‘మహిళలకు ఉచిత ప్రయాణం’ వాయిదాకు ఎత్తులు!

సూపర్ సిక్స్ హామీలు అంటూ చంద్రబాబు నాయుడు ప్రజలను ఊదరగొట్టి అధికారంలోకి వచ్చారు. మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతిమహిళకు నెలకు రూ.1500 ఇస్తాం అని కూడా అన్నారు. కానీ..…

సూపర్ సిక్స్ హామీలు అంటూ చంద్రబాబు నాయుడు ప్రజలను ఊదరగొట్టి అధికారంలోకి వచ్చారు. మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతిమహిళకు నెలకు రూ.1500 ఇస్తాం అని కూడా అన్నారు. కానీ.. ఆ హామీల దిశగా అసలు అడుగు పడుతున్న దాఖలాలే కనిపించడం లేదు.

మహిళలు ఆశపడిన పథకాలపై చంద్రబాబు సర్కారు తమ పచ్చమీడియా ద్వారా నెమ్మదిగా నీళ్లు చిలకరించే ప్రయత్నం చేస్తున్నదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రవాణా శాఖ వ్యవహారాలపై చంద్రబాబు సమీక్షించనున్న నేపథ్యంలో అసలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఎప్పటి నుంచి అమల్లోకి తెస్తారో నిర్దిష్టంగా ఒక తేదీ చెప్పగల స్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నదా అనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది.

చంద్రబాబు సమీక్ష కోసం ఆర్టీసీ అధికారులు ఈ హామీ అమలుకు సంబంధించి నివేదిక తయారుచేసినట్టు చెబుతున్నారు. ఇంకా రెండు వేల బస్సులు కావాలని, మూడున్నర వేల మంది డ్రైవరు పోస్టులు భర్తీ చేయాలని నివేదిక సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. అన్నీ సమకూరిన తర్వాత అమలుచేద్దాం అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే కనీసం ఇంకో ఆరునెలల కాలం వరకు వాయిదా వేయాలనే వ్యూహంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.

జగన్ ప్రభుత్వంలో ఒక్క బస్సు కూడా కొనలేదని ఒకవైపు అంటూనే.. మరొకవైపు కొంతకాలం కిందట కొన్న 1480 కొత్త బస్సులు బాడీ బిల్డింగ్ పూర్తిచేసుకుని ఒక్కటొక్కటిగా డిపోలకు వస్తున్నాయని చెబుతున్నారు. కొంతకాలం కిందట అంటే చంద్రబాబు వచ్చిన తర్వాత అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. కీర్తి జగన్ ఖాతాలో పడుతుందని భయపడుతున్నారు.

అయినా ఒక హామీ ఇచ్చేముందు సాధ్యాసాధ్యాల గురించి నాయకులకు ముందే స్పృహ ఉండాలి. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇలా అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణ హామీని అమల్లోకి తెచ్చేశారు.

నిజానికి చంద్రబాబునాయుడు మహిళలకు ఇచ్చిన హామీ, రేవంత్ హామీలో నాలుగో వంతు అని చెప్పాలి. ఎందుకంటే.. చంద్రబాబు చెప్పినది సొంత జిల్లాలో మాత్రమే ఉచిత ప్రయాణం. అంటే జిల్లా దాటితే మహిళలు టికెట్ కొనాల్సిందే. దీనివల్ల ఏదో చిన్న చిన్న పనులు, దొడ్లో పండిన కూరగాయలు అమ్ముకునే తరహా మహిళలకు లాభమే గానీ.. ఉచితంగా బస్సు దొరికింది కదా అని ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయే ప్రయాణాలుండవు. అయినా సరే.. ప్రభుత్వం రకరకాల నెపాలు చెప్పి వీలైనంత వాయిదా వేయాలనే చూస్తున్నట్టుగా కనిపిస్తోంది.

ప్రస్తుతం సర్కారు ఆర్టీసీ నుంచి నెలకు రూ.125 కోట్ల దాకా లాభాల నుంచి తీసుకుంటోంది. ఉచిత ప్రయాణం అమలైతే అది పోను నెలకు మరో 125 కోట్లు ప్రభుత్వమే ఇవ్వాల్సి వస్తుందని అంచనా. అంటే.. ప్రభుత్వానికి అదనంగా పడే భారం ఏడాదికి 1500 కోట్లు మాత్రమే. కానీ ఈ భారాన్ని భూతద్దంలో చూపించడానికి తద్వారా అమలు ఆలస్యం చేయడానికి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

16 Replies to “‘మహిళలకు ఉచిత ప్రయాణం’ వాయిదాకు ఎత్తులు!”

  1. ఉచిత బస్సు ఉన్నది కదా అని ఇబ్బడి ముబ్బడి గ పెరిగి పోయే ప్రయన్లు ఉండవా ???సిగ్గుందా ఇలా రాసేదానికి ….కర్ణాటక తెలంగాణ ల్లో ఎంత అవస్థలు పడుతున్నారో బాధ్యత గల (???!!) మీడియా గ ఎప్పుడు ఐన ఒక స్టడీ ఐన చేసారా ???? ఇచ్చిన హామీ ఏ తప్పు ..దాన్ని సరిగ్గా అమలు చెయ్యడం కోసం చేసే కనీస అధ్యయనాన్ని కూడా తప్పు పట్టడం కరెక్ట్ కాదు

      1. ఏది సీపీస్ ఎత్తేస్తా..అది కూడా వారం రోజుల్లో ….ఏడాదికో జాబ్ క్యాలెండరు తెస్తా…..15000 అమ్మ వోడి అని చెప్పి 2000 నొక్కేస్తా…బటన్ జనవరి లో నొక్కుతా….డబ్బులు ఉన్నప్పుడు జమ చేస్తా ..అలానేనా ???ఏ రాజకీయ పార్టీ ఐన అంటే ముందు అధికారం లోకి వచ్చేయాలి అనే యావ లోనే ఉంటారు అది చంబా ఐన మన అన్న ఐన ..తరువాతా సాధ్యాసాధ్యాల సంగతి చూస్తారు

  2. ఇందులొ పెద్ద ఎత్తులు ఎమున్నాయి? చెయగలిగని చెస్తారు, లెనివి చెయరు

  3. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. బస్సులు మరీ డొక్కుగా తయారయ్యాయి, దానికి కారణం పాడయ్యిన రోడ్లు. అల్యూమినియం బాడీ తో చేసిన బస్సులు, ఈ రోడ్లలో తిరిగితే షెడ్ కెళ్ళినట్టే. ఒక ట్రిప్ లో మెయిన్ స్ప్రింగ్ బ్లేడ్ విరుగుద్ది. టైర్స్ , ఆయిలు కంసమ్పషన్ గురించి చెప్పక్కర్లేదు. ఈ మధ్య అవార్డ్స్ అన్ని TSRTC కె వెళ్లాయి. జగన్ చాసిస్ కొన్న, బస్సు బాడీ కట్టించి వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి అనే విషయం కూడా నీకు తెలియదు. మంచి రోడ్స్ వేసి, బస్సు కండిషన్ ఇంప్రూవ్ చేసి, కొత్త బస్సెస్ వెయ్యకుండా, ఉచిత హామీ అమలుచేస్తే, 40 శాతం పెరగబోయే ప్రయాణికులు, టికెట్ కొనే వాళ్ళకి పనిష్మెంట్ నే. ఆలా అని హామీ ని మర్చిపోకూడదు, ఇచ్చి తీరాలి. ఇవ్వాలని ఆశిద్దాం.

Comments are closed.