టీడీపీకి అంత వీజీ కాదా?

ఎటు నుంచి ఎటు చూసినా టీడీపీకి ఈ ఎమ్మెల్సీ ఎన్నిక అంత ఈజీ అయితే కాదనే అంటున్నారు.

ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నిక అధికార కూటమికి విపక్షంలోకి కొత్తగా వచ్చిన వైసీపీకి కూడా అత్యంత కీలకం అని చెప్పక తప్పదు. ఎవరు గెలిచినా సార్వత్రిక విజయం తరువాత రాజకీయం ఏమిటి అన్నది ఎంతో కొంత వెల్లడి అవుతుంది.

విశాఖ ఎమ్మెల్సీ సీటుకు వైసీపీ అధినాయకత్వం సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పేరుని ప్రకటించింది. ఇది వ్యూహాత్మకమే అని అంటున్నారు. క్యాంప్ పాలిటిక్స్ కి తెర తీసే ఈ ఎన్నికల్లో సామ దాన భేద దండోపాయాలు అన్నీ వాడాల్సిందే. ఆ విషయంలో బొత్సను మించిన వారు లేరు అని అంటున్నారు.

దాంతో బొత్సని జగన్ అన్నీ ఆలోచించిన మీదటనే ఎంపిక చేశారు అని అంటున్నారు. మొత్తం ఓట్లలో వైసీపీకి అపరిమితమైన బలము ఉంది. టీడీపీ కూటమికి వైసీపీకి మధ్య ఓట్ల తేడా నాలుగు వందల పై దాటి ఉంది. దాంతో అతి తక్కువ సమయంలో ఫిరాయింపులను ప్రోత్సహించి తమ వైపు తిప్పుకోవడం కూటమి వల్ల కాదనే అంటున్నారు.

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేసే వారు కావాలి. సీనియర్లకు మంత్రి పదవులు లేవు. దాంతో మంత్రిగా అవకాశం దక్కిన వంగలపూడి అనిత మీదనే ఈ భారం అంతా పడుతోంది. అభ్యర్థుల ఎంపిక విషయం కూడా కత్తి మీద సాము గానే ఉంటుంది అని అంటున్నారు.

వైసీపీ నుంచి టీడీపీలోకి దూకిన నేతలతో పాటు సీనియర్ మోస్ట్ నాయకుల దాకా అందరూ తమకు ఈ పదవి కావాలని కోరుతున్నారు. కూటమి పార్టీలు కూడా అడుగుతున్నాయి. దాంతో అభ్యర్థి ఎంపిక దగ్గరే ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. ఇలా అన్నీ రకాలుగా చూసుకున్నా ఈ పదవికి పోటీ చేసి గెలిస్తే ఓకే. కానీ ఒకవేళ ఏమైనా జరిగి ఫలితం వ్యతిరేకంగా వస్తే మాత్రం వైసీపీ గెలుపు ఉత్సాహాన్ని ఆపలేమన్న ఆలోచన కూడా కూటమిలో ఉంది అని అంటున్నారు

తామే కోరి విశాఖలో వైసీపీని లేపినట్లు అవుతుందని అంటున్నారు. దాంతో అన్నీ ఆలోచించిన మీదటనే టీడీపీ వ్యూహం ఖరారు అవుతుందని అంటున్నారు. ఎటు నుంచి ఎటు చూసినా టీడీపీకి ఈ ఎమ్మెల్సీ ఎన్నిక అంత ఈజీ అయితే కాదనే అంటున్నారు. బొత్సకు ఇది చాలా కలసి వచ్చిన అదృష్టంగా చెబుతున్నారు. గెలిస్తే కనుక సీనియర్ లీడర్ గా ఆయన మరో మూడున్నరేళ్ళ పాటు పెద్దల సభలో తన హవా చాటుకునేందుకు వీలు కలుగుతుందని అంటున్నారు.

17 Replies to “టీడీపీకి అంత వీజీ కాదా?”

  1. స్థానిక సంస్థలు విశాఖ లోనివి ఐతే ….విజయనగరం సత్తిబాబు ఎలా నిలపడతాడు అని కోలా గురువులు బుడి ముత్యాల నాయుడు లాంటోళ్ళు అంత మండిపడుతున్నారు …..ఓట్లు మావి పదవి ఆయన కి అని వాళ్లే దగ్గర బోర్డు తిప్పేస్తున్నారు అంట

  2. Ysrcp కి వెన్నుపోటుగాళ్ళేక్కువయ్యారు..ఇక అదిగో పులి అంటే ఇదిగో తోక అంటూ ysrcp కార్పొరేటర్లు కూటం లోకింజంప్ చేస్తున్నారు అంటూ నిరోధ్ ఫైల్ అయి పుట్టినోళ్ళ రాతలు ఎక్కువైనాయి..కాస్త జాగ్రత్త లేకపోతే బొత్స కష్టమే..

  3. Ysrcp కి వెన్నుపోటుగాళ్ళేక్కువయ్యారు..ఇక అదిగో పులి అంటే ఇదిగో తోక అంటూ ysrcp కార్పొరేటర్లు కూటం లోకింజంప్ చేస్తున్నారు అంటూ మందికి పుట్టినోళ్ళ రాతలు ఎక్కువైనాయి..కాస్త జాగ్రత్త లేకపోతే బొత్స కష్టమే..

  4. Ysrcp కి వెన్నుపోటుగాళ్ళేక్కువయ్యారు….కాస్త జాగ్రత్త లేకపోతే బొత్స కష్టమే..

  5. అంధారిలాగా నామినేషన్ వేసి మర్యాదగా ప్రజా అభిప్రాయం కోసం వేచి చేయడం తప్పితే – సమ దాన భేద దండోపాయాలు చేస్తానంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని సతీ బాబు గారికి తెలుసు – ఆయన మీద ఇంకా దృష్టి పెట్టలేదు – పెద్దల సభలో లోకేశ్ గారి మీద చేయాలపినా వ్యక్తి – మరచి పోలేదు – గుర్తు ఉన్నది ప్రజలకు.

    నిజాయితీగా పనిచేసేవారికి ఎల్లప్పుడూ విజయం కలుగుతుంది.

Comments are closed.