“ఎన్టీఆర్-కొరటాల సినిమా రావడం లేదంట. ఎన్టీఆర్ రెండో ఆలోచనలో ఉన్నాడట.” కొన్ని రోజులుగా ఓ సెక్షన్ మీడియాలో షికారు చేస్తున్న ఈ పుకారుకు చెక్ పడింది. స్వయంగా దర్శకుడు కొరటాల శివ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చాడు. ఎన్టీఆర్ తో తను చేయబోయే సినిమా కచ్చితంగా ఉందని, తన తదుపరి చిత్రం అదేనని ప్రకటించాడు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర వివరాల్ని కూడా వెల్లడించాడు.
ఎన్టీఆర్ సినిమా కోసం చాలా పవర్ ఫుల్ స్టోరీ రాసుకున్నాడట కొరటాల. ఏదో ఒక ప్రాంతానికి సంబంధించిన కథగా కాకుండా, పాన్ ఇండియా అప్పీల్ ఉన్న స్టోరీలైన్ ను సెలక్ట్ చేసుకున్నాడట. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోందని, త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తానని తెలిపాడు ఈ దర్శకుడు.
మరోవైపు సినిమా ఈ ఏడాదిలో రాదనే ప్రచారాన్ని కూడా ఖండించాడు కొరటాల. జూన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్తుందని క్లారిటీ ఇచ్చాడు. కొరటాల తాజా ప్రకటనతో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ స్వామి మాలలో ఉన్నాడు. ఇటు కొరటాల కూడా ఆచార్య సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. వచ్చే నెల నుంచి ఎన్టీఆర్-కొరటాల ఫైనల్ సిట్టింగ్స్ లో కూర్చుంటారు. స్క్రిప్ట్ లాక్ చేస్తారు. ఆ వెంటనే మూవీ సెట్స్ పైకి వెళ్తుంది. అనిరుధ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.