ఏపీలో పొత్తుల మీద బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రాలో తమ పార్టీ పొత్తు కేవలం జనసేనతోనే ఉందని చెప్పారు. మరో పార్టీతో ఈ రోజు దాకా పొత్తులు కానీ స్నేహాలు కానీ లేవని తేల్చి చెప్పారు.
ఎన్డీయే సమావేశానికి తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం పంపలేదని ఆయన వివరించారు. టీడీపీకి ఇన్విటేషన్ వచ్చింది అంటూ ఎల్లో మీడియాలో జరుగుతున్న ప్రచారానికి కౌంటర్ గా మాధవ్ ఈ వివరణ ఇచ్చారని అంటున్నారు.
ఎన్డీయేలో పాత మిత్రులకే ఆహ్వానం ఉందని వారే హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. కూటమిలో ప్రస్తుతం ఉన్న పార్టీలతోనే చర్చలు అని కూడా మాధవ్ చెప్పడం విశేషం. ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో అధినాయకత్వానిదే తుది నిర్ణయం అని ఆయన స్పష్టం చేసారు.
ఇవన్నీ చూస్తూంటే ఎన్డీయే మీటింగ్ కి తెలుగుదేశానికి ఎలాంటి ఆహ్వానం రాలేదని స్పష్టం అవుతోంది ఇదంతా ఒక సెక్షన్ మీడియా ఆంధ్రాలో చేస్తున్న ప్రచారం అని బీజేపీ నేతలు అంటున్నారు. తెలుగుదేశంతో పొత్తు విషయం హై కమాండ్ దే అని అంటున్నారు. బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకుంటాయా అన్నది ఇప్పటికీ సస్పెన్స్ గా ఉంది. మాధవ్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే జనసేనతోనే కలసి వెళ్లాలని బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది.