ఓజీ అప్ డేట్ ఇచ్చిన దానయ్య

పవన్ ఫ్యాన్స్ అందరి దృష్టి, మంత్రి పదవి ఎలా నిర్వహిస్తున్నారు అన్న దాని మీద లేదు. సినిమాలు ఎప్పుడు చేస్తారు.. ఎప్పుడు విడుదల చేస్తారు అన్న దాని మీద వుంది. అందుకే నిర్మాత దానయ్య…

పవన్ ఫ్యాన్స్ అందరి దృష్టి, మంత్రి పదవి ఎలా నిర్వహిస్తున్నారు అన్న దాని మీద లేదు. సినిమాలు ఎప్పుడు చేస్తారు.. ఎప్పుడు విడుదల చేస్తారు అన్న దాని మీద వుంది. అందుకే నిర్మాత దానయ్య సరిపోదా శనివారం ఈవెంట్ కు వచ్చినా ఓజీ మీద ప్రశ్నలు ఎదురయ్యాయి. అందుకే అప్ డేట్ ఇచ్చారు. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాము అన్నది ఓ కీలక అప్ డేట్.

త్వరలో అంటే ఎప్పుడు అన్నది తెలియదు. త్వరలో అన్నారు అంతే. పవన్ తో షూట్ చేస్తారా లేదా వేరే సీన్లు షూట్ చేస్తారా అన్నది కూడా తెలియదు. ఎందుకంటే హరిహర వీరమల్లు షూట్ ప్రారంభమైంది. మరి పవన్ లేకుండా ఏం చేస్తున్నారు అన్నది తెలియదు.

ఇదిలా వుంటే దానయ్య మరో అప్ డేట్ కూడా ఇచ్చారు. పవన్ బర్త్ డే కు టీజ‌ర్ వస్తుందని. ఇది ఫ్యాన్స్ కు మరింత హుషారు ఇచ్చే అప్ డేట్. నిజంగా ఓజీ టీజ‌ర్ వస్తే మాత్రం సందడి మామూలుగా వుండదు. సుజిత్ చిన్న గ్లింప్స్ ఇస్తేనే ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోయారు. ఇక టీజ‌ర్ ఇస్తే సందడి మామూలుగా వుండదు. దానయ్య షూట్ త్వరలో ప్రారంభిస్తున్నాం అని చెప్పారు అంటే పవన్ నుంచి ఏదో సమాచారం అందే వుండాలి.

పవన్ కూడా హరి హర వీరమల్లు, ఓజీ, వాటి తరువాత ఉస్తాద్ సినిమాలు ఫినిష్ చేయాలనే అనుకుంటున్నారని వార్తలు వున్నాయి. అందువల్ల 2025లో ఓజీ సినిమా విడుదల వుంటుందనుకోవచ్చు.

2 Replies to “ఓజీ అప్ డేట్ ఇచ్చిన దానయ్య”

Comments are closed.