డ‌బ్బు లేదు… త‌ర్వాత చూద్దాం!

కూట‌మి ప్రభుత్వం కొలువుదీరి రెండు నెల‌లు దాటింది. దీంతో టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన నాయ‌కులు ప‌నుల కోసం సీఎం చంద్ర‌బాబు నాయుడు, ఇత‌ర ప్ర‌భుత్వ పెద్ద‌ల వ‌ద్ద‌కు వెళుతున్నారు. మ‌రీ ముఖ్యంగా ఈ ద‌ఫా…

కూట‌మి ప్రభుత్వం కొలువుదీరి రెండు నెల‌లు దాటింది. దీంతో టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన నాయ‌కులు ప‌నుల కోసం సీఎం చంద్ర‌బాబు నాయుడు, ఇత‌ర ప్ర‌భుత్వ పెద్ద‌ల వ‌ద్ద‌కు వెళుతున్నారు. మ‌రీ ముఖ్యంగా ఈ ద‌ఫా పెద్ద సంఖ్య‌లో కొత్త ఎమ్మెల్యేలున్నారు. దీంతో ఉత్సాహంతో అభివృద్ధి ప‌నుల విష‌య‌మై ప్ర‌తిపాద‌న‌ల్ని ముఖ్య‌మంత్రి వ‌ద్ద‌కు తీసుకెళుతున్నారు. సీఎం స‌మాధానంతో నిరుత్సాహంగా వెనుదిరుగుతున్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు వైఎస్సార్ జిల్లా క‌మ‌లాపురంలో కొన్నేళ్లుగా రైల్వే బ్రిడ్జి నిర్మాణం పెండింగ్‌లో వుంది. క‌మ‌లాపురం న‌డి ఊళ్లో రైల్వే ట్రాక్‌పై బ్రిడ్జి నిర్మించ‌క‌పోవ‌డం వ‌ల్ల ప్ర‌జ‌లు చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. అలాగే అదే నియోజ‌క‌వ‌ర్గంలోని స‌ర్వ‌రాయ‌సాగ‌ర్‌కు సంబంధించి అసంపూర్తిగా మిగిలిన ప‌నుల్ని పూర్తి చేస్తే రైతాంగానికి సాగునీళ్లు అంది పంట‌లు పండుతాయి. ఈ రెండింటి విష‌య‌మై యువ‌కుడైన ఎమ్మెల్యే పుత్తా చైత‌న్య‌రెడ్డి ఇటీవ‌ల చంద్ర‌బాబునాయుడి దృష్టికి తీసుకెళ్లారు.

ప్ర‌భుత్వ ఖ‌జానాలో డ‌బ్బు లేద‌ని, కొంత కాలం త‌ర్వాత చూద్దామ‌ని సీఎం చెప్పిన‌ట్టు యువ ఎమ్మెల్యే ఒక ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నారు. ఇది కేవ‌లం క‌మ‌లాపురం ఎమ్మెల్యే అనుభ‌వం మాత్ర‌మే కాదు. ఏ ఎమ్మెల్యేని క‌దిలించినా ఇలాంటి అనుభ‌వాల్నే చెబుతారు. ఒక్క అమ‌రావ‌తి నిర్మాణానికి త‌ప్ప, ప్ర‌భుత్వం వ‌ద్ద డ‌బ్బే లేద‌నే స‌మాధానం సీఎం నుంచి వ‌స్తోంది. దీంతో ఏ ఒక్క అభివృద్ధి ప‌ని ముంద‌డుగు ప‌డ‌డం లేదు.

హామీలు మాత్రం చాలా ఇచ్చారు. వీట‌న్నింటిని ఏం చేయాలో దిక్కు తోచ‌ని ప‌రిస్థితి ఎదుర‌వుతోంది. ఇటు ఉన్న‌తాధికారులు, అటు ప్ర‌భుత్వ పెద్ద‌ల నుంచి చూద్దాం, చేద్దాం అనే స‌మాధానం మాత్ర‌మే వ‌స్తోంది. ఒక‌సారి అడిగిన త‌ర్వాత‌, మ‌ళ్లీ ఆరు నెల‌ల వ‌ర‌కూ అటు వైపు తొంగి చూసే ప‌రిస్థితి ఉండ‌ద‌ని ఎమ్మెల్యేలే చెబుతున్నారు. దీంతో గ‌త ప్ర‌భుత్వంలో మాదిరిగానే, కొత్త ప్ర‌భుత్వంలో కూడా అభివృద్ధి ప‌నులు ముందుకు సాగ‌డం లేద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

13 Replies to “డ‌బ్బు లేదు… త‌ర్వాత చూద్దాం!”

  1. Amaravathi kuda ekkada vundhi ra gutle. If central or world bank will lend the funds, that shouldb be not deviate for other purposes.

    Mari rishikonda palace ki paisal vunnayi.. Roads ki paisal leva?

  2. అమరావతి మీద ఏడుపు ఆపు GA. అమరావతికి కేంద్రం ఇస్తోంది. 
    రియల్ ఎస్టేట్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందీ
    ఒకసారి ప్రజలు డబ్బుని రొటేషన్ లోకి తెస్తే ప్రభుత్వానికి కాస్త చెయ్యి ఆడుతుంది.
    అప్పులు చేసి ఇవ్వకూడదు ..
    కొన్నాళ్లు ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయ్
  3. కడప జిల్లాలో తరతరాలుగా గెలుస్తున్న వైస్ ఫామిలీ ఏమి చేయకపోవటం విచారకరం , గత 5 ఏళ్లుగా నీచుడు జగన్ రెడ్డి అవినీతికి అంకితం అయ్యాడు

Comments are closed.