టాలీవుడ్ భామ‌ను బాధిస్తున్న వ్యాధి

టాలీవుడ్ భామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌తి విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంటారు. తాజాగా ఆమె తాను సుదీర్ఘ‌కాలం నుంచి త‌న‌ను ఇబ్బంది పెడుతున్న జ‌బ్బు గురించి చెప్పి అంద‌ర్నీ షాక్‌కు గురి…

టాలీవుడ్ భామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌తి విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంటారు. తాజాగా ఆమె తాను సుదీర్ఘ‌కాలం నుంచి త‌న‌ను ఇబ్బంది పెడుతున్న జ‌బ్బు గురించి చెప్పి అంద‌ర్నీ షాక్‌కు గురి చేశారు.  

చిన్న వ‌య‌సులోనే  బ్రాంకియాల్‌ ఆస్తమా (శ్వాసకోశ వ్యాధి) ఆటాక్‌ అయినట్లు త‌న‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. ఈ వ్యాధి కార‌ణంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చేదని ఆమె చెప్పుకొచ్చారు. 

శీతాకాలం వస్తే ఈ వ్యాధి లక్షణాలు మరింత ఎక్కువగా అయ్యేవన్నారు.  ఊపిరి తీసుకోడానికి కూడా ఇబ్బంది పడినట్లు ఆమె త‌న ఇబ్బందుల‌ను అభిమానుల‌తో పంచుకున్నారు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న కాజ‌ల్ అగ‌ర్వాల్ పోస్టు గురించి తెలుసుకుందాం.

‘నాకు ఐదేళ్ల వయసు నుంచే బ్రాంకియాల్‌ ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నా. ఈ వ్యాధి నుంచి రిలాక్సేష‌న్ కోసం ఇప్పటికి ఇన్‌ హేలర్‌‌ వాడుతున్నా. అది చాలా బాగా పని చేస్తుంది. అవుట్‌ డోర్‌ షూటింగ్స్‌కు వెళ్లినప్పుడు ఈ ఇన్‌హెలర్‌ను తీసుకెళ‌తాను. 

ఈ వ్యాధితో బాధపడేవారు మన దేశంలో ఎక్కువగా ఉన్నారు.  దీని గురించి ఇతరులతో చెప్పుకోవడానికి కానీ ఇన్‌ హేలర్‌‌ వాడడానికి సిగ్గు పడుతుంటారు. ఇక మీద‌ట అలాంటి వాటికి చెక్‌ పెట్టండి. సే ఎస్‌ టూ ఇన్‌ హేలర్‌’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. 

తెలంగాణలో పార్టీ వద్దన్నదే జగన్ భావన