big article. One such lie is

    “బాబు హయాంలోనే మహానగరం రూపు దిద్దుకోవడం లేదని గ్రహించి, అమరావతి భూముల రేట్లు 2017 నాటికి పడిపోసాగాయి. ఏమీ చేయలేక పోతున్నాడని పెట్టుబడిదారులు బాబుపై విమర్శలు గుప్పించారు.”

    Amaravathi works were actually started around 2017, as three years are passed for announcing new capital, getting approvals from farmers, planning, resolving court disputes, approvals from govt bodies, etc.. etc.. If anyone invested near Amaravathi, they know how real estate prices before and after 2017. The prices are actually raised after 2017. The downfall after 2017 is a cooked lie, and linked this lie with fight against BJP is another beautifully decorated lie.

    Every one knows that building a city will take years, may be this writer along with Jagan party thought capital is like a building construction and expected to be completed everything by 2019.

  46. జగన్ 10 లక్షల కోట్లు అప్పు చేసి ఓట్లు కోసం సంష్కేమం అనే పేరుతో పంచిన అప్పుఎవరుతీరుస్తారు….అమరవతి కి ఇన్వెస్ట్చేయడం వలన 30% పన్నులు రూపంలో ప్రభుత్వానికి తిరిగి వస్తాయి … కన్స్ట్రక్షన్ వర్కర్స్ కి పని దొరుకుతుంది… స్టీల్ , స్టోన్ క్రషర్, సిమెంట్ పరిశ్రమలలో పని దొరుకుతుంది ….10 వేల ఎకరాలు భవిషత్తు లో విలువ పెరిగి రాష్ట్రానికి ఉపయోగపడుతుంది….. అమరావతి కి గుడ్డి గా వెతిరేకించటం తగదు

    1. గుడ్డిగా వ్యతిరిచినందుకు నడ్డి మీద తన్ని మూలన కూర్చోబెట్టారు ప్రజలు

  47. మహానగరం కట్టడంపై ఎంతో మక్కువ, అవసరం ఉన్న చంద్రబాబు? ఈయన బొంకె బొక్కు కి ఎల్లలు లేవు. మహానగరం కట్టటానికి ఏమి అవసరం ఉంది? విజయవాడ గుంటూరు ని కలిపి ఒక రింగ్ రోడ్డు వేస్తే అన్నీ గ్రామాలు విలీనం అవుతాయి 20 ఏళ్ళ కి ఒక పెద్ద నగరం ఏర్పాడుతుంది ..హైద్ అంటే కదా ..చి ఛీ ఇంత దారుణం గా రాస్తారా వ్యాసాలు
  48. బడ్జెట్ లో అమరావతికి ఇస్తామన్న 15 వేల కోట్లు అప్పు అని రాశారు మీరు… ఆ తర్వాత ప్రెస్ మీట్ లో ఆవిడ క్లారిటీ ఇచ్చారు. అది అప్పే అయినా అది రాష్ట్రానికి సంబంధం లేదు. మాది హామీ అని. కానీ మీరు అంతకు ముందే రాసేసినట్లున్నారు ఈ స్టోరీ. ఆ ప్రెస్ మీట్ విని మళ్ళీ మీ స్టోరీని రీ వ్రైట్ చేసుకోవడం బెటరేమో చూడండి.

  49. మీ వంకర బుద్ధి పోలేదు ఇంకా . ఒక సిటీ లో మనం కొంత పెట్టుబడి పెట్టి ఇన్ఫ్రా క్రియేట్ చేస్తాం. మెల్లగా కంపెనీ లు యూనివర్సిటీ లు వచ్చి అక్కడ మంచి బిజినెస్ అభివృద్ధి అయితే అప్పుడు లాండ్ ప్రభుత్వం చేతుల్లో ఉంది గనుక ఈ ఆదాయం అప్పుడు ఎవరిది .రీసెంట్ గా హైడ్బద్ శివార్లు లో భూమి అమ్మితే 3 వేల కోట్ల ఆదాయం తెలంగాణ కు వచ్చింది .రిజిస్ట్రేషన్ ఆదాయం అక్కడ జరుగుతున్న ప్రతి వ్యాపారం లో పన్నులు ప్రభుత్వానికి ప్రజలకు ఉపాధి .వస్తుంది . ఇంకా రియల్ ఎస్టేట్ అని ప్రచారం చేస్తున్నారు .చాలా తప్పుడు ప్రచారం అది . ఇప్పటికీ ఇలాంటి ప్రచారం చేసే జగన్ నష్ట పాయారు అయిన ఇంకా విషం ఆపడం లేదు

  50. బాబు కు ఎందుకు హైడ్రీరాబాద్ లో క్రెడిట్ అన్నారు ? కేవలం హైటెక్ సిటీ కి జనార్ధన్ రెడ్డి పునాది వేస్తే సరిపోతుందా ???

  51. ఘోస్ట్ సిటీ యే,లేనిచో బర్రెల బందలెదొడ్డి… అభివృద్ధి చేసి రాజధాని లో ప్లాట్స్ అప్పగిస్తాడు చిత్తశుద్ధి ఉన్నోడు.చెత్తలో సంపద ఏరుకునే వాడు 😂 జీవితాంతం వెతుక్కుంటూ అక్కడే,ఆ మూలే గడిపేస్తాడు.

  52. నాకు ఒక నాలుగు.నెలల క్రితం మీరు ఇచ్చిన రిప్లై ఇది . గ్రామీణ ఓ ట ర్ అంతా జగన్ వయిపు అంటారు అని రాసావు నాకు ఇప్పటికీ గుర్తు ఉంది . ఇప్పుదు నా డౌటు ఎంటి అంటే గ్రామీణ ఓటర్ వెయ్య కుండానే ఎవరికి అయిన 164 సీట్లు వస్తాయి నా

  53. Amaravati Funds Clarification ‘To Be Arranged‘ అంటే అప్పు అని ప్రచారం చేస్తున్నారు గతంలో పోలవరంకు కూడా కేంద్రం HUDCO నుండి ఇలానే చేసింది. తరువాత కేంద్రమే Reimburse చేసింది ఇటువంటి ప్రాజెక్టులకు చాలా సంస్థలు ఫండింగ్ ఇస్తాయి కాబట్టి సొంత నిధుల మీద ప్రెషర్ లేకుండా arrangement ఇది

  54. ఒక ముఖ్యమైన విషయాన్ని తల, తోక లేకుండా … ఇంత గొప్పగా … మీరొక్కరే వ్రాయగలరు!!

  55. Prasad garu

    I booked 2 books from above link

    For bangalore address they charged delivery charges which i paid total

    Now they called and saying i need to collect at central railway station.

    Please make it delivered the specified address

      1. కనీసం నోరు తెరిచి అడిగినందుకు ఇంకో పుస్తకం హోం అడ్రస్ కే పంపించ వచ్చు కదా. పాపం తన డబ్బుతో ఇష్టపడి కొన్నారు.

  56. రచయిత గారికి ఫ్యాన్ పార్టీ సలహా దారుడు పదవి ఇచ్చి ఫ్యాన్ పార్టీని అధికారము లో కి తీసుకు రావడానికి సలహాలు ఇవ్వాల్సిందిగా వినతి.

  57. ”జగన్ వచ్చాకనే అమరావతి అభివృద్ధి సడన్‌గా ఆగిపోయిందని చాలామంది కథనాలు వెలువరిస్తూంటారు. అది నిజం కాదు.” This sentence alone is enough, not to completely read this article.

  58. Prasad garu

    Just now i got books

    The courrier did not delivered to the given address.

    I came and collect wherever they asked to come.

    Thank you for your support

  59. jagan nErchukOvAlsindi pratee meeDIyaalOnu tana uniki saanukuula vaartalu vacchETTu chUsukODam. ani chaalaasaarlu cheppina, kuuDa unDe chetta reddlu daanini saaganeeyalEdu… ippuDu adE paddati..

Comments are closed.