విశ్వంభర పాటలు.. మెగా స్టెప్పులు

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విశ్వంభర ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి, కొన్ని అప్ డేట్స్ కూడా అందించాడు దర్శకుడు వశిష్ఠ. మరీ ముఖ్యంగా సాంగ్స్ పై కీలకమైన అప్ డేట్స్ ఇచ్చాడు. Advertisement “లాంగ్…

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విశ్వంభర ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి, కొన్ని అప్ డేట్స్ కూడా అందించాడు దర్శకుడు వశిష్ఠ. మరీ ముఖ్యంగా సాంగ్స్ పై కీలకమైన అప్ డేట్స్ ఇచ్చాడు.

“లాంగ్ గ్యాప్ తర్వాత చిరంజీవి, కీరవాణి కలిసి పనిచేస్తున్నారు. దీంతో కీరవాణి గారు కసితో వర్క్ చేస్తున్నారు. సినిమాలో థీమ్స్ కాకుండా 5 పాటలున్నాయి. పాటల కంపోజిషన్ పూర్తయింది. ఒక్కొక్క సాంగ్ ఒక్కో స్టయిల్ లో ఉంటుంది.”

ఈ సందర్భంగా మరో కీలకమైన అప్ డేట్ కూడా ఇచ్చాడు దర్శకుడు. చిరంజీవిలో ఓ కొత్త డాన్సర్ ను చూస్తారని చెబుతున్నాడు. కొన్ని సార్లు కట్ చెప్పడం కూడా మరిచిపోయాడంట.

“చిరంజీవి డాన్సులు అద్భుతం. ఆయన సెట్స్ లో డాన్స్ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోయేవాడ్ని. సినిమాలోని ఓ సాంగ్ లో సిగ్నేచర్ స్టెప్ ఉంది. మూవీ రిలీజైన తర్వాత అది వైరల్ అవ్వడం ఖాయం. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన మూమెంట్ అది.”

విశ్వంభర సినిమా ప్రచారం కోసం ప్రత్యేకమైన రూట్ మ్యాప్ రెడీగా ఉందని స్పష్టం చేశాడు వశిష్ఠ. టీజర్ రిలీజ్ డేట్ త్వరలోనే ఇస్తామని.. అక్కడ్నుంచి గ్యాప్ లేకుండా విశ్వంభర సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తామని తెలిపాడు. ఇక సినిమా కథపై స్పందిస్తూ.. విశ్వంభరలో ఫాంటసీ ఎలిమెంట్స్ తో పాటు.. డివోషనల్ అంశాలు కూడా ఉంటాయని.. సినిమా మొత్తమ్మీద క్లయిమాక్స్ పార్ట్ చాలా కీలకమని, తనకు ఇష్టమైన ఎపిసోడ్ కూడా అదేనని అన్నాడు.

17 Replies to “విశ్వంభర పాటలు.. మెగా స్టెప్పులు”

Comments are closed.