పేదలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకం ఆరోగ్యశ్రీ. కానీ దాన్ని కూడా చాలా ఆసుపత్రులు వరంగా మార్చేసుకున్నాయి. అధికారులు, ఆసుపత్రులు కుమ్మక్కై దోచుకున్న వైనాలు వున్నాయనే విమర్శలు వున్నాయి. పేదలకు ఉపకారం జరుగుతోంది. కానీ ప్రభుత్వం మీద భారీగా భారం పడుతోంది. హెల్త్ కార్డుల సంస్థలు, హాస్పిటల్స్ రెండూ కలిసి ఇప్పటికే వైద్యాన్ని సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేసాయి. ఆరోగ్యశ్రీ వున్న వారికి ఊరట వుంది. కానీ మధ్య తరగతి వారు మాత్రం బలైపోతున్నారు హాస్పిటళ్ల దోపిడీకి. అక్కరలేని టెస్ట్ లతో భారీగా గుంజేస్తున్నారు. వారికంటూ ప్రత్యేకమైన ఎమ్మార్పీలు వేసిన మందులు అమ్మి దోచుకుంటున్నారు. ఇది సాకుగా చూపించి, భారీ మొత్తాలకు వైద్య భీమా చూపించి, భారీగా ప్రీమియం లు లాగేస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో ఆంధ్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ని భీమా కంపెనీలకు అప్ప చెప్పాలనే యోచన చేస్తోంది. వైద్య మంత్రి సత్యకుమార్ నే ఈ విషయం వెల్లడించారు. భీమా కంపెనీలతో సమావేశం నిర్వహించామన్నారు. సింపుల్ గా చెప్పాలంటే ప్రభుత్వమే భీమా పాలసీకొని ఆరోగ్యశ్రీ కార్డులు వున్న వారికి అందిస్తుందన్నమాట. దీని వల్ల ఒక్క ఉపయోగం ఏమిటంటే కేవలం ఆంధ్రలో మాత్రమే కాకుండా దేశంలో ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చు.
కానీ భీమా సంస్థల కార్డుల విధి విధానాలు తెలిసిన వారు మాత్రం ఇలా చేయడం వల్ల సామాన్యులు ఇబ్బందులు పాలు కాక తప్పదు అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వున్న ఆరోగ్యశ్రీ పథకానికి లిమిట్ అనేది లేదు. పేషెంట్ కంట్రిబ్యూషన్ అన్నది లేదు. ముందుగా అనుమతి తీసుకోవాల్సిన పనే లేదు.
కానీ భీమా సంస్థల కార్డ్ లు అయితే పేషెంట్ ను హాస్పిటల్ తీసుకువచ్చిన తరువాత ఫుల్ టైమ్ ట్రీట్ మెంట్ స్టార్ట్ కావాలంటే ముందుగా భీమా సంస్థల అనుమతి కావాల్సి వుంటుంది. రెండు లక్షల రూపాయల మేరకు ఆరోగ్యశ్రీ కార్డులు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటి ఆసుపత్రుల రేట్లలో రెండు లక్షలు ఏమీ కాదు. పైగా భీమా సంస్థలు అన్నింటికీ పే చేయవు. కొన్నింటికి పేషెంట్లే ఇవ్వాల్సి వుంటుంది. ఆరోగ్యశ్రీలో అలా కాదు. భీమా సంస్థలు ఫైనల్ బిల్ అప్రూవ్ చేసేటపుడు కనీసం పదిశాతం అయినా పేషెంట్ మీద భారం వేస్తాయి. అప్పుడు ఈ భారం పేదలకు మోయలేనిది అవుతుంది.
ఇలా కాకుండా పూర్తిగా ఆరోగ్యశ్రీ విధి విధానాల్లో భీమా సంస్థల కార్డులు ఇస్తే అది కచ్చితంగా ప్రయోజనకారి అవుతుంది. కానీ అలాంటి కార్డ్ లు ఇప్పటికైతే లేవు. వున్నా వాటి ప్రీమియం భారీగా వుంటుంది. ప్రభుత్వానికి అది మళ్లీ ఆరోగ్యశ్రీని మించిన భారం అవుతుంది. నిజానికి ప్రభుత్వంతో టై అప్ చేసుకునేందుకు భీమా కంపెనీలు పరుగెత్తుకుంటూ వస్తాయి. ఎందుకంటే కోట్ల మంది ఖాతాదారులు ఒకేసారి వస్తారు. సింగిల్ ప్రీమియం కింద పెద్ద మొత్తం ప్రభుత్వం నుంచి అందుతుంది. అంత కన్నా భారీ వ్యాపారం మరోటి వుండదు.
హాస్పిటల్స్ కు కూడా భాగానే వుంటుంది. పేషెంట్ అంటూ వస్తే, ఏదో వంకన, అదీ ఇదీ అని చెప్పి, మినిమమ్ రెండు లక్షలు లాగేయవచ్చు. కానీ సమస్య పేషెంట్ కే. ఎందుకంటే ఆరోగ్యశ్రీ కార్డులు వున్నవారిలో ఎక్కువ శాతం మంది పల్లెల నుంచి వచ్చిన వారే. వారికి ఈ భీమా సంస్థల విధి విధానాలు సరిగ్గా తెలియవు. దాంతో డబ్బులు కట్టేదగ్గర సమస్యలు ఎదురవుతాయి.
అందువల్ల జీరో ఖర్చు వుంటే ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని అదే విధమైన పథకంతో మార్చాలి తప్ప, ఇప్పుడు వున్న మెడికల్ భీమా టైపులో అయితే తేడా వస్తుంది.
మచ్చల మల్లికి, గాలి వాయిద్యానికి ప్రోస్టేట్ ఆపరేషన్ కి 2L చాలు. Already late iddariki
ప్రభుత్వము అధికారికంగా విధి విధానాలు ప్రకటించకుండానే మొదలు పెట్టేసారు ఏడుపులు .. అయ్యా ఆత్రం ఆపుకోండి …
ఆరోగ్యశ్రీ వలన జగన్ రెడ్డి బాగా సంపాదించాడు, పేదలకు , హాస్పిటల్స్ కి అప్పులు మిగిలాయి
ఆరోగ్యశ్రీ అంటూ కావాల్సిన hospital’s తో కుమ్మక్కై30 వేల కోట్లు మెక్కిన “ల0గా Leven చెడ్డి’..
త్వరలో చెడ్డి’ uppi gu’dda dengu తారని బెంగళూరులో కొత్త రంకు మొగుడు DK దగ్గరికి పరార్..
ఆరోగ్యశ్రీ అంటూ hospital’s తో కుమ్మక్కై 3వేల కోట్లు మెక్కిన “ల0గా Leven చె’డ్డి’..గాడు కమిషన్ ఇవ్వని hospital’s కి 1600 కోట్ల బిల్లులు ఎగ్గొట్టాడు
త్వరలో చె’డ్డి uppi gu’dda దే0guతారని బెంగళూరు లో కొత్త ర0కు మొగుడు DK దగ్గరికి పరార్..