మరోసారి ఏప్రిల్ లో వస్తున్న ప్రభాస్

అనుమానాలు పటాపంచలయ్యాయి. రాజా సాబ్ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తారనే ఊహాగానాలకు చెక్ పడింది. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కు షెడ్యూల్ చేశారు. ఏప్రిల్ 10 విడుదల. Advertisement కొద్దిసేపటి కిందట…

అనుమానాలు పటాపంచలయ్యాయి. రాజా సాబ్ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తారనే ఊహాగానాలకు చెక్ పడింది. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కు షెడ్యూల్ చేశారు. ఏప్రిల్ 10 విడుదల.

కొద్దిసేపటి కిందట రాజాసాబ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. సినిమా నుంచి ఇప్పటికే ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజైంది. ఫస్ట్ లుక్ లో లుంగీ కట్టి మాస్ గా కనిపించిన ప్రభాస్, ఈరోజు రిలీజ్ చేసిన వీడియోలో స్టయిలిష్ గా కనిపించాడు.

అలా బైక్ పై దిగి పూల బొకే పట్టుకొని, స్మైల్ ఇచ్చే వీడియో ఇది. అద్దంలో తన మొహం చూసుకొని, తనే పొంగిపోతూ, పువ్వులతో తనకుతానే దిష్టి తీసుకునే విజువల్ ఆకట్టుకునేలా ఉంది.

ఏప్రిల్ కలిసొస్తుందా..?

ఈ సినిమాతో మరోసారి ఏప్రిల్ బాక్సాఫీస్ లో అడుగుపెడుతున్నాడు ప్రభాస్. ఏప్రిల్ నెల ఈ హీరోకు బాగా కలిసొచ్చింది. అలా అని పూర్తిగా హిట్స్ ఉన్నాయని కూడా చెప్పలేం.

ముందుగా హిట్స్ విషయానికొస్తే.. ప్రభాస్ కెరీర్ ను మలుపుతిప్పిన బాహుబలి-2 సినిమా ఏప్రిల్ నెల్లోనే విడుదలైంది. ఇక బిల్లా, డార్లింగ్, మిస్టర్ పెర్ ఫెక్ట్ లాంటి సినిమాలు కూడా ఏప్రిల్ నెలల్లోనే రిలీజయ్యాయి. అదే టైమ్ లో ఏప్రిల్ మాసంలో పౌర్ణమి, మున్నా లాంటి సినిమాలు కూడా వచ్చాయి.

ఓవరాల్ గా ప్రభాస్ కెరీర్ లో ఎక్కువ రిలీజెస్ ఏప్రిల్ లోనే ఉన్నాయి. ఇప్పుడు రాజా సాబ్ కూడా ఆ లిస్ట్ లోకి చేరింది. మారుతి డైరక్ట్ చేసిన ఈ సినిమా ఓ హారర్ రొమాంటిక్ కామెడీ అనే విషయాన్ని ఈరోజు స్పష్టం చేశారు.

2 Replies to “మరోసారి ఏప్రిల్ లో వస్తున్న ప్రభాస్”

Comments are closed.