యాప్ లో మీటింగ్.. వారంలో పెళ్లి

సెలబ్రిటీల పెళ్లిళ్లు ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయి. ముందుగా డేటింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఎంగేజ్ మెంట్, ఆ తర్వాత కొన్ని రోజులకు డెస్టినేషన్ వెడ్డింగ్.. ఇలా అన్నీ లావిష్ గా జరుగుతాయి. కానీ…

సెలబ్రిటీల పెళ్లిళ్లు ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయి. ముందుగా డేటింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఎంగేజ్ మెంట్, ఆ తర్వాత కొన్ని రోజులకు డెస్టినేషన్ వెడ్డింగ్.. ఇలా అన్నీ లావిష్ గా జరుగుతాయి. కానీ అందరు హీరోల విషయంలో అలా జరగదు.

దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రానా. దగ్గుబాటి వారసుడు రానా, కరోనా టైమ్ లో సింపుల్ గా పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇక్కడ మేటర్ అది కాదు. అతడు తన భార్యను ఓ యాప్ లో కలిశాడు, అలా కలిసిన వారంలోనే పెళ్లి చేసుకున్నాడు. అదే విచిత్రం.

“కరోనా టైమ్ లో హౌజ్ పార్టీ అనే యాప్ డౌన్ లోడ్ చేశాను. అందులో చాలామందిని కలవొచ్చు. మనం మరికొంతమందిని యాడ్ చేయొచ్చు. అలా సర్కిల్ పెరుగుతుంది. చాలా కాలం కిందట కలిసిన ఓ వ్యక్తిని, మళ్లీ అందులో చూశాను. ఆ తర్వాత వారం రోజులకే ఆమెను పెళ్లి చేసుకున్నాను.”

యాప్ లో కలిసిన వెంటనే మాటలు కలిపి, ఆ వెంటనే పెళ్లి చేసుకుందామా అని మిహీకాను అడిగాడంట రానా. సడెన్ గా అడగడంతో మిహికా కన్ఫ్యూజ్ అయిందంట. రానా ఆటపట్టిస్తున్నాడని భావించిందంట. ఆ తర్వాత వేరే వ్యక్తుల ద్వారా అన్ని విషయాలు కనుక్కొని ఓకే చెప్పిందట. అలా తన జీవితంలో పెళ్లి అనేది చాలా క్రేజీగా జరిగిందని చెప్పుకొచ్చాడు రానా.

6 Replies to “యాప్ లో మీటింగ్.. వారంలో పెళ్లి”

  1. He is probably endorsing that dating app, that’s why telling these cock and bull stories. Celebrity marriage within one week is not possible, no matter how intimate could that be.

Comments are closed.