రవితేజ.. ఒక్కో నిర్మాత తగ్గుతున్నారు

ఇప్పుడు రవితేజ‌తో సినిమాలు చేయడానికి మిగిలిన నిర్మాతలు ఎవరు?

పీపుల్స్ మీడియా, మైత్రీ మూవీస్, సుధాకర్ చెరుకూరి, కోనేరు సత్యనారాయణ, అభిషేక్ నామా, అభిషేక్ అగర్వాల్, రామ్ తాళ్లూరి, కెకె రాధామోహన్, వీళ్లంతా హీరో రవితేజతో సినిమాలు చేసి భారీ నష్టాలు మూటగట్టుకున్న వారే. పీపుల్స్ మీడియా ఓ సినిమాలో సంపాదించి, మరో సినిమాలో మొత్తం పొగొట్టుకున్నారు. మైత్రీ మూవీస్ ఓ సినిమా సోలోగా చేసి దారుణంగా నష్టపోయారు. రామ్ తాళ్లూరి రెండు సినిమాలు చేసి మరీ నష్టపోయారు. మిగిలిన వారంతా ఒక్కో సినిమా చేసి నష్టాలు మూటకట్టుకున్నారు.

ఒకప్పుడు పది కోట్లు వున్న రవితేజ‌ రెమ్యూనిరేషన్ ఇప్పుడు పాతిక కోట్లు అని ఇండస్ట్రీ టాక్. ఎంతవరకు నిజమో రవితేజకే తెలియాలి. రెమ్యూనిరేషన్ సంగతి పక్కన పెడితే ఇక కొత్త నిర్మాతలు తప్ప ఎవరు మిగిలారు. ఇప్పటి వరకు రవితేజతో సినిమా చేయని సితార సంస్ధ సినిమా చేస్తోంది. కొత్త దర్శకుడు, పోలీస్ పాత్ర, సితార సంస్థ అంటే మినిమమ్ వుంటుంది కనుక బాగుంటుందని అనుకోవాలి.

తప్పితే, ఇప్పుడు రవితేజ‌తో సినిమాలు చేయడానికి మిగిలిన నిర్మాతలు ఎవరు? కొత్త వాళ్లు వస్తారన్న సంగతి పక్కన పెడితే దిల్ రాజు, అశ్వనీదత్ తప్పితే అందరూ తీసేసారు. కోట్లకు కోట్లు నష్టపోయారు. మళ్లీ సరైన దర్శకుడు, సబ్జెక్ట్ దొరికాయని సంతోషించి పాత వాళ్లే మళ్లీ ధైర్యం చేస్తారా? లేక ప్రస్తుతం చేస్తున్న సినిమా ఫలితం తెలిసే వరకు వేచి వుంటారా?

ప్రస్తుతం రవితేజ నాన్ థియేటర్ మార్కెట్ బాగా పడిపోయింది. ఓటీటీ మీద పదిహేను కోట్లు దాటి రావడం కష్టం అవుతోంది. థియేటర్ మార్కెట్ ముఫై కోట్లు అంటే అమ్మో అంటున్నారు. హిందీ మార్కెట్ అందరికీ డౌన్ అయినట్లే ఈయనకూ అయింది. ఇలాంటి నేపథ్యంలో ఒక బ్లాక్ బస్టర్ పడి తీరాలి రవితేజకు.

9 Replies to “రవితేజ.. ఒక్కో నిర్మాత తగ్గుతున్నారు”

Comments are closed.