గిల్డ్ బాధ్యతలకు ‘దిల్’ దూరం?

ఇకపై యాక్టివ్ ప్రోడ్యూసర్స్ గిల్డ్ బాధ్యతలకు నిర్మాత దిల్ రాజు దూరంగా వుండబోతున్నారా? ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే టాక్ వినిపిస్తోంది. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అన్నది అల్లు అరవింద్, దిల్ రాజు తదితరుల బ్రెయిన్…

ఇకపై యాక్టివ్ ప్రోడ్యూసర్స్ గిల్డ్ బాధ్యతలకు నిర్మాత దిల్ రాజు దూరంగా వుండబోతున్నారా? ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే టాక్ వినిపిస్తోంది. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అన్నది అల్లు అరవింద్, దిల్ రాజు తదితరుల బ్రెయిన్ చైల్డ్. సుప్రియ, మరి కొందరు యాక్టివ్ గా వున్నా కూడా ప్రధానంగా దిల్ రాజు ఆలోచనలు, ప్లానింగ్ మేరకు గిల్డ్ నడుస్తూ వస్తోంది. 

సినిమాల విడుదలలు స్ట్రీమ్ లైన్ చేయడం, నిర్మాతలకు ఖర్చులు తగ్గించడం, హీరోలు మినహా మిగిలిన నటులందరి పారితోషికాలు తగ్గించే ప్రయత్నం చేయడం, అన్నింటికి మించి ప్రకటనలు కంట్రోలు చేసి, తద్వారా మీడియాకు ముకుతాడు వేయాలని ప్రయత్నించడం వంటి కార్యక్రమాలు గిల్డ్ ఆలోచనల్లో వున్నాయి. 

అయితే ఇవన్నీ అంత ఫలితాలు ఇవ్వలేదు కానీ దిల్ రాజును ఇండస్ట్రీలో కొంత నెగిటివ్ చేసాయి. థియేటర్లను, నిర్మాతలను గుప్పిట్లో పెట్టుకుని వేరే డిస్ట్రిబ్యూటర్లను ఎదగనివ్వడం లేదనే విమర్శలు స్టార్ట్ అయ్యాయి. ఇండస్ట్రీలో దిల్ రాజు అనుకూలురు ఎందరు వున్నారో, వ్యతిరేకులు కూడా పెరగడం ప్రారంభమైంది. 

ఇవన్నీ దిల్ రాజును కాస్త బాధపెట్టినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఈ స్థాయికి వచ్చిన తరువాత తన వంతు బాధ్యతగా నిర్మాతల కోసం ఎంతో కొంత చేయాలనుకున్నానని, అంతే తప్ప ఇందులో మరేం లేదని ఆయన తన సన్నిహితుల దగ్గర బాధపడినట్లు తెలుస్తోంది. 

ఇకపై ఇలా వేరే విషయాల మీద టైమ్ వృధా చేసే బదులు, తన సినిమాలు , తన ప్రాజెక్టులు సెట్ చేసుకోవడానికి కీలకంగా పని చేయాలని దిల్ రాజు నిర్ణయించుకున్నట్లు బోగట్టా.

తెలంగాణలో పార్టీ వద్దన్నదే జగన్ భావన