విశాఖ కార్పోరేషన్ కి చెందిన కార్పోరేటర్ల పంట పడుతోంది. వారి అవసరం రాజకీయ పార్టీలకు ఏర్పడింది. ఈ నెల 7న జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఉన్నాయి. మొత్తం స్టాండింగ్ కమిటీ పది పదవులూ గెలుచుకోవాలంటే యాభై మంది కార్పోరేటర్ల మద్దతు అవసరం.
వైసీపీకి టెక్నికల్ గా 60 మంది కార్పోరేటర్లు ఉన్నా వారిలో చాలా మంది కూటని వైపు జారిపోయారు. నిజంగా 48 మంది కార్పోరేటర్లు వైసీపీకి మిగిలారు అని భావించినా అందులో కూడా ఎనిమిది మంది ఎటూ మొగ్గకుండా ఉన్నారు. ఇపుడు వారితోనే అసలైన పని పడింది అని అంటున్నారు.
వైసీపీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పదవిని సాధిస్తేనే జీవీఎంసీలో వైసీపీ నిలిచి గెలిచినట్లు అని అంటున్నారు. ఇది కోల్పోతే రాజకీయంగా గుండె కాయను పోగొట్టుకున్నట్లే అని అంటున్నారు. దాంతో మ్యాజిక్ ఫిగర్ అయిన యాభై మంది కార్పోరేటర్ల మద్దతు కోసం వైసీపీ తన ప్రయత్నాలను తాను మొదలెట్టింది.
తమ వారే కార్పోరేటర్లు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వారి మనసు మార్చే పనిలో పడింది. టీడీపీ కూటమి వైపు నుంచి కూడా కార్పోరేటర్లను తిప్పుకోవడానికి చూస్తున్నారు. దీంతో ప్రలోభాల పర్వానికి తెర లేచింది. ఒక్కో కార్పోరేటర్ కి రెండు లక్షల వంతున కూడా ఇచ్చేందుకు పార్టీలు సిద్ధంగా ఉన్నారని రాజకీయ గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి.
అలా కార్పోరేటర్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఈ నెల 7న ఎన్నికలు జరిగే లోగా ఎన్నో ఊహించని సంఘటనలు సైతం చోటు చేసుకుంటాయని అంటున్నారు. ఈ ఎన్నికలు అయిపోయాక కూడా కార్పోరేటర్లకు డిమాండ్ ఉంటుందని అంటున్నారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవికి పోటీ జరిగితే అపుడు కూడా కార్పోరేటర్లని తమ వైపు తిప్పుకోవడానికి మరోసారి ప్రలోభాల పర్వానికి పార్టీలు తెర తీయడం ఖాయమని అంటున్నారు. ఇవన్నీ చూస్తున్న వారు ఆగస్టు నెలలో జీవీఎంసీలో కార్పోరేటర్ల జాతకమే మారిపోయింది అని అంటున్నారు.
రెండు మూడు లక్షలకే పంట పండి పోతుందా??
Call boy jobs available 8341510897
ఈ జంప్ జిలాని గాళ్లని ఉంచుకుని కొత్త పదవులు ఎలా నెగ్గ గలరు..