గీతా పతాకంపై నాగ్ చైతన్య-చందు మొండేటి కాంబినేషన్ నిర్మించబోయే సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెలలో అనౌన్స్ మెంట్ చేసే ఈ సినిమా కథ కాస్త భారీగా వుంటుందని తెలుస్తోంది. సముద్రం నేపథ్యంలోని ప్రేమకథ ఇది అని తెలుస్తోంది.
గతంలో గుజరాత్ సముద్ర తీరం నేపథ్యంలో ఈ కథ వుంటుందని వార్తలు వచ్చాయి. కానీ దాన్ని శ్రీకాకుళం సముద్రతీరం నేపథ్యంలోకి మారుస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
సినిమాలో చైతన్య ఫిషర్ మెన్ గా కనిపిస్తాడని అంటున్నారు. కేవలం మన సముద్రతీరం లోనే కాకుండా పాకిస్థాన్ తీరంలో కూడా కథ నడుస్తుందని వినిపిస్తోంది. పూర్తిగా లవ్ స్టోరీగా కాకుండా ఓ లవర్ ఎమోషనల్ జర్నీగా వుంటుందంటున్నారు. చూస్తుంటే ప్రేమమ్ తరువాత చందు మొండేటి బలమైన ఓ ప్రేమ కథను తెరపైకి తెస్తున్నట్లు కనిపిస్తోంది. ఉప్పెన, సీతారామ్ మాదిరిగా ఈ సినిమా కూడా వుంటుందేమో?
చందు మొండేటి మొత్తం మూడు సినిమాలు గీతాలో చేయబోతున్నారు. ఇందుకోసం మూడు పదులు ముఫై కోట్ల రెమ్యూనిరేషన్ అందుకోబోతున్నారని టాక్. కార్తికేయ 2 తరువాత చందుకు మాంచి ఆఫర్లు వచ్చాయి. కానీ గీతాలోనే ఏకంగా మూడు సినిమాలకు సైన్ చేసారు.