ప్ర‌తిప‌క్షంలో ఉన్నా జ‌గ‌న్‌ను క‌ల‌వ‌నీయ‌క‌పోతే ఎట్లా?

ముఖ్య‌మంత్రి స్థానంలో వైఎస్ జ‌గ‌న్ ఉన్న‌ప్పుడు క‌ల‌వ‌నీయ‌లేదని, ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్నా అదే ప‌రిస్థితి ఉంటే…. వైసీపీకి మ‌నుగ‌డ ఎట్లా వుంటుంద‌ని నాయ‌కులు ఆవేద‌న చెందుతున్నారు. అంబేద్క‌ర్ విదేశీ విద్యా ప‌థ‌కానికి సంబంధించి ప్ర‌స్తుత…

ముఖ్య‌మంత్రి స్థానంలో వైఎస్ జ‌గ‌న్ ఉన్న‌ప్పుడు క‌ల‌వ‌నీయ‌లేదని, ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్నా అదే ప‌రిస్థితి ఉంటే…. వైసీపీకి మ‌నుగ‌డ ఎట్లా వుంటుంద‌ని నాయ‌కులు ఆవేద‌న చెందుతున్నారు. అంబేద్క‌ర్ విదేశీ విద్యా ప‌థ‌కానికి సంబంధించి ప్ర‌స్తుత ప్ర‌భుత్వ తీరును జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌లం కావ‌డంపై ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా గోపాల‌పురం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కారుమంచి ర‌మేశ్ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కారుమంచి ర‌మేశ్ ఎమ్మెల్సీ స్థాయి నాయ‌కుడ‌ని స‌మాచారం. సోష‌ల్ మీడియాలో ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ పోస్టులు పెట్టారు. ర‌మేశ్ పోస్టుపై వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు కూడా పాజిటివ్‌గా స్పందించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

“ఒక ఆడ‌పిల్ల పాపం శ్రీ‌కాకుళం నుంచి వెళ్లి జ‌గ‌న్ గారి ఇంటి ద‌గ్గ‌ర రెండు రోజులు వెయిట్ చేసింది. జ‌గ‌న్ వ‌చ్చాక క‌లిపిద్దామ‌ని ప్ర‌య‌త్నించినా మ‌న వ్య‌వ‌స్థ స్పందించ‌లేదు. ఏం చేస్తాం బాధ‌ప‌డ‌డం త‌ప్ప‌”

“అంబేద్క‌ర్ విదేశీ విద్య ప‌థ‌కం గురించి స్థానిక ఎమ్మెల్యేని, లోకేశ్‌ని క‌లిసినా వాళ్లు ఈ ఏడాదికి ఏమీ చేయ‌లేమ‌ని, వ‌చ్చే ఏడాది చేద్దామ‌ని చెప్పార‌ట‌. జ‌గ‌న్ అన్న‌ను క‌లిసి చెబుదామ‌ని వెళ్లింది కానీ, క‌ల‌వ‌లేక‌పోయింది. అధికారంలో ఉన్న‌ప్పుడు క‌ల‌వ‌లేక‌, ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు క‌ల‌వ‌లేక‌పోతే ఎట్లా?”

“ఈ గ్రూప్‌లో ఆ అమ్మాయికి సంబంధించిన వివ‌రాలు పోస్టు చేశా. చూసే వుంటారుగా నీతులు చెప్పే కొంత మంది. సిగ్గు ప‌డ‌దాం ఇలాంటి పార్టీ వ్య‌వ‌స్థ మ‌న‌కు ఉన్నందుకు. ఎన్నిసార్లు చెప్పినా ప‌ట్టించుకోని మ‌న వ్య‌వ‌స్థ‌ను చూసి సిగ్గేస్తోంది”

“ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న వాళ్లు లోకేశ్ కూడా ప‌ని అవ్వ‌దు అన్న దానిని మ‌నం వాడుకోవాలి క‌దా”

“నేను ఓఎస్డీ కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి, కేఎన్నార్‌, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, స‌జ్జ‌ల భార్గ‌వ్‌రెడ్డికి అమ్మాయికి సంబంధించిన వివ‌రాలు వాట్స‌ప్‌లో వివ‌రాలు పంపా. నో రెస్పాన్స్” అని ఒక కార్య‌క‌ర్త ప్ర‌శ్న‌కు స‌మాధానంగా కారుమంచి ర‌మేశ్ రిప్లై ఇవ్వ‌డం విశేషం.

జ‌గ‌న్ చుట్టూ వున్న వాళ్లు ఆయ‌న అధికారాన్ని, ప‌లుకుబ‌డిని సొంత ప్ర‌యోజ‌నాల‌కు వాడుకుంటున్నార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. మ‌రీ ముఖ్యంగా పార్టీకి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఎవ‌రైనా జ‌గ‌న్‌ను క‌ల‌వాల‌ని అనుకుంటే అది సాధ్యం కావ‌డం లేదు. ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ఎన్న‌డో, అస‌లు ఉందో లేదో కూడా తెలియ‌ని ప‌రిస్థితి.

23 Replies to “ప్ర‌తిప‌క్షంలో ఉన్నా జ‌గ‌న్‌ను క‌ల‌వ‌నీయ‌క‌పోతే ఎట్లా?”

  1. జగన్ మీద టైం పెట్టడం వేస్ట్. రెడ్డి కులంకు_నాయకుడు కావాలంటే, జగన్ ను పక్కన_పెట్టేసి ఇంకో రెడ్డిను_వెతుక్కోవటం బెటర్. జగన్ కన్నా చాలా బెస్ట్ వున్నారు_రెడ్లలో. ఇలా చేస్తే రెడ్ల_కులంకు పనికొస్తాడు, రాష్ట్రానికి_పనికి వొస్తాడు.ఆవేశం పనికి రాదు, ఆలోచన ఉండాలి.

    1. ఈయన పెద్దయనకి వారసుడు అని చెప్పుకోవడమే కానీ ఒక్క లక్షణము లేదు సర్ .. షర్మిల గారు నయం .. ఆవిడ మాట్లాడితే పాయింట్ కరెక్ట్ గ అర్ధం అవుతుంది .. మంది పితృస్వామ్యాయం కాదా అందుకు నడిచి పోతోంది ..

    1. ఫుల్ టైం ఆంటీగా మారడానికి బెంగళూర్ కి వెళ్ళి, తనకు పనికిరానిది కింద వేళ్ళాడుతుంటే తీయించుకుంది. దాని వల్ల మెడికల్ rest లో ఉంది. ఇలా అని ga తో పాటు

  2. పేనుకు పెత్తనం ఇస్తే జుత్తూ అంతా గొరిగినట్టు, AP ని గొరిగారు, ఇచ్చిన పెత్తనం చాలు అని “కారు”మంచి కి చెప్పండి.

  3. అన్నియ్య సీఎం గా ఉన్న కాలంలో, అలాంటి పథకం కింద విదేశాలకు వెళ్ళిన ఒక్కరి పేరు చెప్పరా ga!

  4. అబ్బే, ఇందులో కొత్తేమి ఉంది, అందరికీ తెలిసిన విషయమే.. కాకపోతే ఇలాగైనా అన్నయ్య స్పందిస్తాడేమో అని చేసిన ప్రయత్నం కావచ్చు. కారుమంచి గారి అజ్ఞానం కానీ, ఏదైనా విషయం అన్నయ్యపార్టీ కి ఉపయోగపడాలంటే ఒకటి అది “శవం” గురించి అయిఉండాలి, లేకపోతే తనకి వచ్చే “సూటుకేసుల” గురించి అయినా అయిఉండాలి. ఎవరికో రావాల్సిన పథకాల గురించి అన్నయ్య పార్టీ కి ఏమి ఉపయోగం? ఆ!!!

  5. ఇంకా అధికారంలో ఉన్నాము అని బ్రహ్మలో ఉంటె .. అన్నకి ఓట్లు పడ్డాయి అంట వాటిని దోగిలించారు అంట .. పాములు పంపించి ..

  6. వైసీపీ‌ అయినా జగన్ అయినా రాజన్న పేరు వాడుకోవడానికి తప్ప ఆయన విధానాలు ఏ ఒక్కటీ పాటించడం లేదు. ప్రజల సమస్యలపై ఆయనకున్న అవగాహన ఒక్క శాతం కూడా లేదు. ఆయన అధికారం లో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా ప్రజలతో మమేకమైన విధానం జగన్ కు లేదు, రాదు కూడా.

    అలాగే సలహా దారులను ఎంపిక చేసుకోవడం కూడా.

    ఆయన తో పాటు రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తిని, అలాగే ఆయన భావజాలాన్ని బలపరిచే వ్యక్తిని,ప్రజలతో మరియు కార్యకర్తలతో నిరంతరం కలిసి ఉండే వ్యక్తిని, మరీ ముఖ్యంగా రాజన్నకు అందరికీ మధ్య

    ( పార్టీ అధిష్టానానికి,ముఖ్య నాయకులకు,కార్యకర్తల కి,

    ప్రజలకు )సమన్వయం చేసుకుంటూ ఉండే కేవీపీ రామచంద్రరావు లాంటి వారిని ఎన్నిక చేసుకోవాలి.

    అంతే కానీ తన దగ్గర మీడియాలో పనిచేసే వ్యక్తి ని ఎన్నుకోవడం లోనే తను ఏ తరహా రాజకీయ నాయకుడో తెలుస్తోంది. అతని స్వార్థం కోసం ఒక కూటమి ఏర్పాటు చేసుకుని ఎవ్వరినీ దరి చేరకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఆ విషయం జగన్ తెలుసుకుంటే అధికారం లోకి వస్తాడు లేదంటే జనానికి దూరం అవుతాడు. ఇందులో ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకోవలసిన పనేమీ లేదు. జనాన్ని , కార్యకర్తల్ని , నాయకుల్ని దూరం పెడితే వాళ్లు కూడా అదే పని చేస్తారు. ఇప్పుడు అయిన అనుభవాన్ని గమనం లోకి తీసుకుని పద్ధతి మార్చుకుంటే రాజకీయాలలో కొనసాగుతారు.లేదంటే సొంత పనులకు పరిమితం అవుతాడు.

  7. గ్రేట్ ఆంధ్రా ఇప్పుడేమంటావ్, ఇప్పటికైనా జగన్ genuine పొలిటికల్ లీడర్ కాదని ఒప్పుకుంటావా.

Comments are closed.