తమిళ నిర్మాతల మండలి ధనుష్ పై ఫోకస్ పెట్టింది. అతడి దూకుడుకు కళ్లెం వేసింది. ఆల్రెడీ కొంతమంది నిర్మాతల నుంచి ధనుష్ అడ్వాన్సులు తీసుకున్నారని, కానీ వాటిని పక్కనపెట్టి, మరికొంతమంది నిర్మాతలకు ఆయన సినిమాలు చేస్తున్నారని ఆరోపించింది.
ఈ సందర్భంగా ధనుష్ తో సినిమాలు చేయబోయే నిర్మాతలకు చిన్నపాటి సూచన చేసింది. ఇకపై ధనుష్ తో సినిమాలు చేయాలనుకునే నిర్మాతలు, ఓసారి నిర్మాతల మండలిని సంప్రదించాలని కోరింది.
ధనుష్ పై ఈ తరహా అభియోగాలు, విమర్శలు రావడం ఇదే తొలిసారి కాదు. అతడు తెలుగులో సర్ సినిమా చేస్తున్నప్పుడు కూడా ఈ విమర్శలు వచ్చాయి. కొంతమంది తమిళ నిర్మాతల నుంచి అడ్వాన్సులు తీసుకొని, ఆ సినిమాలు చేయకుండా, తెలుగు ప్రొడ్యూసర్లకు సినిమాలు చేస్తున్నారంటూ కొన్ని కంప్లయింట్స్ వెళ్లాయి. అవి ఇప్పుడు మరోసారి తెరపైకొచ్చాయి. గతంలో విశాల్ పై కూడా ఇలాంటి ఆరోపణలొచ్చాయి. వాటిని అతడు క్లియర్ చేసుకున్నాడు.
కొన్ని కీలక నిర్ణయాలు…
పరిశ్రమకు సంబంధించి తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలపై తమిళ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చర్చించింది. కొన్ని అంశాలపై డెసిషన్స్ తీసుకుంది. ఇందులో భాగంగా పెద్ద హీరోల సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్స్ పై నిర్ణయం తీసుకుంది. పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలోనే ముందుగా రిలీజ్ అవ్వాలని, అలా రిలీజైన సినిమాలు 8 వారాల తర్వాత మాత్రమే ఓటీటీలోకి రావాలని నిర్ణయం తీసుకున్నారు.
దీనికి సంబంధించి మరింత పకడ్బందీగా నిబంధనల్ని రూపొందించాలని నిర్ణయించింది. అందుకే ఆగస్ట్ 16 నుంచి కొత్త సినిమాల ప్రారంభోత్సవాల్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. అదే విధంగా హీరోహీరోయిన్ల డేట్స్, టెక్నీషియన్స్ రెమ్యూనరేషన్లపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ప్రస్తుతం సెట్స్ పై ఉన్న షూటింగ్స్ ను అక్టోబర్ 30లోగా పూర్తిచేయాలని, నవంబర్ 1 నుంచి తమిళ సినిమాలకు సంబంధించి అన్ని రకాల షూటింగ్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని నిలిపివేయాలని సంఘం ఏకగ్రీవంగా తీర్మానించింది.
కోలీవుడ్ కు సంబంధించి విధివిధానాల రూపకల్పనకు, సమస్యల పరిష్కారానికి కొంతంమది నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ యజమానులతో జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటుచేసింది తమిళ నిర్మాతల మండలి.
జనం పట్టించుకోరు
ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మేం థియేటర్లో చూడం