దళపతి బతిమిలాడినప్పుడే నాయకులు అసలు ఖాతరు చేయలేదు. అలాంటిది పుత్రుడు బతిమిలాడినంత మాత్రాన ఫలితం ఉంటుందా? అనే అభిప్రాయం ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో కలుగుతోంది. కాంగ్రెస్ లోకి ఫిరాయించిన గులాబీ ఎమ్మెల్యేలను, కేటీఆర్ మళ్ళీ పిలిపించి బుజ్జగించి, బతిమాలి.. వారు పార్టీలోనే కొనసాగుతున్నారని ప్రకటించిన తర్వాత కూడా పెద్దగా ఫలితం ఉండడం లేదు. కేటీఆర్ సమక్షం నుంచి బయటకు వెళ్ళగానే వారు తిరిగి కాంగ్రెస్ గూటికే చేరుతున్నారు.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఫైనల్ గా తాను కాంగ్రెస్ లోనే ఉన్నట్టు ధ్రువీకరించారు. ఆయన విషయంలో చిన్న హైడ్రామా నడిచింది. బండ్ల తొలుత సిఎం రేవంత్ ను కలిసి కాంగ్రెస్ లో చేరారు. తర్వాత కేటీఆర్ పిలిపించి బుజ్జగించారు. బండ్ల భారాసలోనే కొనసాగుతున్నట్లు కేటీఆర్ ప్రకటించారు కూడా. రెండు రోజులు గడిచాయో లేదో సీన్ మళ్ళీ మారిపోయింది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.. మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులతో కలిసి రేవంత్ తో భేటీ కావడం విశేషం. దీంతో గులాబీ దళానికి మరింత పరువు నష్టం వాటిల్లినట్టు అయింది.
ఇలాంటి పరాభవం గులాబీ దళపతి కేసీఆర్ కు ఎన్నికలకు ముందే ఎదురైంది. హనుమకొండ నాయకుడిని దాదాపు కిడ్నాప్ చేసినంత పని చేసి పిలిపించుకుని కేసీఆర్ బుజ్జగించారు. ఎంపీ టికెట్ ఇస్తానంటే వద్దని, పార్టీలోనే ఉంటానని ఆయన అన్నారు. తీరా ఇంటికి వెళ్ళగానే ఫిరాయించి కమలదళంలో చేరారు. కడియం కావ్య పరిస్థితి కూడా అంతే! ఆమెకు భారాస టికెట్ ప్రకటించిన తర్వాత కూడా ఆమె ఫిరాయించి కాంగ్రెస్లో చేరి మళ్ళీ అక్కడ టికెట్ దక్కించుకొని ఎన్నికల్లో నెగ్గారు. ఆ రకంగా గులాబీ దళం ప్రాభవం ఏ స్థాయిలో తగ్గిపోతున్నదంటే కేసీఆర్ మాటకు కూడా విలువ లేకుండా పోతోందని ఎన్నికలకు ముందుగానే నిరూపణ అయింది.
మరి ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకున్న తర్వాత ఇంకా ఖాతరు చేసే వాళ్ళు ఎవరుంటారు? పైగా కేసీఆర్ మాటకే దిక్కులేనప్పుడు కేటీఆర్ పిలిపించి బుజ్జగిస్తే వినేవారు ఉంటారా? దానికి నిదర్శనంగానే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారం నిలుస్తోంది. ఆయనను కేటీఆర్ బుజ్జగించినా ఫలితం దక్కలేదు. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.
ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గులాబీ దళం నుంచి కాంగ్రెసులో చేరే వారు ఇంకా పలువురు ఉన్నారని పుకార్లు వినిపిస్తున్నాయి.
ముక్కు దొర, ప్యాలస్ పులకేశి ఇద్దరు కలిసి తామేదో చక్రవర్తులు అన్నట్లు బిల్డప్ ఇచ్చారు.
జనాలు వాళ్ళ * లో పెద్ద రాడ్ దించారు.