విశాఖ చిన్న పల్లె కారు ప్రాంతంగా తన ప్రస్తావనను ప్రారంభించింది. డచ్చి వారు బ్రిటిష్ పాలకులకు నచ్చి విశాఖ బాగా ఎదిగింది. ఇప్పటికి 125 ఏళ్ల క్రితమే విశాఖ ఉత్తరాంధ్ర అంతా కలుపుకుని అతి పెద్ద జిల్లాగా అవతరించింది. ఈ రోజుకు విశాఖలో కనిపిస్తున్న అభివృద్ధిలో సగానికి సగం బ్రిటిష్ వారి హయాంలో జరిగిందే అని చెప్పుకుంటారు. చిన్న పల్లెటూరుగా విశాఖ ఉన్నపుడు వందల్లో వేలల్లో ఉన్న జనాభా కాస్తా తాజా గణాంకాల ప్రకారం చూస్తే పాతిక లక్షలకు పై దాటింది. కాస్మోపాలిటన్ సిటీగా ఎదిగింది. విశాఖ ఎదుగుదల వెనక అందరి కష్టమూ ఉంది.
విశాఖ అంటే సిటీ ఆఫ్ డెస్టినీ అని పేరు. విశాఖకు ప్రకృతి పరమైన ముప్పు ఉందా అంటే పర్యావరణ వేత్తలు చెప్పేది ఏమిటి అంటే విశాఖకు ముప్పు పొంచి ఉందనే. అది కూడా వాతావరణంలో మార్పుల వల్లనే ఈ ముప్పు అని అంటున్నారు. విశాఖలో సముద్రం ముందుకు వస్తోందని బెంగళూరులోని స్టడీ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్ పాలసీ సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడి అయింది. విశాఖలో చూస్తే 1987 నుంచి 2021 మధ్య కాలంలో 2,381 సెంటీమీటర్ల భూభాగం సముద్రంలో కలసి పోయిందని చెబుతోంది.
ఇది మరో పదహారేళ్ల కాలంలో 2040 నాటికల్లా సముద్రం మరింతగా ముందుకు వచ్చి మరో అయిదారు శాతం భూ భాగం సముద్రంలో కలసిపోతుందని తమ అధ్యయనంలో తేలిందని చెబుతున్నారు. ఇది వినడానికి ఆందోళన కలిగించేది అయినా నిజమే అని అంటున్నారు విశాఖలో తరచూ సముద్రం ముందుకు రావడం కూడా సాధారణంగా కనిపిస్తున్న విషయమే.
ఇప్పటికి కొన్ని శతాబ్దాల క్రితం చూస్తే వైశాఖేశ్వరుని ఆలయం సముద్రం ఒడ్డున ఉండేది. ఆ ఆలయాన్ని సముద్రం కబలించడంతో ఇపుడు అది సముద్ర గర్భంలో ఉందని చరిత్ర కారులు చెబుతారు. విశాఖకు సునామీ ముప్పు అంటారు అది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ హుదూద్ బీభత్సం మాత్రం హడలెత్తించింది. విశాఖ భూకంపాల జోన్ లో అయితే లేదు కానీ వెనక కొండలు ముందు సముద్రం మధ్యన నగరం ఉండడం వల్ల ఆహ్లాదరకమైన పరిస్థితులతో పాటు ఆందోళనకరమైన స్థితులు కూడా ఉంటాయని పర్యావరణ వేత్తలు చెబుతున్న మాట.
సముద్రం సి xxగ్గు పడాలి , భూ బకాసురలని చూసి వాళ్ళు 2040 నాటికి 90% ఆరగించగలరు, సముద్రం జస్ట్ 5%.. కి కి
jaggulu raajadhanini visakhaki taralinchalani nirnayinchinappudu ide maata chepite, ala cheppinavarini mee site lo boothulu tittaru.
మనము మింగేసిన వాటా ఎంత ?
ఏంటి సముద్రo కూడానా?
సముద్రం. మింగేస్తుందో లేదో కానీ మన A2
“విజయ శాంతిరెడ్డి” & సుబ్బి రెడ్లు గత 5 ఏళ్లలో ప్రభుత్వ, దేవాదాయ భూములు & litigation ఉన్న భూములు మొత్తం 100 శాతం మింగేశారు..
అమరావతి ముంపు ప్రాంతం అందుకే విశాఖపట్టణం రాజధాని అయితే సురక్షిత ప్రాంతం అని ప్రచారం చేస్తున్నారు గా అన్నయ్య అభిమానులు..