ఈ సీనియర్లకు ఏమైంది.. ఎందుకిలా చేస్తున్నారు?

వీళ్లు రాసుకున్న కథల్లో లోపం ఉందా లేక ఆడియన్స్ టేస్ట్ మారిందా

టాలీవుడ్ లోకి ఎప్పుడూ కొత్త నీరు వచ్చి చేరుతుంది. అదే టైమ్ లో సీనియర్లపై గౌరవం, వాళ్ల సినిమాలపై భారీ అంచనాలుంటాయి. కానీ ఈమధ్య కాలంలో కొంతమంది సీనియర్ దర్శకులు ఆ అంచనాల్ని అందుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. వీళ్లు రాసుకున్న కథల్లో లోపం ఉందా లేక ఆడియన్స్ టేస్ట్ మారిందా అనే చర్చను పక్కనపెడితే.. వీళ్లు మాత్రం ఫెయిల్యూర్ ముద్ర వేసుకున్నారు.

కేవలం సీనియర్ మాత్రమే కాదు, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకడు త్రివిక్రమ్. చాలామందితో గురూజీ అని పిలిపించుకునే స్థాయి ఇతనిది. ఇలాంటి దర్శకుడు ఈ ఏడాది అదిరిపోయే ఫ్లాప్ ఇచ్చాడు. అదే గుంటూరు కారం. మహేష్ లాంటి స్టార్ హీరో, శ్రీలీల లాంటి ముద్దుగుమ్మ, ఎంత కావాలంటే అంత డబ్బు పెట్టే చినబాబు అండగా ఉన్నప్పటికీ గుంటూరుకారం సినిమాతో మెప్పించలేకపోయాడు త్రివిక్రమ్. బాధాకరమైన విషయం ఏంటంటే, సంక్రాంతి సీజన్ కూడా ఈ సినిమాను కాపాడలేకపోయింది.

ఇక మరో సీనియర్ దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ఇంతే. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఈ దర్శకుడు, అదే చేత్తో స్కంద లాంటి డిజాస్టర్ కూడా ఇచ్చాడు. అసలు అఖండ లాంటి సినిమా తీసింది ఇతడేనా అని అనుమానించే రేంజ్ లో ఉంది స్కంద.

ఈ లిస్ట్ లో కొరటాల శివను కూడా చెప్పుకోవాల్సిందే. ఫ్లాప్ అంటే ఏంటో తెలియని దర్శకుడీయన. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను.. ఇలా అన్నీ సూపర్ హిట్స్. ఒక్కసారిగా ఆచార్యతో బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం ఆశలన్నీ దేవరపైనే.

ఇక పూరి జగన్నాధ్, హరీశ్ శంకర్ గురించి తెలిసిందే. ఎప్పట్లానే డబుల్ ఇస్మార్ట్ తో పూరి జగన్నాధ్ మరోసారి ఫ్లాప్ ఇవ్వగా.. భారీ అంచనాలతో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాతో హరీశ్ శంకర్ కూడా ఫ్లాప్ ఇచ్చాడు. ఇలా ఈ సీజన్ లో సీనియర్ దర్శకులంతా వరుసపెట్టి ఫ్లాపులిస్తున్నారు.

14 Replies to “ఈ సీనియర్లకు ఏమైంది.. ఎందుకిలా చేస్తున్నారు?”

    1. Adi kuda oka cinema na ? Enthasepu Hyderabad to guntur velli ravadam thappa emundira aa sodi cinema lo… Sankranti kabatti theatres Ani block chesi… Audience ki option lekunda chesi dabbulu dobbaru… Avanni Hanuman movie collection…. Guruji lo masala ayipoyi chala kaalam ayyindi…

    2. Adi kuda oka cinema na ? Enthasepu Hyderabad to guntur velli ravadam thappa emundira aa sodi cinema lo… Sankranti kabatti theatres Ani block chesi… Audience ki option lekunda chesi dabbulu dobbaru… Avanni Hanuman movie collection…. Guruji lo masala ayipoyi chala kaalam ayyindi…

  1. గుంటూరు కారం సినిమా ని మీరు అంతా తొక్కేయ్యాలి అని చూసినా ఎవరికీ నష్టాలు రాలేదు, ఫర్వాలేదు ప్లాప్ కాదు.

  2. వీళ్ళకి త్రివిక్రమ్ ని బద్నాం చెయ్యటమంటే మహా సరదా. ఎప్పుడు ప్లాప్ ఇచ్చే పూరి కి, ఎప్పుడో ఒకసారి ప్లాప్ ఇచ్చే త్రివిక్రమ్ తేడా లేదా?

  3. గుంటూరు కారం ఫ్లాపా.. దారుణంగా మాట్లాడుతున్నావ్.. చిన్నబ్బులు సినిమా హిట్ అంటావేమో

Comments are closed.