తరం మారుతోంది. అభిరుచులు మారుతున్నాయి. ఇప్పటికీ ఇంకా డ్రామానే పట్టుకువేలాడితే చూసే జనం తగ్గిపోతున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఇంకా ఆ డ్రామానే ది బెస్ట్ అనుకుంటున్నట్లుంది. సినిమాలో డ్రామా సంగతి అలా వుంచితే ప్రమోషన్ల విషయంలో అయినా వైవిధ్యంగా ట్రయ్ చేయాల్సి వుంది.
ఇవ్వాళ రేపు తెలుగులో ప్రతి సినిమా పబ్లిసిటీ కొత్త పుంతలు, కొత్త ఆలోచనలు తొక్కుతోంది. కానీ ఆచార్య సినిమా ప్రమోషన్ మాత్రం ఇంకా డ్రామా చుట్టూనే తిరుగుతున్నట్లు కనిపిస్తోంది.
చిరు..చరణ్ కాంబినేషన్ పాట అనౌన్స్ మెంట్ కోసం చేసిన చిన్న విడియో చూస్తే జనాలు ఇలాగే ఫీలవుతున్నారు. ఇద్దరి డ్యాన్స్ ను ఎలా ప్లాన్ చేయాలా అని దర్శకుడు కొరటాల కిందా మీదా కావడం, చరణ్ ఎలా డామినేట్ చేస్తాడో అని చిరు, డాడీని ఎప్పటికీ డామినేట్ చేయలేనని చరణ్, ఈ 'పరస్పర డబ్బా'ల వ్యవహారానికి కాలం చెల్లిపోయిందని గమనించాల్సి వుంది.
ఈ సంగతి అలా వుంచితే చిరు..చరణ్ ల పాట ప్రోమో వచ్చింది. మణిశర్మ కూడా తన స్టయిల్ గీత దాటకుండా, క్యాచీ ట్యూన్ చేసినట్లు కనిపిస్తోంది. ఆల్రెడీ 'చానా కష్టం వచ్చిందే మందాకినీ' కూడా ఇలాంటి రెగ్యులర్ క్యాచీ ట్యూన్ నే. నక్సలైట్ లీడర్ ఏమిటో,అయిటమ్ సాంగ్ అందుకోవడం ఏమిటో?
అందువల్ల సినిమా మరీ రెగ్యులర్ ఓల్ట్ ఫార్మాట్ అనే కలర్ రాకుండా వుండాలంటే పబ్లిసిటీ విషయంలో అయినా 'చిరు' జోక్యం చేసుకోకుండా కొరటాలకు వదిలేయడం బెటరేమో అన్న కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.