పబ్లిసిటీ మెనూలో పిఠాపురం

సినిమా పబ్లిసిటీకి ఓ మెనూ వుంటుంది. ఇంకా క్లారిటీ గా చెప్పుకోవాలంటే మెనూలు రెండు మూడు రకాలుగా వుంటాయి. కాలేజీలు తిరగడం, థియేటర్లు తిరగడం, పలు చోట్ల ఈవెంట్లు నిర్వహించడం ఇలా వుంటుంది. Advertisement…

సినిమా పబ్లిసిటీకి ఓ మెనూ వుంటుంది. ఇంకా క్లారిటీ గా చెప్పుకోవాలంటే మెనూలు రెండు మూడు రకాలుగా వుంటాయి. కాలేజీలు తిరగడం, థియేటర్లు తిరగడం, పలు చోట్ల ఈవెంట్లు నిర్వహించడం ఇలా వుంటుంది.

టాలీవుడ్ మెనూలో వున్న ఊర్లలో కర్నూలు, వరంగల్, ఖమ్మం, బెజ‌వాడ, ఏలూరు, రాజ‌మండ్రి, కాకినాడ, విశాఖ ఇలా కొన్ని ఊళ్లు మాత్రమే వున్నాయి. ఇప్పుడు ఈ జాబితాకు కొత్త ఊరు యాడ్ అయింది. అదేమీ జిల్లా కేంద్రం కాదు. పెద్ద పట్టణం కాదు. ఓ పుణ్యక్షేత్రం. ఇప్పుడు రాజ‌కీయ క్షేత్రం. అదే తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం.

సినిమా జ‌నాలు ఇప్పుడు కేరాఫ్ పిఠాపురం అంటున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ టచ్ వున్న వాళ్లు తమ సినిమాల ప్రచారం కోసం ఛలో పిఠాపురం అంటున్నారు. ఎలాగూ పుణ్యక్షేత్రం. శ్రీపాద వల్లభులు వున్నారు. అమ్మవారి శక్తిపీఠం వుంది. వీటికి తోడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజ‌క వర్గం కూడా. నాగబాబు కుమార్తె నీహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లు సినిమా ప్రచారానికి ఛలో పిఠాపురం అన్నారు. గీతా అరవింద్- బన్నీ వాస్ నిర్మిస్తున్న ‘ఆయ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నే ఏకంగా పిఠాపురంలో ఏర్పాటు చేస్తున్నారు.

ఇక ఇది ఆనవాయితీగా మారుతుంది. చాలా మంది ఇకపై పిఠాపురంలో ప్రచారం అన్నది తమ పబ్లిసిటీ మెనూలో చేర్చడం ఖాయంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ తన ఎన్నికల టైమ్ లో ఇలాంటి మాటే అన్నారు. తాను గెలిస్తే రాష్ట్రం మొత్తాన్ని పిఠాపురం వైపు చూసేలా చేస్తాను అని. దానికి ఇది మొదలు అనుకోవాలి.

12 Replies to “పబ్లిసిటీ మెనూలో పిఠాపురం”

    1. పులివెందుల పేరు చెప్పుకొని బ్రతికిన సినిమా లు చాలా ఉన్నాయి బాలయ్య సినిమాల తో సహా..

Comments are closed.