కేటీఆర్ ముందరి కాళ్లకు బంధం వేసిన రేవంత్!

సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టిస్తే కనుక తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని తప్పకుండా కూల్చివేస్తామని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆల్రెడీ ప్రకటించారు. రాజీవ్…

సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టిస్తే కనుక తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని తప్పకుండా కూల్చివేస్తామని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆల్రెడీ ప్రకటించారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడ నుంచి తొలగిస్తామని- సకల లాంచనాలతో కాంగ్రెస్ వారికి పంపుతామని.. వారు అప్పుడు ఎక్కడ కావలిస్తే అక్కడ ప్రతిష్టించుకోవచ్చునని అని ఎద్దేవా చేశారు.

నాలుగేళ్ల తర్వాత రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పని జరుగుతుందని ఆయన హెచ్చరించారు. అయితే కల్వకుంట్ల తారక రామారావు దూకుడుకు బ్రేకులు వేసినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ముందరి కాళ్లకు బంధం వేసే నిర్ణయం ప్రకటించడం గమనార్హం.

తెలంగాణ సచివాలయం ఎదురుగా ఐలాండ్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించాలని తాము అప్పట్లో అనుకున్నట్లుగా కేటీఆర్ చెబుతున్నారు గాని.. ఆ మాటలు నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే తెలంగాణ సెక్రటరియేట్ పూర్తవుతున్న దశలో విగ్రహ ప్రతిష్టాపనకు కూడా ఏర్పాటు చేసి ఉంటే.. సెక్రెటరియేట్ తో పాటు తెలంగాణ తల్లిని కూడా ఆవిష్కరించుకుంటే ఎంతో అద్భుతంగా ఉండేది. కానీ అమరవీరుల జ్యోతి ఏర్పాటు, సెక్రటరియేట్ మీద శ్రద్ధ పెట్టిన కేసీఆర్ సర్కారు తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టించాలని ఆలోచనకు విలువ ఇవ్వలేదు.

లేదా వారి మనసులో మరొక ఆలోచన ఏదైనా ఉండి ఉండవచ్చు. కీలక స్థానంలో ఒక ఐలాండ్ ఖాళీగా ఉంచుకుంటే తమ పార్టీకి చెందిన వారి విగ్రహాన్ని భవిష్యత్తులో పెట్టుకోవచ్చు అని ఆశ వారికి కలిగి ఉండవచ్చు.

ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం పట్ల సహజంగానే గులాబీ దళాలలో వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. అది తెలంగాణ తల్లి కోసం కేటాయించిన స్థలం అని వారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. తాము అధికారంలో ఉండగా ఆ పని ఎందుకు చేయలేకపోయారో మాత్రం చెప్పడం లేదు. రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తొలగిస్తామని అదే స్థలంలో తెలంగాణ తల్లిని పెడతామని కూడా అంటున్నారు.

వారికి అలాంటి అవకాశం ఇవ్వకుండా అదే ప్రాంతంలో అంటే సచివాలయ ఆవరణలో ఘనంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించడానికి రేవంత్ రెడ్డి తాజాగా నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో ఒకవేళ భారాస అధికారంలోకి వచ్చినా సరే ఇప్పుడు వారు ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నట్లుగా.. రాజీవ్ గాంధీని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహం పెడితే.. ఒకే చోట రెండు విగ్రహాలు ఏర్పాటు చేసినట్లుగా అవుతుంది! అది అనిపించుకుంటుందే తప్ప దాని ద్వారా సాధించేది ఏమీ ఉండదు.

తెలంగాణ ఆవరణలోని తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని, సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఉంటుందని రేవంత్ అంటున్నారు. ఈ నిర్ణయం బహుశా గులాబీ శ్రేణులను ఇరకాటంలో పడేయవచ్చు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూల్చేస్తాం లాంటి దూకుడు ప్రకటనలు నేపథ్యంలో.. రేవంత్ తాజా ఎత్తుగడ వారిని కట్టడి చేసే కౌంటర్ అవుతుందని పలువురు భావిస్తున్నారు!

7 Replies to “కేటీఆర్ ముందరి కాళ్లకు బంధం వేసిన రేవంత్!”

  1. రాజీవ్ గాంధీ విగ్రహం కూల్చేసి విగ్రహాలు పెట్టడానికి వేరే నాయకులు ఎవరూ లేరా? కాకతీయ చక్రవర్తులు కాని రుద్రమదేవి కాని.

    1. ఒక విషయం చెప్పు…

      కాకతీయులు great అంటావా? అలా అయితే సమ్మక్క సారలమ్మ ఉగ్ర్ వాద్ లు అవుతారు కదా?

      మరి సమ్మక్క దేవత అయితే కాకతీయులు క్రూరులు అనే కదా అర్థం

      🤣

  2. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు కాబట్టి రాజీవ్ గాంధీ విగ్రహం తెలంగాణ లో ప్రతి చోట ఉండాలి

  3. పక్క రాష్ట్రాలు.. తమిళనాడు.. కర్ణాటక.. వారు.. వారి వారి ప్రాంతాలలో గొప్ప వారైన తిరువళ్ళువర్.. కేంపేగౌడ.. అలాంటి వారి విగ్రహాలు పెట్టుకుంటారు.. మనకి ఎవరు గొప్ప వారు లేక ఇలా పెట్టుకుంటున్నామా…

Comments are closed.