వ్యవసాయానికి ‘శ్రీకారం’

శర్వానంద్ హీరోగా 14రీల్స్ ప్లస్ నిర్మిస్తున్న సినిమా శ్రీకారం.  ఈ సినిమా టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు  విడుదల చేసారు. ప్రతి ఒక్క ప్రొఫెషనల్ తన కొడుకును తన వృత్తిలోకి తీసుకురావాలని…

శర్వానంద్ హీరోగా 14రీల్స్ ప్లస్ నిర్మిస్తున్న సినిమా శ్రీకారం.  ఈ సినిమా టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు  విడుదల చేసారు. ప్రతి ఒక్క ప్రొఫెషనల్ తన కొడుకును తన వృత్తిలోకి తీసుకురావాలని అనుకుంటాడు. 

కానీ ఒక్క రైతు మాత్రమే అలా అనుకోవడం లేదు. ఎందుకు? ఈ పరిస్థితి ఎలా మారుతుంది అనే మంచి మెసేజ్ తో శ్రీకారం సినిమాను నిర్మిస్తున్నట్లు టీజర్ మరోసారి క్లారిటీ ఇచ్చింది. తినేవాళ్లు తలమీద జుట్టు అంతమంది వుంటే పండించేవాళ్లు మీసం అంత కూడా లేరనే మంచి డైలాగ్ టీజర్ లో వినిపించింది.

ఇదివ‌ర‌కే 'శ్రీ‌కారం'కు సంబంధించి విడుద‌ల చేసిన “బ‌లేగుంది బాలా”, “సంద‌ళ్లె సంద‌ళ్లే సంక్రాంతి సంద‌ళ్లే..” పాట‌లు సంగీత ప్రియుల‌ను బాగా అల‌రిస్తున్నాయి. స‌ర్వ‌త్రా వీటికి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. మిక్కీ జె. మేయ‌ర్ త‌న‌కు అల‌వాటైన త‌ర‌హాలో విన‌సొంపైన బాణీలు అందించారు.  

శ‌ర్వానంద్ సరసన ప్రియాంక (గ్యాంగ్ లీడర్) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు . కిశోర్ దర్శకుడు 14  రీల్స్ ప్ల‌స్‌  బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌హాశివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న 'శ్రీ‌కారం'ను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌నున్నారు.