అనకాపల్లిలో అక్కడ అదానీ కన్ను?

అదానీ కన్ను అనకాపల్లి జిల్లాలోని రెండు కీలక రిజర్వాయర్ల పైన పడిందని అంటున్నారు. ఈ జిల్లాలోని మాడుగుల నియోజకవర్గం పరిధిలోకి వచ్చే రెండు గిరిజన ప్రాజెక్టులను అదానీకి కట్టబెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్సాహం…

అదానీ కన్ను అనకాపల్లి జిల్లాలోని రెండు కీలక రిజర్వాయర్ల పైన పడిందని అంటున్నారు. ఈ జిల్లాలోని మాడుగుల నియోజకవర్గం పరిధిలోకి వచ్చే రెండు గిరిజన ప్రాజెక్టులను అదానీకి కట్టబెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్సాహం చూపిస్తున్నాయని వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

దేవరాపల్లి మండలంలోని రైవాడ చీడికాడ మండలం కోణం ప్రాజెక్టులకు వచ్చే శారదా నది పైన చల్లగెడ్డ పైన కోణం ప్రాజెక్టుకు నీళ్లు వచ్చే బోడ్డెరు నదిపైన అదాని కన్ను పడిందని అంటున్నారు. జిల్లాలో ఈ రెండు అత్యంత కీలకమైన రిజర్వాయర్లుగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ రెండూ నదీ పరీవాహక ప్రాంతాలుగా ఉండడంతోపాటు దట్టమైన అడవులు ఉండడం వల్లనే అదానీ కోరుకుంటున్నారని అంటున్నారు.

ఆయన కోరినదే తడవుగా ఇచ్చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుమతులు ఇవ్వడానికి సిద్ధం అయిపోతున్నాయని వామపక్ష నాయలు ఆరోపిస్తున్నారు. అక్కడ అదాని హైడ్రోపవర్‌ ప్లాంట్లులను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

అయితే ఈ హైడ్రో పవర్ ప్లాంట్ల వల్ల గిరిజన జీవితం అతలాకుతలం అవుతుందని అలాగే కోణం, రైవాడ పరిధిలోకి వచ్చే రైతుల ఆయకట్టు భూములు ఎడారిగా మారబోతున్నాయని ప్రజా సంఘాల నేతలు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం అదాని కంపెనీకి చెందిన ప్రతినిధులు ఈ ప్రాంతంలో భూసార పరీక్షలు ఇతర పనులు ప్రారంభించారని తెలిపారు. అదే విధంగా అటవీ శాఖ అధికారులు, అదాని ప్రతినిధులు కలసి సర్వేలు నిర్వహించడం జరుగుతోందని అన్నారు.

అదానీకి ఈ రిజర్వాయర్లు అప్పగిస్తే మాత్రం గిరిజనులతో పాటు రైతాంగం నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాంతంలో హైడ్రోపవర్‌ ప్లాంట్‌ నిర్మాణం జరిగితే ఆ పరిధిలో ఉండే గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అంటున్నారు.

18 Replies to “అనకాపల్లిలో అక్కడ అదానీ కన్ను?”

  1. Adani ఇంకా ఏ భారత కంపెనీ లు చేసినా పర్యావరణ సమస్య లు వస్తాయి, చైనా కంపెనీ లకి అప్పగిస్తే రావేమో?

  2. పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ రాబోయే టైం లో ఈ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ లతో ఎం పని? ఇంకా ఎదో కారణం అయ్యిండొచ్చు. బాగా పిండండి వీడి దగ్గర.

  3. maa vooru konam pakkene chinna pakkane chinna palleturu – Managalapuram. maa polaluku neellu vachedi kuda konam dam water nunde, akkada electricity produce chese antha emee undad and ryvada kuda anthe.

    Ayna adani teesukunte contract teesukuntadu, anthe gaane waqf board la antha made andadu, ekkada nunchi tesukocharu ee sollu.

  4. What is Adani going to do there, I am from Managalapuram near Konam Dam. We have our own farmland, completely depending on water coming from Konam dam only. There is nothing to construct for power or other tools, and the same is applicable to Revada dam too.

  5. దేశంలో ఏ ప్రాజెక్టు కట్టినా ఏ పరిశ్రమ పెట్టినా ఈ చైనా పెంపుడుకుక్కలు పర్యావరణం పాడు అవుతుందనో పిచికలకు ఈకలు రాలిపోతాయనో కోతులకు మాయరోగం వస్తుందనో అభ్యంతరాలు చెప్పుతూ ఆందోళనలు చేస్తుంటారు. నాగార్జునసాగర్ కట్టినా పోలవరం కట్టినా , విజయవాడా హైదరాబాద్ రోడ్డు వేసినా ఈ కుక్కలు మొరగటం సర్వసాధారణం

    ఇప్పుడు ఈ ప్రాజెక్టులను చీకట్లో తడికచాటున అదానీకి అప్పచెప్తారా లేక ఓపెన్ బిడ్డింగ్ లో అప్పచెప్తారా అనేది గ్రేట్ ఆంధ్రలో ఈ చెత్త రాసినవాడే చెప్పాలి

  6. ఏ ప్రభుత్వం వచ్చినా ఏముంది గర్వకారణం, మన అధాని, అంబానీల సేవలో  తరించటం తప్ప, మరియు  మన మోడీ గారి బూట్లు నాకటం తక్క.

Comments are closed.