కంగువ.. కనుల విందు

కంగువ.. అక్టోబర్ లో వస్తున్న సూర్య సినిమా. శివ దర్శకుడు. ఈ సినిమా ఎప్పటి నుంచో నిర్మాణంలో వుంది. తెలుగులో యువి సంస్థ నిర్మాణ భాగస్వామి. ఈ సినిమా ట్రయిలర్ విడుదలయింది. సినిమా కథేంటీ…

కంగువ.. అక్టోబర్ లో వస్తున్న సూర్య సినిమా. శివ దర్శకుడు. ఈ సినిమా ఎప్పటి నుంచో నిర్మాణంలో వుంది. తెలుగులో యువి సంస్థ నిర్మాణ భాగస్వామి. ఈ సినిమా ట్రయిలర్ విడుదలయింది. సినిమా కథేంటీ అన్నది అంతు పట్టుకుండా వున్నా, చెడు మీద మంచి తిరుగుబాటు అన్నది లైన్ అని తెలుస్తోంది.

అణచివేత, తిరుగుబాటు, యుద్దం ఇవన్నీ కలిసి ట్రయిలర్ ను కట్ చేసారు. విజువల్ గా వండర్ గా వుంది ట్రయిలర్. అయితే మొత్తం క్యారెక్టర్లు అన్నీ రఫ్ గా వున్నాయి. గ్లామర్ కంటెంట్ లేదన్న మాట తప్పిస్తే, ఓ వైవిధ్యమైన సినిమా చూడబోతున్నామన్న ఫీల్ ను అయితే కలిగించింది ట్రయిలర్.

రెండు నిమిషాల 38 సెకెండ్లు కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లినట్లు అనిపించింది. ప్రతి సీన్ ఇంతకు ముందు ఇలా చూడలేదు అనిపించాడు దర్శకుడు శివ. బాహుబలి మాదిరిగా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. చివరి షాట్ లో మొసలితో నీటిలో సూర్య ఫైట్ కూడా ట్రయిలర్ కు మంచి ముగింపు ఇచ్చినట్లు అయింది,

భారీ సిజి వర్క్ లు, మాంచి ఫ్రేమ్ లు కనిపించాయి ట్రయిలర్ లో. పోరాట సన్నివేశాల్లో కొత్త కొత్త ఐడియాలు చేసారు. దేవీశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రవుండ్ తన రెగ్యులర్ గా కాకుండా సినిమా కు తగినట్లు డిఫరెంట్ గా వుంది. సూర్య, బాబీ డియోల్ బలంగా కనిపించారు. మొత్తం మీద ట్రయిలర్ ప్రామిసింగ్ గా వుంది.

9 Replies to “కంగువ.. కనుల విందు”

Comments are closed.