తెలుగు ఎంటర్ టైన్ మెంట్ ఛానెళ్లలో ఇదో వింత పరిస్థితి. వీకెండ్ వస్తే గంటలు గంటలు ఏం నింపాలి, ప్రేక్షకుల్ని ఎలా కూర్చోబెట్టాలనేది ఛానెళ్లకు కత్తిమీద సాములా మారింది. ఓటీటీ విజృంభనతో టీవీ చూడడం తగ్గించేశారు జనం. వీకెండ్స్ లో కూడా ఏదో ఒక సినిమా పెట్టుకుంటున్నారు తప్ప, ఛానెళ్ల జోలికి పోవడం లేదు.
దీనికితోడు సినిమాల శాటిలైట్ రైట్స్ తీసుకోవడం కూడా తగ్గించేశాయి చాలా ఛానెళ్లు. ఎవరి ప్లాన్స్ లో వాళ్లున్నారు. ఈ క్రమంలో జెమినీ, జీ తెలుగు ఛానెళ్లు.. వారాంతం వచ్చేసరికి పూర్తిగా ఏదో ఒక వైపు మొగ్గుతున్నాయి.
ఉదాహరణకు జెమినీ టీవీనే చూసుకుంటే, వీళ్లు ఫిక్షన్ లో చాలా వీక్. ఈ ఛానెల్ లో సీరియల్స్ చూసేవాళ్లు చాలా తక్కువ. ఇక నాన్-ఫిక్షన్ అనే విభాగమే లేదిక్కడ. తారల ఇంటర్వ్యూలు లేదా యాంకర్లతో చేసే వినోదాత్మక కార్యక్రమాలు జెమినీలో మచ్చుకు కూడా కనిపించవు. దీంతో శని, ఆదివారాలు వచ్చేసరికి వీళ్లు తమ దగ్గరున్న సినిమాల్నే నమ్ముకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఆదివారం నాడు ఉదయం నుంచి రాత్రి వరకు సినిమాలు తప్ప ఇంకేం కనిపించవు.
ఇప్పుడు జీ తెలుగు కూడా దాదాపు ఇదే ఫార్ములాలోకి మారింది. వీళ్ల దగ్గర సినిమాలు తక్కువ, సీరియల్స్ ఎక్కువ. స్టార్ మా ఛానెల్ అంత కాకపోయినా, ఉన్నంతలో ఫిక్షన్ లో వీళ్లు స్ట్రాంగ్. అందుకే వారాంతంలో వీళ్లు సినిమాలు తగ్గించాలని నిర్ణయించుకున్నారు. మరీ ముఖ్యంగా ఆదివారం ప్రైమ్ టైమ్ లో ఇక సినిమాలు ప్రసారం చేయరు.
సోమవారం నుంచి శనివారం వరకు ప్రైమ్ టైమ్ లో ఏ సీరియల్స్ అయితే ప్రసారం అవుతున్నాయో, అవే సీరియల్స్ ను వీళ్లు ఆదివారం కూడా కొనసాగించబోతున్నారు. ఈ ఆదివారం నుంచే ఇది అమల్లోకి వస్తోంది.
ఉన్నంతలో స్టార్ మా ఛానెల్ మాత్రమే ఇటు సినిమాల్ని, అటు సీరియల్స్ ను బ్యాలెన్స్ చేస్తూ, వీకెండ్ వస్తే నాన్-ఫిక్షన్ కార్యక్రమాలు ప్రసారం చేస్తూ టాప్ లో దూసుకుపోతోంది. ఇక బిగ్ బాస్ కూడా మొదలైతే ప్రత్యర్థి ఛానెళ్లకు వీకెండ్స్ లో వణుకే.
vc available 9380537747
vc estanu 9380537747
సాక్షి కూడా ఇక 2019 – 2023 న్యూస్ రిపీట్ వేసుకుంటూ కాలక్షేపం చెయ్యాలి
Call boy works 8341510897
జనం పట్టించుకోరు
Movie aithe 3 hours lo aipothundhi, TV programme serials years to years infinity