స్కీమ్స్‌పై టీడీపీ ఎమ్మెల్యే మాట‌ల్లో త‌ప్పేంటి?

అన‌కాప‌ల్లి జిల్లా చోడ‌వ‌రం టీడీపీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు సంక్షేమ ప‌థ‌కాల‌పై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. సంక్షేమ ప‌థ‌కాల్ని అమ‌లు చేయ‌కూడ‌ద‌నేది ఆయ‌న బ‌ల‌మైన అభిప్రాయం. సంక్షేమ ప‌థ‌కాల కింద జ‌నం…

అన‌కాప‌ల్లి జిల్లా చోడ‌వ‌రం టీడీపీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు సంక్షేమ ప‌థ‌కాల‌పై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. సంక్షేమ ప‌థ‌కాల్ని అమ‌లు చేయ‌కూడ‌ద‌నేది ఆయ‌న బ‌ల‌మైన అభిప్రాయం. సంక్షేమ ప‌థ‌కాల కింద జ‌నం ఖాతాల్లో డ‌బ్బు వేయొద్ద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికే చెప్పిన‌ట్టు ఆయ‌న పేర్కొన‌డం విశేషం.

టీడీపీ ఎమ్మెల్యే రాజు అలా మాట్లాడ్డానికి బ‌ల‌మైన కార‌ణం లేక‌పోలేదు. గ‌తంలో జ‌గ‌న్ స‌ర్కార్ ఎంతో నిబ‌ద్ధ‌త‌తో జ‌నానికి సంక్షేమ ప‌థ‌కాల డ‌బ్బును వాళ్ల ఖాతాల్లో వేసింది. అయిన‌ప్ప‌టికీ జ‌నం వైసీపీని ఓడించారు. దీంతో సంక్షేమ ప‌థ‌కాల్ని చిత్త‌శుద్ధితో అమ‌లు చేసినా జ‌నం కృత‌జ్ఞ‌త చూప‌ర‌నే అభిప్రాయానికి టీడీపీ ఎమ్మెల్యే వ‌చ్చారు. అందుకే జ‌నానికి రూపాయి కూడా సాయం చేయొద్ద‌నే అభిప్రాయాన్ని ఆయ‌న వెల్ల‌డించడం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుపై చోడ‌వ‌రం టీడీపీ ఎమ్మెల్యే ఏమ‌న్నారంటే….

“చంద్ర‌బాబు అన‌వ‌స‌రంగా సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌ల ఖాతాల్లో డ‌బ్బులు వేయొద్ద‌ని చంద్ర‌బాబుకు నేరుగా చెప్పాను. ప‌థ‌కాల వ‌ల్లే, ఆడ‌వాళ్లు ఇంట్లో వంట మానేస్తున్నారు. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీకి అల‌వాటు ప‌డుతున్నారు. అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా బ‌ట్ట‌లు కొనుక్కుంటున్నారు. ఏటీఎంల‌కు వెళ్లి డ‌బ్బులు తీసి మందు తాగుతున్నారు” అని ఆయ‌న కామెంట్స్ చేశారు.

సంక్షేమ ప‌థ‌కాల్ని నిజాయితీగా అమ‌లు చేసిన ప్ర‌భుత్వాన్ని ఆద‌రించ‌క‌పోవ‌డం వ‌ల్లే, ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు లెక్క లేకుండా మాట్లాడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్‌ను స‌మ‌ర్థించేవాళ్లు లేక‌పోలేదు. ఇప్పుడు ఏది మాట్లాడినా, స‌మ‌ర్థించే వాళ్లు పుట్టుకొస్తున్నారు. పైగా అధికార పార్టీ ఎమ్మెల్యే.

12 Replies to “స్కీమ్స్‌పై టీడీపీ ఎమ్మెల్యే మాట‌ల్లో త‌ప్పేంటి?”

  1. 100% correct. Welfare icchina Jagan gaadiki 2019 lo runamaafee cheyani TDP kante takkuva seats vacchinayi. So, welfare annadi dandaga maalina yavvaram. Just continue with development activities. Public will automatically adjust.

  2. నిజంగా రాష్ట్రాభివృద్ధి ని కాంక్షించేవాళ్ళు అయితే ఈ సంక్షేమ పధకాలు ఆపెయ్యాలి.ఒక్క పించెన్,రేషన్ చాలు.

  3. కరెక్ట్ గా చెప్పారు.. టీడీపీకి ఓటు వేసిన వారు ఫ్రీ గా డబ్బులు కోరుకోవటం లేదు. అభివృద్ధి కోసమే చంద్రబాబుకు ఓటు వేశారు

Comments are closed.