రవితేజ‌ తరువాత రామ్.. మరి ఉస్తాద్?

హీరో రవితేజ‌తో చేస్తున్న సినిమా తరువాత రామ్ పోతినేనితో సినిమా చేస్తున్నట్లు దర్శకుడు హరీష్ శంకర్ వెల్లడించారు.

హీరో రవితేజ‌తో చేస్తున్న సినిమా తరువాత రామ్ పోతినేనితో సినిమా చేస్తున్నట్లు దర్శకుడు హరీష్ శంకర్ వెల్లడించారు. రవితేజ‌ సినిమా వెంటనే వుంటుందని చెప్పలేదు కానీ, రామ్, హరీష్ ఇద్దరూ అగస్ట్ 15 తరువాత ఫ్రీ అయిపోతారు కనుక, అదే వుంటుందని అనుకోవాలి. మరి ఈ లెక్కన పవన్ తో చేసే ఉస్తాద్ భగత్ సింగ్ సంగతి ఏమిటి? అన్నది క్వశ్చను.

ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేస్తాను అని పవన్ కళ్యాణ్ నిర్మాతలకు హామీ ఇచ్చారని తెలుస్తోంది. మరి హరీష్ శంకర్ ఇప్పుడు రామ్ సినిమా మీదకు వెళ్తే, ఉస్తాద్ సంగతేమిటి? అంటే హరి హర, ఓజి సినిమాలు పూర్తయ్యేలోగా హరీష్ ఓ సినిమా చేసేయచ్చు అన్న మాట. అందుకే హరీష్ ఈ సినిమా మీదకు వెళ్తున్నారు అనుకోవాలి.

అదీ కాక ఓజి, హరి హర వీరమల్లు సినిమాల విడుదలకు కనీసం అయిదారు నెలల గ్యాప్ వుండాలి. అంటే ఓ ఏడాదిలో రెండు సినిమాలు అనుకుంటే 2025 ఈ రెండు సినిమాలకు సరిపోతుంది. అంటే 2026 కు కానీ ఉస్తాద్ సినిమా తెర మీదకు వచ్చే అవకాశం లేదనుకోవాలి.

5 Replies to “రవితేజ‌ తరువాత రామ్.. మరి ఉస్తాద్?”

Comments are closed.