కంటెంట్ కనెక్ట్ అయితేనే.. ఓపెనింగ్

ప్రస్తుత సినిమా రంగ పరిస్థితి మీద నిర్మాత దిల్ రాజు లాజిక‌ల్‌ పాయింట్లు చెప్పారు. దర్శకులకు ఇప్పుడు పెద్ద టాస్క్ కేవలం స్క్రిప్ట్, డైరక్షన్ మాత్రమే కాదని, సరైన కంటెంట్ ఇవ్వడం కీలకమైన ప్రీ…

ప్రస్తుత సినిమా రంగ పరిస్థితి మీద నిర్మాత దిల్ రాజు లాజిక‌ల్‌ పాయింట్లు చెప్పారు. దర్శకులకు ఇప్పుడు పెద్ద టాస్క్ కేవలం స్క్రిప్ట్, డైరక్షన్ మాత్రమే కాదని, సరైన కంటెంట్ ఇవ్వడం కీలకమైన ప్రీ రిలీజ్ కంటెంట్ ఇవ్వడం అవసరమని నిర్మాత దిల్ రాజు అన్నారు.

సినిమా విడుదలకు ముందు వచ్చే టీజ‌ర్, ట్రయిలర్, పాటలు ఇవే ప్రేక్షకులను థియేటర్ కు పుల్ చేస్తున్నాయని అన్నారు. అందువల్ల అలాంటి కంటెంట్ అందివ్వాల్సిన బాధ్యత దర్శకుడి మీద వుందన్నారు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో కరెక్షన్ జ‌రుగుతోందని దిల్ రాజు అన్నారు. ఓటీటీ ఇన్ కమ్ కీలకం అని అటు పరుగెత్తడం కొంత వరకు జ‌రిగిందని, ఇప్పుడు అన్నీ మారుతున్నాయని అన్నారు. ఓటీటీ, టికెట్ రేట్లు, కంటెంట్ ఇలా ప్రతి ఒక్క విషయంలో కరెక్షన్ అనివార్యమైంది అని అన్నారు. త్వరలో మళ్లీ అన్నీ మారతాయని, థియేటర్ లోనే సినిమా చూసే రోజులు వస్తాయని దిల్ రాజు చెప్పారు.

ఎంటర్ టైన్ చేయకుంటే..

సినిమా ఓల్డ్ ఫార్మాట్ నా.. న్యూ ఫార్మాట్ నా అన్నది కాదు. సినిమా నచ్చలేదంటే జ‌నాలని ఎంటర్ టైన్ చేయలేదనే అనుకోవాలని హీరో నాని అన్నారు. సరిపోదా శనివారం మీడియా మీట్ లో ఓ ప్రశ్నకు సమాధానంగా నాని మాట్లాడుతూ ఙనాలను ఎంటర్ టైన్ చేయగలిగేలా కథ చెప్పడం అవసరం అని వివరించారు.

4 Replies to “కంటెంట్ కనెక్ట్ అయితేనే.. ఓపెనింగ్”

Comments are closed.