ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా బొత్స పేరు ఖ‌రారు

ఉమ్మ‌డి విశాఖ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ వైసీపీ అభ్య‌ర్థిగా బొత్స స‌త్య‌నారాయ‌ణ పేరు ఖ‌రారైంది. విశాఖ జిల్లా వైసీపీ నాయ‌కుల‌తో మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మావేశం అనంత‌రం ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ…

ఉమ్మ‌డి విశాఖ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ వైసీపీ అభ్య‌ర్థిగా బొత్స స‌త్య‌నారాయ‌ణ పేరు ఖ‌రారైంది. విశాఖ జిల్లా వైసీపీ నాయ‌కుల‌తో మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మావేశం అనంత‌రం ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు బొత్స పేరును జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌డం విశేషం.

వంశీకృష్ణ యాద‌వ్‌పై అన‌ర్హ‌త వేటుతో ఎమ్మెల్సీ స్థానానికి ఖాళీ ఏర్ప‌డింది. విశాఖపట్నం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా 2021, న‌వంబ‌ర్ 27న ఆయ‌న ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. అదే ఏడాది డిసెంబర్ 8న ఎమ్మెల్సీగా ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చేశారు.

2023, డిసెంబ‌ర్ 27న వంశీకృష్ణ యాద‌వ్ వైసీపీకి రాజీనామా చేశారు. అనంత‌రం జ‌న‌సేన‌లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే వంశీకృష్ణ‌యాద‌వ్ ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌క‌పోవ‌డంతో ఆయ‌న‌పై వైసీపీ అన‌ర్హ‌త వేటు వేసింది. ఇప్పుడా స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. వైసీపీ అభ్య‌ర్థిగా వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడైన బొత్స స‌త్య‌నారాయ‌ణను నిల‌పాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించ‌డం స‌రైందే అన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

వైసీపీకి స్థానిక సంస్థ‌ల్లో బ‌లం వుంది. అయితే అధికారంలో కూట‌మి వుండ‌డంతో ఈ ఎన్నిక ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. ఎలాగైనా వైసీపీ గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉండ‌గా, టీడీపీ సీరియ‌స్‌గా తీసుకోనుంది. అందుకే ఎన్నిక ర‌స‌వ‌త్త‌రంగా సాగే అవ‌కాశాలున్నాయి.

10 Replies to “ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా బొత్స పేరు ఖ‌రారు”

  1. కూకుని ఆకేసుకొమ్మంటే కుకున్నాను నాకేటి తెల్దు ! డబ్బులు పదవి పోనాయి నానేటి సేత్తాను

  2. ఏజ్ బార్ అయ్యి, రిటైర్మెంట్ కి దగ్గరా వచ్చి, మాట కూడా సరిగా మాట్లాడలేని వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించటం వలన పార్టీకి ఏమీ ఉపయోగం లేదు. ఇది చాలా తప్పుడు నిర్ణయం.

  3. పీసీసీ ప్రెసిడెంట్ to మినిస్టర్ to మ్మెల్సీ .

    జగన్ గాడ్ని నమ్ముకుంటే నెక్స్ట్ డైరెక్ట్ గా వార్డ్ మెంబెర్ అవుతాడు

Comments are closed.