ప్రస్తుతం తేదేపాలో ఉండి మంచి పదవి కోసం వేచి చూస్తున్న రఘురామ కృష్ణం రాజు మూలాలు కాంగ్రెస్ లోనే వున్నాయి. రాజుగారి దగ్గరి బంధువులు కూడా కాంగ్రెస్ లో కీలకంగా వున్నారు. కానీ రాజుగారే కాంగ్రెస్ నుంచి వైకాపా మీదుగా తేదేపాలోకి వచ్చారు.
సదరు రాజుగారికి నేస్తం అనాలో, అన్ని విధాలుగా పక్కన వుండే వ్యక్తి అనాలో, పక్కన వుండి పనులు చక్కబెట్టడంలో సాయం చేసే మనిషి అనాలో, మొత్తానికి అలాంటి వ్యక్తి అయిన నూతన్ నాయుడు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు ఎందుకు రాజకీయ తీర్ధం, అది కూడా అధికారంలో లేని, ఏపీలో అధికారంలోకి రావడం కష్టం అని తెలిసిన కాంగ్రెస్ లో ఎందుకు చేరారో నూతన్ నాయుడుకే తెలియాలి.
నిజానికి అధికారికంగా పార్టీలో లేకపోయినా, విశాఖలో వున్నప్పటి నుంచి కాంగ్రెస్ తో అనుసంధానంగానే వుంటూ వచ్చారు. ముఖ్యంగా సబ్బం హరికి మిత్రుడిగా వున్నప్పటి నుంచి. పార్టీల్లో చేరకుండానే పార్టీల జనాలతో కలిసి తిరగడం హాబీగానో, అలవాటుగానో చేసుకుంటూ సాగుతూ వస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు అన్నది సందేహం.
జనసేనలో చేరితో ఉపయోగం వుండేది. తేదేపాలో చేరితే ఏదో ఒక పదవి అందేది. మరి కాంగ్రెస్ లో చేరి ఏం చేయాలనుకుంటున్నారు? కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు పార్టీ నిర్వహణలో సాయంగా వుండేందుకు ఓ సరైన మనిషి కావాలని నూతన్ నాయుడిని ఎవరైనా అటు పంపారా? ఏమో.. అనుమానమే. లేదా, రాజకీయంగా తను కూడా ఎదగాలి అంటే చిన్నగా వున్న పార్టీలో చిన్నగా స్టార్ట్ చేయాలని పెద్ద ప్రణాళిక ఏమైనా వేసుకుని నూతన్ నాయుడు అక్కడ చేరారా?
ఏదైనా, ఎలా చేరినా, ఎందుకు చేరినా, రఘురామకృష్ణం రాజుకు తెలియకుండా అయితే జరగదు. అది ఫిక్స్. ఈ ఎలా.. ఎందుకు.. అన్నది కొన్నాళ్లకు తెలుస్తుంది.
Call boy jobs available 8341510897
Call boy works 8341510897
అన్న గారి షెల్లీ ..కాంగ్రెస్ లో ..