జ‌గ‌న్ గుర్తు పెట్టుకో!

ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉన్నంత కాలంలో వైఎస్ జ‌గ‌న్‌కు పార్టీ నాయకుల్ని క‌లిసేందుకు స‌మ‌యం వుండేది కాదు. ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల‌తోనే స‌మ‌యం అంతా గ‌డిపేవారు. ముగ్గురు, న‌లుగురు పార్టీ నాయ‌కుల‌తో త‌ప్ప‌, క‌నీసం ఎమ్మెల్యేలు,…

ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉన్నంత కాలంలో వైఎస్ జ‌గ‌న్‌కు పార్టీ నాయకుల్ని క‌లిసేందుకు స‌మ‌యం వుండేది కాదు. ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల‌తోనే స‌మ‌యం అంతా గ‌డిపేవారు. ముగ్గురు, న‌లుగురు పార్టీ నాయ‌కుల‌తో త‌ప్ప‌, క‌నీసం ఎమ్మెల్యేలు, ఎంపీల‌ను క‌లిసేందుకు కూడా జ‌గ‌న్ స‌మ‌యం కేటాయించేవారు కాదు.

అధికారం పోయిన త‌ర్వాత క‌నీసం నాయ‌కుల‌కు అపాయింట్‌మెంట్ ఇస్తున్నారు. తాడేప‌ల్లిలో వుంటే పార్టీ నాయ‌కుల‌తో భేటీ అవుతున్నారు. కానీ జ‌గ‌న్‌ను క‌ల‌వాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్న ఆయ‌న అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు మాత్రం నో అపాయింట్‌మెంట్‌. తాజాగా బెంగ‌ళూరు నుంచి తాడేప‌ల్లికి జ‌గ‌న్ చేరుకున్నారు. బుధ‌, గురువారాల్లో నాయ‌కుల‌తో జ‌గ‌న్ క‌ల‌వ‌నున్నారు.

అయితే పార్టీ అభిమానులు, కార్య‌క‌ర్త‌లెవ‌రూ తాడేప‌ల్లికి రావ‌ద్ద‌ని పార్టీ కేంద్ర కార్యాల‌యం ప్ర‌క‌ట‌న ఇచ్చింది. టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల దాడుల్లో క్ష‌త‌గాత్రులుగా కార్య‌క‌ర్త‌లు మిగులుతున్నారు. వైసీపీ అధికారాన్ని పోగొట్టుకోవ‌డంతో పెద్ద‌సంఖ్య‌లో బాధితులవుతున్న‌ది కార్య‌క‌ర్త‌లే. వైసీపీ అధికారాన్ని కోల్పోవ‌డంతో వైసీపీ శ్రేణుల ప‌రిస్థితి ఏంటో సామాన్య కార్య‌క‌ర్త‌ల‌కు తెలిసినంత‌గా నాయ‌కుల‌కు తెలిసే అవ‌కాశం వుండ‌దు.

బాధిత కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడ‌కుండా, కేవ‌లం నాయ‌కుల వ‌ర‌కే ప‌రిమితం అయితే ఎలా? ఈ విష‌య‌మై జ‌గ‌న్ సీరియ‌స్‌గా దృష్టి సారించాల్సిన అవ‌స‌రం వుంది. నాయ‌కుల‌తో మొక్కుబ‌డి మీటింగ్‌ల‌కు పరిమిత‌మైతే ప్ర‌యోజ‌నం వుండ‌దు. రేపు కార్య‌క‌ర్త‌ల్ని కాల‌వాల‌ని జ‌గ‌న్ కోరుకున్నా, వాళ్లు వ‌చ్చే ప‌రిస్థితి వుండ‌ద‌ని ఆయ‌న గుర్తించుకోవాలి.

44 Replies to “జ‌గ‌న్ గుర్తు పెట్టుకో!”

  1. అయ్యా! ప్యాలెస్స్ Egg puff ల కర్చు లొ 3.6 కొట్లు అంట! 5 ఎళ్ళలొ 18 లక్షల Egg puff లు ఎలా తిన్నరా?

  2. ఆయన జనాన్ని కలిసేందుకు రోజూ రెడీ గా వుంటున్నారు.జనాలే ఆయన్ను కలవలేకపోతున్నారు..ఇదే లాజిక్కు.

  3. తను, తన తరువాత తరాలు జీవిత కాలం సరిపడేలా మింగేశాడు. ఊరికే కొన్ని రోజులు టైమ్ పాస్ చేసి తరువాత ఫారిన్ లో సెటిల్ అయిపోతాడు. నువ్వు ఊరికే చించుకోకు

    1. వాడి తిన్న దాంట్లో నాకు కూడా కొంత పడేయ్ అని గ్రేట్ ఆంధ్ర విన్నపం, జగన్ కి. అతనే మో పట్టించుకోడు.

  4. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు ఎక్కడ జరుగుతున్నాయి? నీ దగుల్బాజీ రాతలకు ఇక్కడ ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. మీ రాతల్లో ఎలా అయితే మార్పు రాదో, ఇక జగన్ కి కూడా ఆంధ్రప్రదేశ్లో అధికారం దక్కదు రాసుకో.

  5. జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వారు ఎక్కడ ఉన్నా కలిసేందుకు అవకాశం ఉంటుంది. నాయకులకు దిశానిర్దేశం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా జనం నీరాజనం పడుతున్నారు. జనం గుండెల్లో జగన్ కు స్థానం పదిలంగానే ఉంది.

    1. అదేంటి సోదరా మరి మన కోడి గుడ్డు మంత్రి అదేనండి బాబు కోడి గుడ్డు అమర్నాథ్ ఎమౌతాడు?

  6. జగన్ ని… షర్మిల ను కలపటం కాదు…మొదట జగన్ ను+ గ్రేట్ ఆంధ్ర ను ఒకటి చేయండి రా స్వామి

  7. గెలిచినప్పుడు అందుబాటులో లేడు కాబట్టే ఓడించారు

    ఏం కాప్షన్ లు రా… మీరు రాసేది!!

  8. ఆ హెడింగ్ ఏంటి GA గారూ… పవన్ గారు ఇచ్చిన వార్నింగ్ లా ఉంది

Comments are closed.