సర్కారువారిపాట – రేట్లు కావలెను

తెలంగాణ, ఆంధ్రలో సినిమాలకు కలిసి వచ్చిన అంశం రేట్లు. తెలంగాణలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రతి సినిమాకు రేట్లు తెచ్చుకోగలుగుతున్నారు. కేజిఎఫ్ 2 లాంటి డబ్బింగ్ సినిమాకు కూడా రేట్లు తెచ్చుకున్నారు.  Advertisement…

తెలంగాణ, ఆంధ్రలో సినిమాలకు కలిసి వచ్చిన అంశం రేట్లు. తెలంగాణలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రతి సినిమాకు రేట్లు తెచ్చుకోగలుగుతున్నారు. కేజిఎఫ్ 2 లాంటి డబ్బింగ్ సినిమాకు కూడా రేట్లు తెచ్చుకున్నారు. 

ఆంధ్రలో మాత్రం నార్మల్ రేట్లకే విడుదల చేసారు. ఆంధ్రలో 20శాతం షూటింగ్ అన్న నిబంధన వుంది కానీ, అలా చేయకపోయినా, స్పెషల్ కేస్ ల కింద రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ లకు ఇచ్చారు. 

ఇప్పుడు ఇదే దారిలో వెళ్లాలని చూస్తోంది సర్కారువారి పాట. మహేష్-కీర్తి సురేష్ కాంబినేషన్ లో పరుశురామ్ రూపొందిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాను ఆంధ్ర ఏరియాకు 50 కోట్ల రేషియోలో మార్కెట్ చేస్తున్నారు. రేట్లు వస్తే బయర్లు త్వరగా సేఫ్ అవుతారు. నిర్మాతకు మాంచి ఓవర్ ఫ్లోస్ వస్తాయి. అందుకే మైత్రీ అధినేతలు ఈ విషయం మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 

ఇంతకు ముందు సినిమా మంత్రిగా పేర్ని నాని వుండేవారు. ఆయనతో మైత్రీ సంస్థకు మాంచి సాన్నిహిత్యం వుండేది. ఇప్పుడు మంత్రి మారారు. అయితే మైత్రీ మూవీస్ కు రాజకీయ పరిచయాలు బాగానే వున్నాయి. అందువల్ల పని జరగదు అన్న అనుమానం అక్కరలేదు. 

ఇదిలా వుంటే రేట్లు మరీ ఎక్కువ ఫిక్స్ అయినా, ఎక్కువ కాలం ఇచ్చినా సినిమాలకు సమస్య అవుతుందని, రీజనబుల్ రేట్లు, కేవలం ఫస్ట్ వీక్ మాత్రమే తీసుకుంటే బాగుంటుందనే కామెంట్లు కూడా వున్నాయి.