తనపై ఈడీ దాడులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం వ్యూహ రచన చేసినట్టు లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ అన్నారు. లోక్‌సభలో తన చక్రవ్యూహం ప్రసంగం కొంత మందికి నచ్చలేదని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ కామెంట్స్ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
పార్లమెంట్ సమావేశాల్లో విపక్ష సభ్యులు ప్రధానంగా ఈడీ, సీబీఐ, ఐటీల గురించే ప్రస్తావిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా వుండే నాయకులపై కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లో ఉన్న వ్యవస్థల్ని ప్రయోగిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తోందని ప్రతిపక్షాల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇదే బీజేపీకి మిత్రపక్షాలైన నాయకుల విషయంలో మాత్రం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వానికి రాహుల్‌గాంధీ కొరకరాని కొయ్యగా మారారు. పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై విరుచుకుపడుతూ, బలమైన ప్రత్యామ్నాయ నాయకుడిగా దేశ ప్రజలను ఆకర్షిస్తున్నారు.
రాహుల్‌గాంధీ మంచి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు రావడంతో విపక్షాల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ తనపై ఈడీ దాడులకు రెడీ అవుతున్నట్టు ఆరోపించడం చర్చనీయాంశమైంది. రాహుల్ ఆరోపించినట్టు ఆయనపై ఈడీ దాడులకు పాల్పడి, మరింత ఇమేజ్ పెంచుతారా? లేదా? అనేది తేలాల్సి వుంది.
సరే కానీ రాహులా, జందెము ఉందా హీకేసినావా? Thats the dumbest comes to mind whenever i read any news about you.
నిజమే రాహుల్ గాంధీ కేంద్రానికి కొరకరాని కొయ్యగా మారాడు.
రాహుల్ గాంధీని అనురాగ్ ఠాకూర్, నిర్మలా సీతారామన్ వగైరాలు బండకేసి బాది ఉతుకుతుంటే ఏడుపు మొహమ్ పెట్టుకుంటే, పక్కనున్న I.N.D.I. కూటమి వాళ్ళు కనీసం మద్దత్తుగా వచ్చి ఆదుకోపోవటం దారుణం.
ప్రజలు రాహుల్ గాంధీ మీద ఆశపెట్టుకోవటానికి కారణం ఉన్నది. మోడీ సీరియస్ పాలనలో నవ్వు మర్చిపోయిన ప్రజలు, రాహుల్ గాంధీలో జోకర్ ను చూసి కడుపారా నవ్వుకోవచ్చని. ప్రజలకు కొంతైనా వినోదం కావాలి కదా !
అయినా మోడీ నియంతృత్వానికి అంతులేకుండా పోయింది. అల్రెడీ నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే బెయిల్ మీద ఉన్న రాహుల్ ను, మిగిలిన అవినీతి కేసుల్లో కూడా లోపల వేయాలనే అలోచన కడు దుర్మార్గం