కేసీఆర్ మౌనం నిరాశా? వ్యూహమా? 

కేసీఆర్ ఇప్పుడు మౌనంగా ఉన్నాడు. ఎన్నికల్లో ఓడిపోయిన తొలి రోజుల్లో కాస్త హడావిడి చేసినా ఇప్పుడు సద్దుమణిగాడు. “అన్న నిలుచుంటే మాస్.. అన్న కూచుంటే మాస్” అన్నట్లుగా కేసీఆర్ మౌనంగా ఉన్నా, గడబిడ చేసినా…

కేసీఆర్ ఇప్పుడు మౌనంగా ఉన్నాడు. ఎన్నికల్లో ఓడిపోయిన తొలి రోజుల్లో కాస్త హడావిడి చేసినా ఇప్పుడు సద్దుమణిగాడు. “అన్న నిలుచుంటే మాస్.. అన్న కూచుంటే మాస్” అన్నట్లుగా కేసీఆర్ మౌనంగా ఉన్నా, గడబిడ చేసినా వార్తే.

ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడే, ఎవరినో ఒకరిని విమర్శించే రాజకీయ నాయకులు గమ్మున ఉంటే ఎందుకిలా ఉన్నారని ఆలోచిస్తాం. అందులోనూ కేసీఆర్ మామూలు అలాటప్ప నాయకుడు కాదు. చోటా నాయకుడు కాదు. తెలంగాణ ఉద్యమ నాయకుడు. తెలంగాణ జాతిపిత అని పిలిపించుకున్నవాడు. చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ సాధించానని చెబుతూ ఉంటాడు.

తనకు తెలియని విషయం లేదంటాడు. తాను ఒక ఇంజినీర్ ను అంటాడు. ఒక విజనరీని అంటాడు. ఏ పని ఎలా చేయాలో, ఎందుకు చేయాలో తెలుసని అంటాడు. ఎదుటివాళ్ళు సోయి లేకుండా మాట్లాడతారేమోగాని తాను మాట్లాడడు. ఎదుటివారు అడ్డం పొడుగు మాటలు మాట్లాడతారేమోగాని తాను మాట్లాడడు. ఎదుటివారు బూతులు మాట్లాడతారుగాని తాను మాట్లాడడు.

ఇన్ని మెచ్చుకోదగిన లక్షణాలు ఉన్న కేసీఆర్ దగ్గర ఏ నాయకుడికీ లేని లక్షణం ఒకటుంది. అదే.. ఎనభై వేలో, లక్షో పుస్తకాలు చదివాడు. రాజకీయాల్లో మౌనం కూడా ఒక వ్యూహమే అవుతుంది. కాబట్టి ఆయన సైలెన్స్ వ్యూహం అయి ఉండొచ్చు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలియాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నట్లుగా ప్రస్తుతానికి కేసీఆర్ తగ్గి ఉన్నాడేమో. సమయం చూసుకొని మళ్ళీ తెరమీదికి వస్తాడేమో. అలవికాని చోట అధిలమనరాదు అనే సూత్రాన్ని పాటిస్తున్నాడేమో.

ఒకవేళ నిరాశలో ఉన్నట్లయితే తెలంగాణ ఉద్యమంలోనూ, పదేళ్ల పరిపాలనలోనూ ఎంతో డేరింగ్గా, డేషింగ్ గా వ్యవహరించిన ఈ నాయకుడు ఒక్క ఓటమికి ఇలా అయిపోకూడదు. అందులోనూ లక్ష పుస్తకాలు చదివాడు. తెలుగు సాహిత్యం చదువుకున్నవాడు. మరి ఇంత చదువుకున్నవాడికి ఓటమి ఎదురైనప్పుడు దాన్నుంచి ఎలా బయట పడాలో తెలియకుండా ఉంటుందా? ఓటమి అనేది విజయానికి పునాది అనేది కేసీఆర్ కు తెలియకుండా ఉంటుందా ?

కేసీఆర్ సిటీలో ఉండటంలేదు. పూర్తిగా ఫామ్ హౌజ్ కే పరిమితమైనట్లు వార్తలు వస్తున్నాయి. నాయకులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను కలుసుకోవడంలేదు. పార్టీని పూర్తిగా కేటీఆర్ అండ్ హరీష్ రావు మీద వదిలిపెట్టారు. మళ్ళీ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కేసీఆర్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడట. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీని నడుపుతున్న నాయకుడు, పదేళ్లు తిరుగు లేకుండా పరిపాలించిన నాయకుడు పార్టీని ఎలా గాడిలో పెట్టాలని ఆలోచిస్తున్నాడట.

అందుకే ఆయన దేశంలో పటిష్టంగా ఉండి, ఓటమి పాలైనా విజయాలు సాధిస్తున్న ప్రాంతీయ పార్టీలను స్టడీ చేయడానికి కొందరు నాయకులను ఆయా రాష్ట్రాలకు పంపించాడని మీడియాలో వార్తలు వచ్చాయి. వాళ్ళు తమ స్టడీ రిపోర్టును కేసీఆర్ కు అందిస్తారు.

ఇతర ప్రాంతీయ పార్టీలను స్టడీ చేయడం ద్వారా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాడన్నమాట. అంటే.. తెలంగాణలో ఓటమి నుంచి ఆయన పాఠాలు నేర్చుకోలేకపోయాడన్నమాట. పాఠం నేర్చుకోవడమే ముఖ్యం. ఎలా నేర్చుకుంటే ఏముందిలే అంటారా. సరే … కానివ్వండి.

9 Replies to “కేసీఆర్ మౌనం నిరాశా? వ్యూహమా? ”

  1. అన్నం మానేసి Form house లో కూసుని, “విత్తనం లేకుండా వరి” పండించే పనిలో బిజీ గా ఉన్నాడు. Don’t disturb this farm scientist please..

  2. కెసిఆర్ నాయకుడా? ఒట్టి మూర్కుడు. ధైర్యంగా 9 కోట్ల ప్రజలను పరిపాలించాల్సిన వాడు, రాష్ట్రాన్ని విడకొట్టి కేవలం 4 కోట్ల ప్రజలను పరిపాలించే పిరికోడు. డబ్బుకు కక్కుర్తి పడి, ఇపుడు కూతురు ఊసలు లెక్క పెట్టటం కన్నా సిగ్గు చేటు ఇంకోటి లేదు కెసిఆర్ కు.

  3. ముక్కోడి కోసం యమలోక ద్వారాలు తెరుచుకున్నాయి, ఫార్మ్ హౌస్ నుండి తీసుకెళ్లడానికి యమకింకరులు అయిన డ్రామా రావు , అగ్గిపెట్టి నాటకాల హరీష్ రావు , సూర్పనఖ కవిత మద్యం తో యమలోకానికి పంపే దానికి ఏర్పాట్లు చేసి ఉన్నారు

  4. మనమేమి తలలు పట్టుకొని ఆలోచన చెయ్యనవసరం లేదు, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే పాలన చేస్తుంటే ఆటోమెటిగా దించేస్తారు, అప్పుడు కూడా బీజేపీ ఇప్పుడు ఉన్నట్లు నిస్తేజంగా ఉంటే BRS యే గెలుస్తుంది.

Comments are closed.