ఆర్ఆర్ఆర్ అలా…కేజిఎఫ్ ఇలా

వడ్డించేవాడు మనవాడైతే కడపంక్తిని వున్నా అన్నీ అందుతాయి. సినిమా 'మనవాళ్లదైతే' ఎక్కడలేని ఫిగర్లు పుట్టుకువస్తాయి. నిన్నటి ఫిగర్లు ఈ రోజు చెప్పడం కాదు, రేపటి ఫిగర్లు కూడా ఈ రోజే వేసేస్తారు. పైగా రేపు…

వడ్డించేవాడు మనవాడైతే కడపంక్తిని వున్నా అన్నీ అందుతాయి. సినిమా 'మనవాళ్లదైతే' ఎక్కడలేని ఫిగర్లు పుట్టుకువస్తాయి. నిన్నటి ఫిగర్లు ఈ రోజు చెప్పడం కాదు, రేపటి ఫిగర్లు కూడా ఈ రోజే వేసేస్తారు. పైగా రేపు ఇంత చేసే అవకాశం వుంది. అంత చేస్తుంది అని జోస్యాలు చెప్పి, మర్నాడు ఆ జోస్యాలకు కాస్త అటు ఇటు ఫిగర్లు వేస్తారు.

ఇక ఓవర్ సీస్ కు వస్తే ఆర్ఆర్ఆర్ కెనడా సెపరేట్ గా అమ్మేసుకున్నా దాన్ని తీసుకువచ్చి యుఎస్ లెక్కల్లో వేసేస్తారు. ఏ వెర్షన్ ఎంత చేసిందో చెప్పకుండా అన్నీ కలిపి ముద్ద అంకెలు పడేస్తారు. ఆ విధంగా పెద్ద అంకెలు కనిపించేలా చేస్తారు. 

కానీ అదే కేజిఎఫ్ కు వచ్చేసరికి అన్నీ మారిపోతాయి. అన్నీ విడివిడిగా వేస్తూ వీలయినంత తక్కువ అంకెలు కనిపించేలా జాగ్రత్త పడతారు. హిందీ వెర్షన్ కూడా బాగా చేస్తుంటే దాన్ని మిగిలిన వాటికి కలపరు. 

ఇలా చాలా అంటే చాలా జిమ్మిక్కులు చేస్తారు. ఆర్ఆర్ఆర్ రేపటి లెక్కలు ఈరోజు వస్తాయి. కేజిఎఫ్ లెక్కలు ఏ రోజువి ఆ రోజుకే రావు. ఆర్ఆర్ఆర్ కు గ్రాస్ నుంచి నెట్ లు కట్టి, అవే షేర్ల కింద ప్రచారం సాగించేసారు. కానీ అదే కేజిఎఫ్ కు మాత్రం షేర్ లు కడతారు. 

ఏమిటో ఈ అంతరం?