తెలుగుదేశం రాజ్యాంగం వేరు. బాలయ్య ఎప్పుడో చెప్పినట్లు ‘మా బ్లడ్ వేరు..మా బ్రీడ్ వేరు’ అనే టైపు. ఇప్పుడెందుకీ టాపిక్ అనే అనుమానం కలగొచ్చు. కానీ అవసరం వుంది.
హిందూపురం నియోజకవర్గంలో బాలయ్య మీద రాబోయే ఎన్నికల్లో దీపిక అనే కురువ సామాజిక వర్గానికి చెందిన మహిళను పోటీకి దింపబోతోంది వైకాపా అని వార్తలు వచ్చాయి. ఇప్పటికి ఒకటి రెండు సార్లు మైనారిటీలను ట్రయ్ చేసారు కానీ ఫలితం దక్కలేదు. అందుకే వైకాపా బిసి కార్డ్ బయటకు తీసింది. తప్పదు. ఎవరి రాజకీయం వారిది.
కానీ అప్పుడే తెలుగుదేశం అనుకూల మీడియా డ్యూటీ ఎక్కేసింది. సదరు దీపిక బిసి కాదు. ఆమెకు పెళ్లయిపోయింది. తల్లి తండ్రులు బిసి లు కావచ్చు. భర్త మాత్రం రెడ్డి. అందువల్ల ఇప్పుడు దీపిక సామాజిక వర్గం బిసి కాదు, రెడ్డి అంటూ వాదన మొదలుపెట్టింది. సరే, రాసుకోవడానికి ఈ వాదన కరెక్టే అనుకుందాం. కానీ తెలుగుదేశం పార్టీ చేసేది కూడా ఇదే కదా.
అనేక ఎన్నికల్లో, అనేక చోట్ల ‘కమ్మ’ కనెక్షన్ వున్నవారిని ఎందరినో చేరదీసి టికెట్ లు ఇచ్చిందిగా? భార్య లేదా భర్త కమ్మ అయితే రెండో వాళ్లు బిసి అయినా, కాపు అయినా చేరదీసి టికెట్ ఇచ్చిన ఉదాహరణలు వున్నాయి కదా. పైకి కాపులకు, బిసిలకు, మైనారిటీలకు, ఆఖరికి క్షత్రియులకు టికెట్ లు ఇచ్చినట్లు కలర్.. కానీ దాని వెనుక కమ్మ బంధాలు వున్నాయి అన్నది కొంత మందికే తెలిసిన సంగతి కదా.
మరి అప్పుడు ఎందుకు ఈ మీడియా వీళ్లు బిసి కాదు, కాపు కాదు, వెనుక వున్నది ఈ వర్గం అని ఎందుకు రాయలేదు. అంటే మనకు నచ్చకపోతే ఒకలా.. నచ్చితే మరోలా.