జగన్ ఎంత బలహీనుడో ఆయన కేబినెట్ ను చూస్తే తెలిసిపోతుందని అంటున్నారు తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. జగన్ ఏదో చేస్తాడని అనుకున్న సొంత వర్గం కూడా ఇప్పుడు నిస్పృహకు లోనవుతోందంటూ చంద్రబాబు కొత్త స్టేట్ మెంట్ ఇచ్చారు. మరి ఇందులో చంద్రబాబు అసలు ఉద్దేశం ఏమిటో మరి!
జగన్ ను కొందరు నేతలు బ్లాక్ మెయిల్ చేసి మంత్రి పదవులు పొందారని చంద్రబాబు నాయుడు అంటున్నారు! వారెవరో, ఎందుకో చెప్పడం లేదో చంద్రన్న.
ఆ సంగతలా ఉంటే.. జగన్ ఎంత బలహీనుడో చెప్పడానికి ఆయన కేబినెట్ కూర్పు చాలని చంద్రబాబు చెప్పుకున్నారు. ఏదేమైనా.. జగన్ కేబినెట్ లో వేరే పార్టీ తరఫున నెగ్గిన ఎమ్మెల్యేలు అయితే లేరు. గత పర్యాయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గిన నలుగురు ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు కేబినెట్ బెర్త్ లు ఇచ్చారు!
బహుశా.. రాజకీయంగా అంత నైచ్యం, దిగజారుడు తనం లేదేమో. సొంత పార్టీ తరఫున నెగ్గిన వంద మందికి పైగా ఎమ్మెల్యేలున్నా, ప్రతిపక్ష పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తెచ్చుకుని మరీ మంత్రి పదవులు ఇచ్చుకోవాల్సిన దౌర్భాగ్యం చంద్రబాబుకు పట్టిందప్పట్లో. మరి అంత దౌర్భాగ్యానికి గురై కూడా సాధించింది ఏమైనా ఉందంటే.. అదే 23 సీట్లు!
మరి తన కేబినెట్లో నలుగురు ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇచ్చిన ట్రాక్ రికార్డును కలిగిన చంద్రబాబు ఇప్పుడు జగన్ కేబినెట్ గురించి కామెంట్ చేయడం కామెడీ. తను కేబినెట్ కూర్పును అప్పుడే జనాలు మరిచిపోయారనేది ఈ నయా గోబెల్స్ థియరీ కాబోలు!