‘ఇస్మార్ట్’ – నైజాంలో బాయ్ కాట్!

ఇప్పటికే నైజాం థియేటర్ల యజ‌మానులు అంతా తమలో తాము కూడబలుక్కుని, ఇస్మార్ట్ సినిమాను ప్రదర్శించకూడదని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా

సరిగ్గా రెండు వారాల టైమ్ మిగిలింది డబుల్ ఇస్మార్ట్ సినిమా విడుదలకు. సోలో సినిమా అనుకుంటే బలమైన పోటీ మధ్య ఇరుక్కుంది. రవితేజ‌- మిస్టర్ బచ్చన్, విక్రమ్- తగలాన్ సినిమాలు రంగంలోకి దిగాయి. గీతా సంస్థ నుంచి ఆయ్ అనే చిన్న సినిమా కూడా వస్తోంది. ఇలాంటి టైమ్ లో డబుల్ ఇస్మార్ట్ సినిమా వస్తోంది. పైగా దీనికి ఫిలిం ఛాంబర్ నుంచి ఎంత క్లీన్ చిట్ వచ్చినా ఎగ్జిబిటర్ల కోపం చల్లార్చాల్సిన బాధ్యత పూరి- చార్మీ ల మీద వుండనే వుంది.

నైజాంలో ఎగ్జిబిటర్లకు ఎనిమిది కోట్ల వరకు ఇవ్వాలి. ఇవ్వాల్సింది పూరి, చార్మి కాదు. అప్పటి బయ్యర్ వరంగల్ శ్రీను. కానీ ఈ ఎగ్జిబిటర్లలో ఆసియన్ సునీల్ లాంటి వాళ్లు చార్మికి చెప్పే మూడు కోట్ల వరకు అందించారు. ఇప్పుడు లీగల్ గా లయబులిటీ లేదు అని తప్పించుకోవచ్చు. కానీ ఇక్కడ సమస్య థియేటర్లతో. ఎగ్జిబిటర్లను బలవంతంగా మా సినిమా ప్రదర్శించాల్సిందే అని కట్టడి చేయడానికి లేదు.

ఇప్పటికే నైజాం థియేటర్ల యజ‌మానులు అంతా తమలో తాము కూడబలుక్కుని, ఇస్మార్ట్ సినిమాను ప్రదర్శించకూడదని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఈ విషయాన్ని అఫీషియల్ గా చెప్పడం లేదు కానీ ప్రస్తుతానికి అయితే ఇస్మార్ట్ కు థియేటర్లు ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారు.

ఆసియన్ సినిమాస్ సంస్థకు మూడు కోట్లు ఇవ్వాలి. లేదంటే వాళ్ల థియేటర్లలో ఇస్మార్ట్ పడదు. ఆసియన్ సినిమాస్ చేతిలో ఎఎంబి, ఎఎఎ తో సహా మల్టీ ఫ్లెక్స్ లు, సింగిల్ స్క్రీన్ లు వందకు పైగా వున్నాయి. అలాగే దిల్ రాజుకు సంబంధించి వైజాగ్ తకరారు వుంది. అది తేలకపోతే ఉత్తరాంధ్రలో ముఫైకి పైగా థియేటర్లు ఇస్మార్ట్ కు దూరం అవుతాయి.

సోలోగా విడుదల అయివుంటే వేరుగా వుండేది. థియేటర్ లు పెంకితనం చేసే అవకాశం వుండేది కాదు. కానీ బచ్చన్, తంగలాన్ సినిమాలు వున్నాయి కనుక, పంతానికి అయినా అవి వేసుకుంటారు. పైగా ఇస్మార్ట్ ఎలా వుంటుంది అన్నది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. జ‌స్ట్ పాటలు వదిలారు. బచ్చన్ పాటలతో చూసుకుంటే కలర్ ఫుల్ గా లేవు. మణిశర్మ ఏమంత గొప్ప బాణీలు ఇచ్చినట్లు కనిపించడం లేదు. ట్రయిలర్ వస్తేనే సినిమా మీద ఓ ఐడియా వస్తుంది.

ఈ పరిస్థితుల్లో ఇప్పటి వరకు నైజాం ఎవరు పంపిణీ చేస్తారు అన్నది తేలలేదు. ఏపీ, సీడెడ్ ల్లో మార్కెట్ చేస్తున్నారు తప్ప నైజాంలో ప్రస్తుతానికి అలా వుంచారు.

4 Replies to “‘ఇస్మార్ట్’ – నైజాంలో బాయ్ కాట్!”

  1. నైజం వాళ్లు పూరిని మంచానికి కట్టేసి పోకిరి టైపు లో కొత్తగా ట్రై చేస్తున్నట్టు ఉన్నారు. సరే అలాక్కాని , మీ ఆనందమే మాకు ప్రమోదం.

Comments are closed.