ఐకానిక్ భవనాల విషయంలో ఆచితూచి సాగాలి!

ఆకాశ హర్యానాల వంటి సచివాలయ భవనం ఇప్పుడు ఈ శిథిలస్థితిలో ఉన్న పునాదుల మీద కొనసాగితే ఎలా ఉంటుంది?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఒక్కటి మాత్రమే రాజధానిగా ఉండాలని అప్పట్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కలగన్నారు. అమరావతితో పాటు మరో రెండు రాజధానులు కూడా ఉండి అన్ని ప్రాంతాల అభివృద్ధి కూడా జరగాలని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. ఈ రెండు విరుద్ధమైన ఆలోచనల మధ్య అమరావతిలో సగంలో ఉన్న నిర్మాణాలు ఇబ్బంది పడ్డాయి.

ప్రత్యేకించి సెక్రటేరియేట్, హైకోర్టు ఇలా అమరావతి రాజధాని లో ఐకానిక్ భవనాలుగా చంద్రబాబు నిర్మించదలచుకున్న వాటి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అప్పట్లో పునాదుల దశ దాటి కొంత ముందుకు సాగిన ఈ నిర్మాణాలు ఐదేళ్లుగా పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. చంద్రబాబు పరాజయంతోనే ఇక్కడ పనులు స్తంభించిపోగా, ఆ నిర్మాణాల పునాదులు అన్నీ కూడా నీటి మడుగుల్లో ఐదేళ్లపాటు నానుతూ వచ్చాయి.

ఇప్పుడు అక్కడ తిరిగి పనులు కొనసాగించవచ్చునా పటిష్టత విషయంలో ఇబ్బంది ఎదురవదా? ఆకాశ హర్యానాల వంటి సచివాలయ భవనం ఇప్పుడు ఈ శిథిలస్థితిలో ఉన్న పునాదుల మీద కొనసాగితే ఎలా ఉంటుంది? అనే విషయంలో నిపుణుల పరిశీలనలు రకరకాలుగా ఉన్నాయి.

ఈ నిర్మాణాలను పరిశీలించిన హైదరాబాదు ఐఐటీ నిపుణుల బృందం కచ్చితంగా ఏ సంగతి తేల్చి చెప్పలేకపోయింది. ముందు ఆ నిర్మాణాల వద్ద ఇనుప అప్పటి చువ్వలు తొలగించి తుప్పును మొత్తం శుభ్రం చేయాలని, ఆ తర్వాత గాని కట్టడాల పటిష్టత భద్రత విషయంలో నిర్ణయం కూడా చెప్పలేము అని నిపుణులు అంటున్నారు. అలాగే వీటి పరిస్థితిని పరిశీలించడానికి మద్రాసు నుంచి కూడా ఐఐటి నిపుణుల బృందం రావాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో ఐకానిక్ భవనాలుగా 100 అంతస్తులు మించిన హర్మ్యాలను నిర్మించాలని అనుకున్నప్పుడు ఇలాంటి సందేహాస్పదమైన పునాదుల మీద ముందుకు వెళ్లడం మంచిది కాదనే అభిప్రాయం ప్రజలలో వ్యక్తం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగానే అదనపు భారం పడుతున్నదని చంద్రబాబు సర్కారు ఆరోపిస్తూనే ఉంది. ఆ నిందలను భరించడం జగన్ కు ఎటూ తప్పదు. ఈ పునాదుల మీద భవిష్యత్తులో ప్రమాదం జరిగే అవకాశం లేని పరిమితమైన స్థాయి వరకు మార్చిన డిజైన్లతో వేరే ఐకానిక్ భవనాలను నిర్మించి, చంద్రబాబు నాయుడు కలగన్నట్టుగా వందంతస్తుల భవనాలను మరొక ప్రాంతంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

నిపుణుల సూచనలు కూడా ఇలాంటి ప్రతిపాదనలకు దగ్గరగా ఉండవచ్చునని అంటున్నారు. చంద్రబాబు నాయుడు సర్కారు తాము అనుకున్నది మాత్రమే జరగాలని మొండి పట్టుదలతో ముందుకు వెళ్లకుండా ఆ భవనాల భద్రతను దృష్టిలో ఉంచుకొని కొద్దిగా మార్పు చేర్పులతో కూడిన డిజైన్లతో ముందుకు వెళితే మంచిదని సర్వత్రా వినిపిస్తోంది.

24 Replies to “ఐకానిక్ భవనాల విషయంలో ఆచితూచి సాగాలి!”

  1. మీరు గువ్వ నోరు మూసుకుంటే చాలు .. ఏది ఎంత బాగా చెయ్యాలో బాబు గారు చేస్తారు

  2. సీబీఎన్ ఆరోపణలు చేస్తే, జగన్ నిందలు భరిస్తున్నాడా? అవునా? ఆ మాత్రం కట్టడాలకు అయినా సొమ్ము నీ సొమ్మా లేక జగన్ గాడి సొమ్మా? అది అంతా ప్రజల సొమ్ము, ముందు అది గుర్తు ఉంచుకుని వ్యాసాలు రాయి.

  3. అక్కడ 8 అంతస్తుల లు కి మించి కట్టటం వేస్ట్..ఎందుకంటే భూమి అక్కడ శరవంతమైనది రాళ్లు రప్పలు లేవు అక్కడ ..కుంగే ప్రమాదం ఉంది
  4. నిజమె! ఉన్నది నాశనం చెయటం లొ జగన్ కి మిoచిన వారు లెరు. పొలవరం లానె అమరవతి.

    ఒకసారి ఫౌండషన్ పూర్తి చేసారు, అయితె నిర్మానాలు పూర్తిగా అప్పెసి, కనీసం వర్షం నీటిని కూడా తొలగించకుండా నానబెట్టిన ఘనత మన జగన్ ది.

    1. పాడు అయిపొయాయి.. మళ్ళి ఫౌండషన్ వెయలి అంటె… ఈ ఖర్చులన్ని సంబందిత అదికారులు, నాయకుల దగ్గర వసూలు చెయాలి.

  5. అమరవతిలొ హ్యప్పీ నెస్ట్ ప్రాజెక్ట్ ప్రకటించి, బూకింగ్ ఒపెన్ చెయగానె మొదటి రొజె అన్ని అపార్మెంట్లు బూక్ అయ్యయి. జగన్ వచ్చాక ఆపి రెవెర్సె టెండెరింగ్ వెశాడు. అయితె ఎ ఒక్క కాంట్రక్టర్ ఈసారి రాలెదు. ప్రాజెక్ట్ ఆగిపొయింది. అలా ఉంటుంది మన జగన్ పనితనం.

  6. ఐకానిక్ భవనాలలొ అక్కడ 100 అంతస్తుల భవనాలు ఎమి లెవురా సన్నాస!

    ఫౌండెషన్ వెసింది అస్సెంబ్లీ, సెక్రటెట్, హై కొర్ట్ లకి. ఇప్పుడు అవి చెడిపొయాయి అంటె.. ఎక్కడ జగన్ కి చుట్టుకుంటుందొ అని వీడు ముందె 100 అంతస్తులు అని సొల్లు చెప్పటం మొదలు పెట్టాడు.

  7. look at this article…”జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగానే అదనపు భారం పడుతున్నదని చంద్రబాబు సర్కారు ఆరోపిస్తూనే ఉంది. ఆ నిందలను భరించడం జగన్ కు ఎటూ తప్పదు.

    lol…an example shameless souls

  8. latest న్యూస్ ఏంటి అంటే, devide and rule policy కింద జగన్ and బ్యాచ్ ప్రత్యేక రాయలసీమ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తారంట!! they think that’s the only way forward to come back in power in Rayalaseema state after bifurcation!! 25 – 30 years పట్టిన కూడా అదొక్కటే మార్గం అని వాళ్ళ డిసైడ్ అయిపోయారు అని సమాచారం!!

  9. నీటిలో మునిగిపోయే ఏరియా లో రాజధాని ఏటిరా. ఆంధ్ర మంచి ఏరియా నా లేదా?

  10. భం భం భ్రమరావతి బురద రొచ్చు చూసి ఐఐటి హైదరాబాద్ వారు పారిపోయారు…..వాళ్ళకి అనుభవం లేదు… సీనియర్లు దిగుతున్నారు….ఆగండెహా….వచ్చారు మద్రాసు ఐఐటి వారు….వారు ఆ విశాల సరస్సు చూసి సార్ ఇదేనా కొల్లేరు లేక్ అంటే,మూర్చపోయిన చంబల్ నక్క 🦊,తేరుకున్నాక లేదు….ఇక్కడే నేను పెపంచకం బిత్తర పోయే రాజధాని కడుతున్నా….అంతే సీనియర్ మద్రాసు ఐఐటి ముండా వారు మూర్చ పోయారు.😝🤣🤣🤣

  11. ఐఐటి హైదరాబాద్ వారు పారిపోయారు, ఐఐటి మద్రాసు వారు మూర్చ పోయారు..మళ్ళా సింగపూర్ ఈశ్వరన్ బోకు కంపెనీ రావలసిందే ….ఈ బోకు చంబల్ నక్క కి 🤣

    1. కడుతున్న దానిని ఆపేసి ..గ్రాఫిక్స్ భ్రమరావతి అని ఎదవ ప్రచారం చేసింది మనమే కదా .. నువ్వు ఎంత గింజుకున్నా మెజారిటీ ప్రజలు అమరావతి కి వోట్ ఏసారు .. ఏడుస్తూ కూర్చోండి ఇలా ..

Comments are closed.